Homeతెలంగాణతెలంగాణవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది....

తెలంగాణవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది….

మేడ్చల్ లో ఐదుగురు ఎమ్మెల్యేల రహస్య భేటీ …ఈ భేటీకి కారణమేంటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారితే, దీనిపై గులాబీ బాస్ ఏం చేస్తారన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.

రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా అన్ని పార్టీల్లో అసంతృప్తులు ఉంటూనే ఉంటారు. అవి జాతీయ పార్టీల్లో ఎక్కువగా ఉండటం సహజమే. ప్రాంతీయ పార్టీల్లో కాస్త తక్కువగానే ఉన్నా ఇటీవల కాలంలో వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా జంపు జలానీలు తమ కోరికలను నెరవేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు.తమ డిమాండ్లు అధిష్టానం పక్కన పెట్టడంతో వారిలో నైరాశ్యం పెరగడం కామనే. ఈ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముందుకు రావడంతో పార్టీ నేతలు ఆలోచనలో పడుతున్నారు. ఇంకా ఇలాంటి సంఘటనలు భవిష్యత్ లో చోటుచేసుకోవనే వాదనల సందర్భంలో ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో తమకు పదవులు దక్కలేదనే ఉద్దేశంతో గ్రేటర్ ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, కృష్ణారావు, వివేకానంద, అరికెపూడి గాంధీ,
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మొదట రహస్య సమావేశమనే చర్చ జరిగినా తరువాత బహిర్గతం కావడం వివాదానికి కారణమైంది. తమ పార్టీ కేడర్ లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విషయం కాస్త మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో దీనిపై కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. బీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు బహిర్గతం కాకున్నా.. అందరిలో ఉండే అభిప్రాయాలు ఇవే. పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ మదిలో ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయకుండా లోపలే మథనపడుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలు పక్కదారి పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరికి టికెట్లు ఇస్తామని చెబుతున్నా లోపల మాత్రం వేరే ఆలోచనలు ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా గ్రేటర్ ఎమ్మెల్యేల భేటీ హాట్ టాపిక్గా మారింది. వారి ఉద్దేశాలు ఏవైనా రహస్య భేటీలు నిర్వహిస్తే పార్టీకి ఎదురయ్యే ఇబ్బందులపై అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం మాత్రం ఏర్పడింది. ఎమ్మెల్యేల భేటీపై నాయకత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అనే సందేహాలు అందరికి వస్తున్నాయి. ఎమ్మెల్యేలందరిలో ఎన్నో అనుమానాలు దాగి ఉన్నాయి. దీంతోనే వారు రహస్యంగా సమావేశం అవుతున్నారు. భవిష్యత్ ఎలా ఉండనుందనే బెంగ అందరిలో నెలకొంది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు కీలకంగా మారుతున్నాయి.

తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టిందా.. అధిష్టానంపై అసమ్మతి మొదలైందా.. ఎమ్మెల్యేల తిరుగుబాటు తప్పదా.. అంటే గులాబీ సర్కిల్స్‌ నుంచి అవుననే సమాధానం వస్తోంది. అన్నీ తామై బీఆర్‌ఎస్‌ పార్టీని నడిపిస్తున్న కేసీఆర్, ఆయన కుటుంబానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్లుగా చిన్నచిన్న అలకలు మినహా ఎక్కడా పెద్దగా అసమ్మతి బీఆర్‌ఎస్‌లో కనిపించలేదు. ఒకరిద్దరు నేతలు పార్టీని వీడారు. పెద్ద ఘటన అంటే ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌చేసి పార్టీ నుంచి బయటకు పంపేయడమే.

తాజా పరిణామాలు చూస్తుంటే బీఆర్‌ఎస్‌ అధినేతలపై ఎమ్మెల్యేలు, నాయకులు తిరుగుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఈడీ, ఢిల్లీ లిక్కర్‌ కేసు వ్యవహారం నడుస్తోంది. ఎప్పుడు ఈడీ నోటీసులు వస్తాయోునని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు హడలెత్తిపోతున్నారు. అటు వరుసగా తెలంగాణ మంత్రులు తలసాని, మల్లారెడ్డి ఇళ్లు, ఆస్తుపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ నుంచి పిలుపు వచ్చింది.

ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఓ అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. తమ దారి తాము చూసుకోవడమే మేలన్న భావన కొంతమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతల్లో వ్యక్తమవుతోంది. కేసీఆర్‌ వ్యక్తిగత పగ, ప్రతీకారానికి తామెందుకు బలికావాలన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. నియోజకవర్గ సమస్యలపైనే భేటీ అని ఆయా నేతలు చెబుతుండగా, ఓ మంత్రికి వ్యతిరేకంగా వీరంతా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేల భేటీ సొంతపార్టీలోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో నూతన కమిటీల విషయంలో కొండా సురేఖ రాజీనామాతో మొదలైను అసమ్మతి ఇప్పుడు పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయే పరిస్థితికి చేరింది.

టీఆర్‌ఎస్‌లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంటుందా అన్న చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీలో చాలామంది అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. అధికారంలో ఉంది కాబట్టి బయటకు చెప్పలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఈ అసమ్మతి బ్లాస్ట్‌ అవుతుందన్న చర్చ చాలారోజులుగా జరుగుతోంది. అయితే తాజాగా ఎమ్మెల్యేల రహస్య భేటీతో ఇప్పుడు అసమ్మతి వాదులంతా అధిష్టానంపై తిరుబాటు చేసేందుకు వెనుకాడకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ముసలం పుట్టిందన్న పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ జిల్లా మంత్రితో ఎమ్మెల్యేలకు పొసగడం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అంతా బీఆర్‌ఎస్‌ లీడర్లే అయినప్పటికీ మంత్రి వ్యవహార శైలితో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు వాపోతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల రహస్య మంతనాలు ఆ పార్టీలో కలకలం రేపాయి. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు భేటి అయ్యారు.ఇందులో ఏం చర్చించారన్న విషయంపై మాత్రం ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. మంత్రికి వ్యతిరేకంగానే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది.

దీనికి ఓ పెళ్లి వేడుకలో జరిగిన సంఘటనలే ఈ భేటీకి కారణంగా కనిపిస్తున్నాయి. ఆ వేడుకలో మైనంపల్లికి, మంత్రికి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి .. ఇతర ఎమ్మెల్యేల పనులు చేయొద్దని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రి వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యే మైనంపల్లి ఇతర ఎమ్మెల్యేలు సమావేశమై చర్చించారని బోగట్టా. ఈరోజు ఉదయం నుంచి మంత్రి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా మైనంపల్లి ఇంట్లో రహస్య సమావేశాలు జరిపారట.మంత్రి తీరు ఇబ్బందికరంగా ఉందని చర్చినట్టు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారని వారి అనుచరులు చెబుతున్నారు.

బయట టాక్ ఇలా ఉంటే అసలు ఈ భేటీకి అంత ప్రాధాన్యత లేదంటున్నారు మైనంపల్లి. ఇటీవల తన మనవడి 21 రోజుల పండుగ జరిగిందని… దానికి రాని ఎమ్మెల్యేలు ఇవాళ వచ్చారని చెబుతున్నారు. అందరూ వచ్చి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి వెళ్లారని వివరణ ఇచ్చారు. భేటికి ఎలాంటి రాజకీయ ప్రాధన్యత లేదంటున్నారు మైనంపల్లి. మేడ్చల్ జిల్లాకు ఏకైక మంత్రిగా మల్లారెడ్డి ఉన్నారు. ఆ జిల్లా పరిధి అంతా గ్రేటర్ లోకే వస్తుంది. దాదాపుగా అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ వద్ద ఉన్న చనువుతో .. ఏకపక్ష పాలన చేస్తున్నారు. ఈ కారణంగా మిగతా ఎమ్మెల్యేలు అంతా డమ్మీలైపోయారు.

ఇలా అయితే తమకు కష్టం అని అందరూ.. ఏకతాటిపైకి వచ్చేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఒకే సారి సమావేశం కావడంతో బీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఉలిక్కి పడింది. వెంటనే అందర్నీ ప్రగతి భవన్‌కు ఆహ్వానించింది. ప్రగతి భవన్‌లో ఏదో ఒకటి సర్ది చెబుతారు. ప్రస్తు రాజకీయ పరిణామాల వేళ ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీకావడం అంటే చిన్న విషయం కాదు. అందుకే పార్టీ హైకమాండ్ కూడా రంగంలోకి దిగింది.

ఈ అసమ్మతి భేటీని గులాబీ బాస్ ఎలా పరిష్కరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img