Homeతెలంగాణతెలంగాణలో ఎన్నికల లొల్లి షురూ...!!

తెలంగాణలో ఎన్నికల లొల్లి షురూ…!!

తెలంగాణలో ఎన్నికల లొల్లి షురూ అయింది. ఈ దఫా .. బీజేపీ గెలుపుపై కన్నేయడంతో, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోటీపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరీంనగర్ ఎంపీగా ఉన్న ఆయన అసెంబ్లీ బరిలోకి ఏ స్థానం నుంచి దిగనున్నారన్నదే హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలో ఎన్నికల ఏడాది వచ్చేసింది. హ్యాట్రిక్ కొట్టాలని టీఆర్ఎస్ చూస్తుంటే.. ఎలాగైనా తాము అధికారంలోకి రావాలని చూస్తున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. మరోవైపు నేతలు కూడా అప్పుడే టికెట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడే లైన్ క్లియర్ చేసుకుంటే బెటర్ అన్నట్లు పావులు కదిపే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే చాలా మంది ముఖ్య నేతలు కూడా… పొలిటికల్ ప్యూచర్ పై తెగ ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సంబంధించి పలు వార్తలు ఆసక్తికరంగా మారాయి.

వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారని తెలుస్తోంది. ఇందుకోసం ఓ సీటు ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతాపార్టీతెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే విషయం కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో నలుగుతోంది. మరోసారి ఆయన నియోజకవర్గం ఏదంటూ హాట్‌టాపిక్‌గా మారింది. పలు నియోజకవర్గాల నుంచి పోటీచేయాలని బండికి వినతులు వస్తున్నప్పటికీ ఆయన ఎవరికీ సమాధానం ఇవ్వలేదు.

వేములవాడ నుంచి పోటీచేయడం ఖాయమైందంటూ గతంలో బలంగా ప్రచారం జరిగింది. తాజాగా మరో నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేయడం ఖాయమని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచే ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు.నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యలను ప్రశ్నిస్తూనే కరీంనగర్ నియోజకవర్గ ప్రాంతంలోని సమస్యలను కూడా లేవనెత్తుతున్నారనే విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి.

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పోటీచేస్తే కచ్చితంగా విజయం సాధించాలి. ఓటమి ఎదురు కాకూడదు. అందుకే పలు సంస్థలతో ఆయన తాను ఎక్కడినుంచి పోటీచేస్తే విజయం సాధించగలమనే విషయమై సర్వే చేయించారు. అందరూ దాదాపుగా కరీనంగర్ సురక్షితమని చెప్పడంతో అక్కడే ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గుంగల కమలాకర్ పై కరీంనగర్ నుంచే పోటీచేసి ఓటమిపాలయ్యారు.తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణకు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యాన్ని బీజేపీ ఏర్పరుచుకుంది.

మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ ను ఓడించాలంటే బండి సంజయ్ సరైన అభ్యర్థి అవుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందులోను కరీంనగర్ ఎంపీగా ఉండటంవల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించడం సులువవుతుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో బండి సంజయ్ కు 66,009 ఓట్లు వచ్చాయి. గంగుల కమలాకర్ కు 80,983 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన పొన్నం ప్రభాకర్ 39,500 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. గత ఎన్నికల్లో బండి ఓడిపోవడంతో ఆ సెంటిమెంట్ కలిసొచ్చి విజయం సాధించడానికి మార్గం ఏర్పడుతుందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేయబోతున్న అసెంబ్లీ స్థానం అంశం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడికరీంనగర్ చుట్టే బండి తిరుగుతుండడంతో జిల్లాలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుండి బీజేపీ చీఫ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మొదట వేములవాడ ఆ తరువాత సిరిసిల్ల పేరు బలంగా వినిపించగా..తాజాగా మరో నియోజకవర్గం పేరు తెరపైకి వచ్చింది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కు జిల్లా వ్యాపంగా పట్టుంది. ఈ మేరకు ఆయన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే..కరీంనగర్ సమస్యలపైబండిసంజయ్చురుకుగా స్పందిస్తారు. ఎప్పటికప్పుడు జిల్లాలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసే దిశగా చూస్తారు.

అంతేకాదు గతంలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉంది. అయితే ఆ సమయంలో గంగుల కమలాకర్ చేతిలో బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కరీంనగర్ నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కాగా రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీఉవ్విల్లూరుతుంది. ఈ క్రమంలో బండి సంజయ్ పోటీ తప్పని సరైంది. అందుకే కరీంనగర్ నుండి పోటీ చేస్తే ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి.

అలాగే అక్కడ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ ను ఓడించాలంటే బండి సంజయ్ సరైన వ్యక్తి అని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండి బండి సంజయ్ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. ఇక కరీంనగర్ నుండి పోటీ చేస్తే ఫలితాలు ఎలాఉంటాయనే అంశంపై సర్వే చేయించినట్లు సమాచారం. ఆ సర్వేలో కరీంనగర్ నుంచి పోటీ చేస్తేనే సత్పలితాలు వస్తాయని తేలినట్లు సమాచారం.అయితే గత ఎన్నికల్లో ఓటమి సెంటి మెంట్ ఇప్పుడు బండి సంజయ్ కు కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే కరీంనగర్ స్థానానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు బండి సంజయ్. ఆ తర్వాత తెలంగాణ పార్టీ పగ్గాలను చేపట్టి దూసుకెళ్తున్నారు. అయితే ఈసారి పార్లమెంట్ కు కాకుండా అసెంబ్లీకి వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది తెలంగాణ బీజేపీ. కేవలం సింగిల్ సీటుతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బిగ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 4 సీట్లు గెలిచి, టీఆర్ఎస్ కు గట్టి సవాల్ విసిరింది. అనంతర పరిణామాలతో బలం పెంచుకుంటూ వస్తోంది. కీలకమైన దుబ్బాక, హుజురాబాద్ తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

తాజాగా జరిగిన మునుగోడు పోరులోనూ సెకండ్ ప్లేస్ లో నిలిచి, కారు పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు గెలవాలని చూస్తోంది. ఇందుకోసం మిషన్ తెలంగాణ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ కూడా నడిపిస్తోంది. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అది కరీంనగర్ నుంచి కాకుండా ముథోల్ నుంచి చేస్తారనే టాక్ జోరందుకుంది. ఐదో విడత యాత్రలో భాగంగా ముథోల్ ను దత్తత తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గతంలో ఏ నియోజకవర్గంలో ఇలాంటి కామెంట్స్ చేయని బండి సంజయ్… ముథోల్ ను దత్తత తీసుకుంటామని చెప్పటంతో తాజా చర్చకు తెరలేపినట్లు అయింది.

ఈ నేపథ్యంలో ఆయన ముథోల్ నుంచి పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. దీని వెనక ఉన్న పలు కారణాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక్కడ బండిసంజయ్ సామాజికవర్గానికి చెందిన మున్నూరు కాపులు భారీగా ఉన్నారు. దాదాపు 45 వేలకుపైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ హిందూత్వవాదం కూడా బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ స్థానం నుంచి పోటీ చేస్తే సామాజికవర్గ ఓట్లు భారీగా కలిసివచ్చే ఛాన్స్ ఉందన్న కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పోటీ చేస్తే ఈజీగా గెలవొచ్చనే అంచనాలు కూడా వేస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే బండి సంజయ్… ఇక్కడ్నుంచే బరిలో ఉంటారని స్పష్టమవుతోంది. అయితే గత ఎన్నికల్లో గెలిపించిన కరీంనగర్ ప్రజలను కాదని, పక్క నియోజకవర్గానికి వస్తారా..? లేక అదే పార్లమెంట్ పరిధిలోని ఏదైనా ఒక అసెంబ్ని యోజకవర్గం నుంచి పోటీ చేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img