Homeఅంతర్జాతీయంన్యూజిలాండ్ కు తలనొప్పిగా మారిన పిల్లి..

న్యూజిలాండ్ కు తలనొప్పిగా మారిన పిల్లి..

న్యూజిలాండ్ లో పక్షిజాతుల వైవిధ్యం అపారంగా కనిపిస్తుంది.. ఇందుకు కారణం ఆహారపు నిచ్చెనలో పైన ఉండే జంతువులు లేకపోవడమే.. అయితే.. పిల్లుల రాకతో అక్కడ పరిస్థితి మారిపోయింది.. న్యూజిలాండ్ లో పిల్లులు ఎందుకు తలనొప్పిగా మారాయి…?

న్యూజిలాండ్ లో ఏ జాతుల అంతానికి పిల్లులు కారణమయ్యాయి..?
పిల్లుల నియంత్రణపై చట్టాలు ఉన్నాయా..? జాతీయ పిల్లి చట్టం కోసం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు..?
సముద్రపు జంతువులూ అంతరిస్తున్నాయా…?

న్యూజీలాండ్‌ లో పక్షిజాతుల వైవిధ్యం అపారంగా కనిపిస్తుంది. ఒక ప్రాణిని మరొక ప్రాణి చంపి తినే ఆహారపు నిచ్చెనలో పైన ఉండే జంతువులు లేకపోవడమే ఈ వైవిధ్యానికి కారణం. అయితే,పిల్లుల రాకతో పరిస్థితి మారిపోయింది. ఇక్కడ పక్షి జాతులు అంతరించడంలో పిల్లులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.కాబట్టి, ఇప్పుడు పిల్లులను ఆదరించే విధానంలో న్యూజీలాండర్లను తమ వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లియాల్స్ రెన్ అనే జాతి పక్షులు చాలా తరాలుగా న్యూజీలాండ్ మారుమూల ప్రాంతంలో దక్షిణ పసిఫిక్ సముద్రం దిగువన ఉండేవి. అదంతా వేటగాళ్లయిన క్షీరదాలు
లేని ప్రాంతం.

మావోరీ తెగ పూర్వీకులు 13వ శతాబ్దంలో ఈ నేల మీదకు అడుగుపెట్టడంతో ఇక్కడ జన జీవనం మొదలైంది. ఆ సమయంలో ఇక్కడ ఎగరలేని చిన్న పక్షులు ఉండేవి. తమను ఆహారంగా వేటాడే ప్రాణుల నుంచి రక్షించుకునే శక్తి కూడా వాటికి ఉండేది కాదు.

ఇక, యూరప్ వలసదారులు ఇక్కడికి వచ్చేనాటికి, అంటే 19వ శతాబ్దం ప్రారంభంలోనే ఆ పక్షి రెండు ప్రధాన దీవుల్లో అంతరించిపోయింది.

స్టీఫెన్స్ అనే ఒక చిన్న దీవిలో మాత్రమే కొన్ని పక్షులు మిగిలాయి. న్యూజీలాండ్ కుక్ స్ట్రెయిట్ దక్షిణ ప్రాంతంలో ఉండే చిన్న దీవి అది. 1894వ ఏడాది స్టీఫెన్స్ ద్వీపంలో లైట్‌హౌస్‌ ఏర్పాటు తర్వాత లియాల్స్ రెన్ గురించిన సమాచారం యూరోపియన్ సైన్స్‌
విభాగాలకు తెలిసింది.అయితే, లైట్‌హౌస్ కీపర్లు కొందరు అక్కడికి పిల్లులను తీసుకువచ్చారు. వాటిలో ఒకదాన్ని “టిబుల్స్” అని పిలిచేవారు. ఇది త్వరగా సంతానం ఉత్పత్తి చేసింది.

ఏడాదిలోనే ఆ పిల్లులు లియాల్స్ రెన్‌ జాతి పక్షులను తుడిచిపెట్టాయి. న్యూజీలాండ్ విలక్షణమైన స్థానిక పక్షి జాతులు మిలియన్ల సంవత్సరాల తర్వాత మహాఖండం గోండ్వానా వేరైనప్పటి నుంచి బాగానే బతికాయి.దేశానికి చిహ్నంగా మారిన కివి పక్షులు చాలా వరకు ఎగరడం మర్చిపోయాయి.

తమను వేటాడే జంతువులు వచ్చే నాటికి న్యూజీలాండ్ స్థానిక పక్షి జాతులు ఆ పరిణామాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. ఈ సమస్యను అధిగమించడానికి న్యూజీలాండ్ దీనిపై దృష్టి పెట్టింది.

శతాబ్దానికి పైగా ఈ పక్షిని సంరక్షించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దానిలో ప్రిడేటర్ ఫ్రీ 2050 అనే కార్యక్రమం ఒకటి. ఈ ప్రణాళికలో ఎలుకలు, స్టోట్స్, ఫెర్రెట్‌లు, వీసెల్స్, పాసమ్స్ లాంటి జాతులను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఒక జంతువును మాత్రం ఈ జాబితాలోకి చేర్చలేదు. అవే ఫెరల్ పిల్లులు. అది పొరపాటేనని, దానిని కూడా జాబితాలో చేర్చాలని ఈ ఉద్యమప్రచారకులు డిమాండ్ చేస్తున్నారు.కొన్ని గ్రూపులు నేషనల్ క్యాట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కోసం ఒత్తిడి చేస్తున్నాయి.ఇక ఇప్పుడు పిల్లులను పెంచుకోవడంలో న్యూజీలాండ్ కుటుంబాలకు అనేక సందేహాలు మొదలయ్యాయి.ఇంట్లో పెంచుకునే పిల్లులను బయటకు రాకుండా కట్టడి చేయాలా అన్నది ప్రధానమైన ప్రశ్న. పిల్లలను పెంచుకునే వారిలో ప్రపంచంలోనే అత్యధిక సగటు న్యూజీలాండ్‌ది. ఆ దేశంలో దాదాపు సగం ఇళ్లల్లో కనీసం ఒక పిల్లి ఉంటుంది.

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ… ఇవి పూర్తిగా సంతానం కనలేనివి మాత్రం కాదు.కొన్ని ప్రాంతాల్లో పిల్లులు కుటుంబనియంత్రణ చేయడానికి ముందు పిల్లలను కనొచ్చు.పిల్లులలో కేవలం 12 శాతం మాత్రమే సంతానోత్పత్తి చేస్తున్నప్పటికీ, వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది..

న్యూజీలాండ్‌ లో ఎన్ని అడవి పిల్లులు ఉన్నాయో ఎవరికీ తెలియదు, కానీ వాటి సంఖ్య 25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. దేశంలోని ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరు పిల్లిని పెంచుకుంటారు.అడవి పిల్లులు పర్వతాల నుంచి తీర ప్రాంతాల వరకు వలస వచ్చేశాయి.. పల్లెల్లో ఆకలితో ఉన్న జంతువులు చాలా ఉన్నాయి. పిల్లులు సహజంగా ఓపికగా వేటాడతాయి. ఇవి న్యూజీలాండ్‌ లో ఎగరలేని పక్షుల సంతతిపై అధిక ప్రభావాన్ని చూపాయి.

“అవి 11 పక్షి జాతులను అంతం చేశాయి. మరో 10 జాతులు నాశనమయ్యే పరిస్థితికి కారణమయ్యాయి.. ఇప్పుడు మిగిలిన వాటిని తినడానికి సిద్ధమయ్యాయి. వాటిలో బల్లులు, సకశేరుకాలు, అంతరించిపోతున్న స్థానిక గబ్బిలాలు ఉన్నాయి.పెంగ్విన్ లను తింటున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయని అమేలియా అంటున్నారు. కొండపైన ఉన్న బల్లులను కూడా తింటున్నాయి.

ఈ దేశంలో అమెరికా మాదిరి యురేషియన్ క్రేన్ పక్షిలా ఒక జాతి అంతరించినప్పుడు, కొత్త సంతతి ప్రారంభించడానికి జర్మనీకి వలసపోయే విధానం దానికి లేదు. ప్రతి సంవత్సరం 1.1మిలియన్ల స్థానిక పక్షులు, వలసవచ్చిన పది మిలియన్ల పక్షుల మరణానికి అడవి పిల్లులు కారణమని రాయల్ ఫారెస్ట్, బర్డ్ ప్రొటెక్షన్ సొసైటీ అంచనా వేసింది.

చిలుక, కాకాపో వంటి పక్షులు మాత్రం మనుగడ సాగించాయి. ఎందుకంటే అవి సంతానోత్పత్తి సంఖ్య తగ్గిపోకముందే ఇతర ద్వీపాలకు తరలిపోయాయి.

ఇప్పుడు ప్రమాదంలో ఉన్నవి చిన్న పక్షులు లేదా నెమ్మదిగా కదిలే పక్షులు మాత్రమే కాదు.

న్యూజీలాండ్‌ లోని మంచుతో కూడిన ఎత్తైన ప్రదేశంలో కొన్నిసార్లు గొర్రెలను వేటాడే బలమైన ఆల్పైన్
చిలుక అయిన ‘కీ’ల సంఖ్య భారీగా తగ్గడానికి పిల్లులూ కారణంగా చెబుతున్నారు.

పిల్లుల వేటకు పక్షులు బలవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. చాలా పక్షులు ఎగరలేవు. అవి గూడు కట్టుకుని నేలపై పరిగెడుతాయి. పిల్లులే ఇక్కడ పెద్ద మాంసాహారులు.. ఈ పిల్లుల ప్రభావం అక్కడికే పరిమితం కాలేదు. న్యూజీలాండ్ సముద్ర వాతావరణంలో కూడా అడవి పిల్లుల సంతతి ప్రభావం కనిపిస్తోంది.. టాక్సిప్లాస్మా లేదా టాక్సోలు పరాన్నజీవులు. అడవి పిల్లుల నుంచి అవి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఇది అక్కడి దేశీయ డాల్ఫిన్ జాతుల మరణాలపై కూడా ప్రభావం చూపించింది.. ఒక పిల్లి ప్రవాహానికి
సమీపంలో మలవిసర్జన చేస్తే, వరదలు వచ్చినప్పుడు ఆ తిత్తులు సముద్రంలోకి కొట్టుకుపోతాయి. తర్వాత అవి ఇతర జంతువుల శరీరంలోకి ప్రవేశిస్తాయి.

అందుకే కేవలం అడవి పిల్లుల సంఖ్య నియంత్రణ మాత్రమే ఆయా పరిరక్షణ గ్రూపులు కోరడం లేదు.

యజమానులు ముఖ్యంగా న్యూజీలాండ్ వాసులు తమ పిల్లులు ఎలా జీవించాలో పునరాలోచించాలని కోరుకుంటున్నారు. అవి దేశం విస్తృత సహజ పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలంటున్నారు..

గత దశాబ్దం నుంచి పరిరక్షణ, పిల్లుల సంక్షేమ సమూహాలు అన్ని పిల్లుల సంఖ్యపై బహిరంగ చర్చకు ప్రయత్నించాయి.వారంతా పెంపుడు పిల్లులకు మైక్రోచిప్ అమర్చడం, కుటుంబ నియంత్రణ చికిత్స అవసరమయ్యే నేషనల్ క్యాట్ యాక్ట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ప్రచారం చేస్తున్నారు. న్యూజీలాండ్ ఒకవేళ క్యాట్ యాక్ట్ రూపొందిస్తే అది జాతీయ స్థాయిలో మొదటిది అవుతుంది.

“పెంపుడు పిల్లుల గుర్తింపు, నమోదు, స్టెరిలైజేషన్” అవసరమయ్యే క్యాట్ యాక్ట్ 2011 అనేది ఫెడరల్ స్థాయిలో కాకుండా రాష్ట్రంలో ఉన్న ఒక చట్టం.

టాస్మేనియా రాష్ట్రంతో పాటు, ఆస్ట్రేలియా క్యాపిటల్ టెరిటరీలో కూడా 2009 నుంచి ఉన్న క్యాట్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ను అమలుచేసినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియా మాత్రమే దీనిని అమలుచేస్తోంది. న్యూజిలాండ్ లో పక్షి జాతులు అంతరించడంలో పిల్లులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి, ఇప్పుడు పిల్లులను ఆదరించే విధానంలో న్యూజీలాండర్లను తమ వైఖరిని మార్చుకోవాల్సిన
పరిస్థితి ఏర్పడింది.

Must Read

spot_img