Homeసినిమామహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు తెలుగులో ఉండే క్రేజ్ వేరు.

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు తెలుగులో ఉండే క్రేజ్ వేరు.

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌కు తెలుగులో ఉండే క్రేజ్ వేరు. వారిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ ఫేవరేట్ సినిమాలే. ఇప్పుడు వీరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. ఈ మూవీ షూటింగ్ ఇది వరకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సీన్ కట్ చేస్తే..షూటింగ్ లో త్రివిక్రమ్ కి సూపర్ స్టార్ ఓ కాండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

చాలాకాలం క్రితమే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు… ఆ తర్వాత సినిమా త్రివిక్రమ్ తో ఉంటుందని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. అయితే తర్వాత ఆ షెడ్యూల్ షూటింగ్ నచ్చలేదని మళ్లీ రీ షూట్ చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే.. మహేష్ తల్లి ఇందిరాదేవి చనిపోవడం… ఆ తర్వాత మహేష్ తండ్రి కృష్ణ చనిపోవడంతో ఇప్పటివరకు మళ్లీ ఆ సినిమా షూటింగ్ జోలికి వెళ్లలేదు.

ఈ సినిమాని ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగ వంశీ ప్రకటించారు. అయితే షూటింగ్ స్టేటస్ ఏమిటో కూడా తెలియకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని అంటున్నారు. అదేమిటంటే ఇప్పటివరకు మహేష్ బాబు కారణంగానే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ సహా నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే ఈ సినిమా పూర్తయిన వెంటనే.. మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు సిక్స్ ప్యాక్లో కనిపించాలని రాజమౌళి కండిషన్ పెట్టడంతో… ఇప్పుడు మహేష్ బాబు వీలైనంత త్వరగా త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి బాడీ బిల్డింగ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ సహా నిర్మాతలకు టార్గెట్ పెట్టాడని అంటున్నారు. మొత్తం మీద జక్కన్న మహేష్ బాబుకి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆయన వీలైనంత త్వరగా త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి జక్కన్నకు అందుబాటులోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

Must Read

spot_img