Homeతెలంగాణఅధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నాలు...దీంతో తెలంగాణలో అధికారం సాధించనుందా..?

అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నాలు…దీంతో తెలంగాణలో అధికారం సాధించనుందా..?

యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎలా అధికారాన్ని నిలబెట్టుకున్నారో అదే ఫార్ములాతో తెలంగాణలో అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ మొదట వీధి సమావేశాలు.. తర్వాత నియోజకవర్గ, జిల్లాస్థాయి సమావేశాలు.. తర్వాత భారీ బహిరంగసభలు నిర్వహించారు. తెలంగాణలోనూ అదే చేయాలని నిర్ణయించుకున్నారు.ముందుగా వీధి సమావేశాలు ప్రారంభించారు. ప్రజాగోస -బీజేపీ భరోసా యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది బీజేపీ. భరోసా కార్యక్రమంలో 11వేల గ్రామాల్లో సభలు చేపట్టనుంది.బీజేపీ భరోసా యాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ విజయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

కార్యక్రమంలో గ్రామీణ యువత ఎక్కువగా పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. కేసీఆర్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలను గ్రామ సభలతో తమవైపు తిప్పుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల తర్వాత అగ్రనేతలతో రెండోదశలో మండలం యూనిట్‌గా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట బైక్‌ర్యాలీలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇక, మూడోదశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేస్తారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అగ్రనేతలతో భారీ బహిరంగసభలు నిర్వహించడానికి బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోగానే నాలుగైదు బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా బీజేపీ ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో బీజేపీ యూపీ ఎన్నికల ఫార్మాట్‌ను పూర్తిగా తెలంగాణలో అమలు చేస్తోంది.

కాకపోతే అక్కడ అధికారంలో ఉండి.. రెండోసారి అధికారం కోసం ఈ ఫార్ములా అమలు చేసింది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రూపొందించిన త్రిముఖ వ్యూహం విజయవంతం కావడంతో ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలింగ్‌ బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సమావేశాలు, భారీ బహిరంగసభలు నిర్వహించనుంది. ముందుగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు ప్రారంభించింది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల తర్వాత అగ్రనేతలతో రెండోదశలో మండలం యూనిట్‌గా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట బైక్‌ర్యాలీలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు.

ఇక, మూడోదశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగసభలు ఏర్పాటుచేస్తారు. 15 రోజుల్లో వీటిని పూర్తిచేసి, ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అగ్రనేతలతో భారీ బహిరంగసభలు నిర్వహించడానికి బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ నాలుగైదు బహిరంగ సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా బీజేపీ ప్రణాళిక రూపొందిస్తోంది. మూడు, నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా బీజేపీ గుర్తించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించింది.

జిల్లాస్థాయిలో బహిరంగసభలు పూర్తయిన తర్వాత క్లస్టర్‌ స్థాయిలో భారీ సభలు ఏర్పాటుచేయనుంది. ఈ సభలకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించేలోగా ప్రధాని మోదీ నాలుగు లేదా ఐదుసార్లు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన బీజేపీ అగ్ర నేత అమిత్ షా .. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఎంత వరకు పుంజుకుంది? ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే.. అందుకు పార్టీ సంసిద్ధంగా ఉందా అని అడిగారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల వరకు కూడా నేతలంగా ప్రజల్లోనే ఉండాలని సూచించారట.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలా రోజులు ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఏ క్షణమైనా అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అధికారి పార్టీ మాత్రం.. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని..తమకు తొందరేం లేదని గులాబీ నేతలు చెబుతున్నారు. కానీ విపక్షాలు మాత్రం.. ముందస్తు జరగవచ్చని అనుమానిస్తున్నాయి. అందుక
ఇప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు నేతలు. సభలు, సమావేశాలు, పాదయాత్రలతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా కమలనాథులు కార్యచరణకు పదును పెట్టారు. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ.. ఇప్పుడు దక్షిణ భారత దేశంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ముందస్తు టాక్ వేళ చర్చనీయం…


అందులో ప్రధానంగా తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం తరచూ తెలంగాణకు వస్తూ.. అటు నాయకులకు దిశా నిర్దేశం చేస్తూనే ఇటు శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు విచ్చేస్తున్నారు. కాగా.. జనవరి 19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ వచ్చి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఆ వెంటనే హోం మంత్రి అమిత్ షా కూడా రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే..అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ నేతలు తెలంగాణలో పదేపదే పర్యటిస్తుండటం..

వచ్చే ఎనిమిది నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేయటం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు సంఘ్నేతలతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. గతేడాది ఐదు సార్లు రాష్ట్రానికి వచ్చారు అమిత్ షా.మరోవైపు.. బీజేపీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశాలు, ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన మీటింగ్‌లు తెలంగాణలో ఏర్పాటు చేస్తూ..

కమల నేతలు ఇప్పటికే మిషన్ తెలంగాణను ప్రారంబించినట్టు తెలుస్తోంది. టార్గెట్ 90 పేరుతో వచ్చే ఎన్నికల్లో 90 సీట్లలో గెలవడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మరింత స్పీడ్ పెంచింది. ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ స్థాయి సమావేశాలు, మార్చి 5 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని ఎంపీ లక్ష్మణ్ ఇటీవలే ప్రకటించారు. ఏప్రిల్‌లో ప్రభుత్వంపై ఛార్జిషీట్ దాఖలు చేస్తామని, మిషన్ 90తో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుందని వివరించారు. కానీ.. అంతకు ముందు నుంచే సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు బీజేపీ సైలెంట్‌గా కార్యచరణ అమలు చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అమిత్ షా పర్యటన రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నప్పటికీ,రాష్ట్రంలో కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ అమిత్ షా టూర్ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌ను ఎదుర్కొవడంపై యాక్షన్ ప్లాన్ నేతలకు వెల్లడించనున్న అమిత్ షా.. రాష్ట్రంలోని బీజేపీ పరిస్థితి, రాజకీయ సమీకరణాలపై ఆరా తీస్తున్నారు. దీంతో ముందస్తు టాక్ వేళ బీజేపీ వ్యూహాలు ఏమేరకు కలిసివస్తాయన్నదే చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img