HomePoliticsతెలంగాణలో కోవర్టుల సందడి పెరిగిపోయింది...!

తెలంగాణలో కోవర్టుల సందడి పెరిగిపోయింది…!

రండి రండి రండి.. దయ చేయండి.. అంటూ తెలంగాణలో బీజేపీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈమేరకు ద్వారాలన్నీ తెరిచిపెట్టింది. ఈ క్రమంలో రెండు పార్టీలకు చెందిన కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీతో టచ్‌లోకి వెళ్లారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున.. అప్పటి వరకు ప్రస్తుత పార్టీల్లోనే ఉండి.. ఎన్నికల వేళ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఇందులో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే.. బీజేపీతో టచ్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు కోవర్ట్‌ ఆపరేషన్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య ప్రధాన పోటీ ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్‌ బలహీన పడి బీజేపీ బలపడుతూ వస్తోంది.

ఇక టీఆర్‌ఎస్‌ కాస్త బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందింది. బీఆర్‌ఎస్‌కు తామే ప్రధాన ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు అంటున్నారు. రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. మునుగోడులో ఓడినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి చుక్కలు చూపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌తోపాటు మరికొన్ని పార్టీలు కూడా తెరపైకి వచ్చాయి. తెలంగాణలో టీడీపీ లేదనేవాళ్లకు ఖమ్మం సభే నిదర్శనమని బాబు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.మరోవైపు అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దింపేందుకు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు వైఎస్సార్‌టీపీ, బీఎస్పీ, జనసేన రంగంలోకి దిగనున్నాయి.

ఇప్పటివరకు కాంగ్రెస్ లో కోవర్టులన్న టాక్ వెల్లువెత్తింది.

మరోవైపు తెలంగాణలో సైలెంట్‌గా వర్క్‌ చేసుకుంటూ పోతున్న బీజేపీ వ్యూహకర్తలు అధికార పార్టీలో ఉన్న కొంతమందిని బీజేపీ కోవర్టులుగా మార్చారు. కేసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణల నేపథ్యంతో బీజేపీ తాజాగా వ్యూహం మార్చి.. గులాబీ నేతలతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీతో ఎమ్మెల్యేలతోపాటు, కొంతమంది మంత్రులు కూడా టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరు బీఆర్‌ఎస్‌ వ్యూహాలు, కేసీఆర్‌ స్ట్రాటజీ, ఎన్నికల ప్లాన్‌ గురించి ఎప్పటికప్పుడు బీజేపీ వ్యూహకర్తలకు సమాచారం చేరవేస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఆపరేషన్‌ లోటస్‌లో భాగంగా బీఆర్‌ఎస్‌ నేతలతోనే ఆ పార్టీని తెలంగాణలో పతనం చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందన్న రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి బీజేపీలో టచ్ లో ఉన్నారన్న విషయం ఒక్కసారిగా గుప్పుమంది. అదేంటి ఆయన మొన్నే కదా ఐటీ అధికారులపై సైతం దాడుల్లాంటి వాటికి ప్రయత్నించి.. కేసీఆర్ ఉండగా తనకేం కాదని.. ప్రకటించారని అనుకుంటున్నారు. కేసీఆర్ పై అంత విశ్వాసం ప్రకటించి.. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారా అన్న ఆశ్చర్యం చాలా మందిలో ఉంది. అయితే తెర వెనుక విషయాలు మాత్రం మెల్లగా వెలుగులోకి వస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. మామూలుగా ఇలాంటి సమావేశాలు.. పార్టీ హైకమాండ్‌కు తీవ్ర ఆగ్రహం కలిగిస్తాయి. కానీ మైనంపల్లి హన్మంతరావు నేతృత్వంలో జరిగిన ఆ సమావేశంపై పార్టీ హైకమాండ్ పెద్దగా స్పందించలేదు.

ఎమ్మల్యేలు మల్లారెడ్డికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు తాజాగా వారు .. గ్రూపుగా తిరుమల కూడా వెళ్లారు. దీనిపై బీఆర్ఎస్‌లో పెద్దగా హడావుడేం జరగడం లేదు. ఎందుకంటే.. వారు మల్లారెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపించింది.. హైకమాండ్ సూచనలతోనేనన్న సమాచారం బీఆర్ఎస్ లో అంతర్గతంగా అందరికీ తెలిసింది. మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడుల తర్వాత వారి వ్యవహారాలు మొత్తం బయట పడ్డాయి. మెడికల్ కాలేజీలు..ఇంజినీరింగ్వ్య వహారాల్లో ఈడీని కూడా రంగంలోకి దిగాలని ఐటీ కోరింది. కానీ ఈడీ ఇంత వరకూ ఆ వైపుగా దిగలేదు. మామూలుగా అయితే ఈడీ కూడా ఈపాటికే సెర్చ్ చేసి ఉండేది. కానీ
ఏమీ జరగకపోవడానికి కారణం .. మల్లారెడ్డి బీజేపీతో టచ్ లోకి వెళ్లారని.. జంప్ అవడానికి ఓకే చెప్పారన్న విషయం.. బీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసిందంటున్నారు. అందుకే ఆయనపై అసమ్మతిని ప్రోత్సాహిస్తున్నారని.. క్లారిటీ రాగానే పదవి నుంచి కూడా తప్పించే అవకాశం ఉందంటున్నారు.

తాజాగా అధికార పార్టీలోనూ కోవర్టులున్నారన్న వార్త .. బీఆర్ఎస్ లోఅంతర్గతంగా కాక రేపుతోంది.

దీంతో మల్లారెడ్డి రాజకీయం మరో మలుపు తిరగనుందని తెలంగాణలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అందుకే హైకమాండ్ సైతం మల్లారెడ్డి విషయంలో సైలెంట్ అయిందని తెలుస్తోంది. అయితే ఒక్క మల్లారెడ్డినేనా .. ఇంకా ఎవరైనా నేతలు అదే బాటలో ఉన్నారా అన్న పరిశీలనలో అధిష్టానం ఉందన్నది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో టెన్షన్ పెట్టిస్తోంది. దీంతో ఎంతమంది టచ్ లో ఉన్నారన్నదే ఇప్పుడు పార్టీలో,రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉండేది. ఆ త‌ర్వాత కాంగ్రెస్ బ‌ల‌హీన ప‌డి బీజేపీ బ‌ల‌ప‌డుతూ వ‌స్తోంది. బీఆర్ఎస్‌కు తామే ప్ర‌ధాన ప్ర‌త్యామ్నాయం అని బీజేపీ నేత‌లు అంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్ఎస్‌తో పాటు మ‌రికొన్ని పార్టీలు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. కానీ.. తెలంగాణలో రేపో మాపో ఎలక్షన్ అనేంతలా సీన్ మారిపోయింది. దానికి కారణం జంపింగ్జ పాంగ్ లే. తమతో చాలా మంది నాయకులు టచ్ లో ఉన్నారని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తెగ హడావుడి చేస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ కు ఆ అవకాశం లేదు. ఎందుకంటే.. ఉన్నవారితోనే రోజుకో పంచాయితీ నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా చేర్చుకునే ఛాన్స్ లేదు. కాంగ్రెస్, బీజేపీ అయితే జంపింగ్ జపాంగ్ ల కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఇదే అదునుగా బీజేపీ పెద్దలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మునుగోడు తరహాలోనే ఇంకొన్ని ఉప ఎన్నికలు ఉంటాయని బండి సంజయ్ అన్నారు.

బండి వ్యాఖ్యలపై జోరుగా చర్చ సాగుతోంది

దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి వ్యాఖ్యలపై జోరుగా చర్చ సాగుతోంది. వీళ్లలో ఎంతమంది బీజేపీకి టచ్లో ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్న. మొన్నామధ్య చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ కూడా ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలకు లిస్ట్ ఇచ్చారని ప్రచారం సాగింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో చేరికల తుపాను ఉంటుందని అనౌన్స్ చేశారు. దీంతో బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలేనా? ఇంకా ఎంతమంది టచ్ లో ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇక కాంగ్రెస్ కూడా దేనికి తగ్గడం లేదు. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు తమతో టచ్‌ లో ఉన్నారని చెబుతోంది. అయితే సీనియర్ల రచ్చతో కాంగ్రెస్ బలహీనంగా ఉందనే విమర్శలు ఉన్నాయి.

రేవంత్ దూకుడుతో బలం పుంజుకున్నా.. తాజా పరిణామాలతో తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి. అయినా.. మంత్రులు కూడా టచ్ లో ఉన్నారని అనడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, టీఆర్ఎస్ లో వర్గపోరు భారీగా ఉంది. నిజానికి ఎన్నికల నాటికి టీఆర్ఎస్ లో ఎంతమంది ఉంటారో తెలియని పరిస్థితి. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీలో ఉన్నారు. కొన్నిచోట్ల అయితే.. నలుగురు బరిలో నిలుస్తున్నారు. సిట్టింగులకే టిక్కెట్లు అనడంతో,చాలామంది నేతలు జంప్ అవడం ఖాయం. అలాంటి వారికే బీజేపీ, కాంగ్రెస్ గాలం వేస్తున్నాయి. ఈ సమయంలో ఎంత మంది జాయిన్ అయితే.. అంత మైలేజ్ వస్తుందనిగట్టిగా నమ్మి స్టేట్ మెంట్స్ ఇస్తున్నాయి.

మరి ఎన్నికల నాటికి ఏమవుతుందన్నదే హాట్ టాపిక్ గా మారింది.

Must Read

spot_img