తెలుగు సినీ ఇండస్ట్రీలో అభిమానులను ప్రేమగా ఆదరించే హీరోల్లో మెగా ఫ్యామిలీ ముందుటుంది. ఆ ముందు వరసలో రామ్ చరణ్ ఒకరు. ఇటీవలే ఆస్పత్రిలో ఓ చిట్టి అభిమాని కోరిక తీర్చిన చెర్రీ మరోసారి తన ఉదారత ప్రదర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో అభిమానులతో మీట్ నిర్వహించారు. అభిమాన హీరోతో ఫోటో దిగాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అయితే సెక్యూరిటీ కారణాలతో కొంతమందిని అనుమతించపోవడం సహజం. అలాగే చెర్రీ ఫ్యాన్స్ మీట్ జరుగుతుందని తెలుసుకున్న చిట్టి అభిమాని వేదిక వద్దకు చేరుకున్నాడు. అవసరాల్లో ఉన్న ఫ్యాన్స్ ను ఆదుకోవడమే కాదు, తనను కలిసేందుకు వచ్చిన వారిని నిరుత్సాహ పరచడని రామ్ చరణ్ కు గుర్తింపు ఉంది. ఫ్యాన్స్ మీట్లో ఓ యువ అభిమాని చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాడు.
ఆ యువ అభిమాని తన ఆరాధ్య హీరో రామ్ చరణ్ ను చూశాక తీవ్ర భావోద్వేగాలకు లోనై కన్నీటిపర్యంతమయ్యాడు. ఆ కుర్రాడిని రామ్ చరణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుర్రాడు తిరిగి తన స్వస్థలానికి వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకోవాలంటూ తన సిబ్బందికి అర్డర్ వేశారు. అంతేకాదు, ఆ బాలుడితో ఫొటో దిగి సంతోషపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. దీంతో చెర్రీ అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. దటీజ్ రామ్ చరణ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.