Homeఅంతర్జాతీయంజీవుల నుండి వచ్చే ప్రేరణ వల్ల ఈ టెక్నాలజీ లను కనిపెట్టడం జరిగింది

జీవుల నుండి వచ్చే ప్రేరణ వల్ల ఈ టెక్నాలజీ లను కనిపెట్టడం జరిగింది

మనం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలన్నీ దాదాపుగా జంతువుల ఆధారంగా వాటి స్పూర్తితో ఆవిశ్కరించడం జరిగింది. హెలికాప్టర్ మొదలుకుని సబ్ మెరిన్ వరకు నోరులేని జీవులే మనిషి మేథను తట్టి లేపాయని చెబుతున్నారు. మనిషికి మొదటి నుంచీ ఇతర జీవుల నుంచి వచ్చిన ప్రేరణ వల్లే ఈ టెక్నాలజీలను కనిపెట్టడం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నోరులేని జీవులే మనిషి మేథను తట్టి లేపాయని చెబుతున్నారు పరిశోధకులు..అయితే.. చిరుతను చూసి పరిగెత్తాలి.. చీమను చూసి పొదుపు నేర్చుకోవాలి. సాలీడు పురుగును చూసి అల్లికలు అల్లాలని చెబుతుంటారు. ‘వెనకటికి పుస్తకాల్లో చదువుకున్న సూక్తుల్లో ఇవి ఉన్నాయి. వాస్తవానికి అవి నిజ జీవిత సత్యాలు. ఈ భూమి మీద మనిషే అత్యంత తెలివైన వాడు అనుకుంటారు కానీ, మనిషి జంతువులను పోలే తన పరిణామక్రమాన్ని, అభివృద్ధి క్రమాన్ని నిర్వచించుకున్నాడు. అదే దారిలో తానూ పయనించాడు. పయనిస్తూనే ఉన్నాడు. మనిషి పరిపక్వత చెందుతున్న కొద్దీ చుట్టూ ఉన్న జంతువులను అనుసరించాడు. క్షీరదాల నుంచి కీటకాల వరకు వేటినీ వదిలిపెట్టలేదు.

దోమకాటు నుంచి ప్రేరణ పొంది తక్కువ నొప్పి కలిగించే సూదిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మునుముందు అసలు నొప్పి లేకుండా సూది మందును తయారు చేసే యోచనలో ఉన్నారు. మీకు తెలుసా… హమ్మింగ్ బర్డ్ వెనక్కు ఎగరగల సామర్థ్యం ఉంటుంది.. దాని ఆధారంగానే హెలికాప్టర్ ను అభివృద్ధి చేశారు.. అంతేకాదు మోటారు రవాణాలో రెక్కలను షార్క్ మొప్పలను ప్రేరణగా తీసుకొని రూపొందించారు.. రేసింగ్ కార్లలో కూడా వీటిని పొందుపరిచారు.. ఇలా చేయడం వల్ల రేసింగ్ కార్ ఎంత వేగంగా తోలినా ఇంజన్ వేడెక్కదు. దీనిపై యాంటెన్నా ఏర్పాటు చేయడం వల్ల అది వేగాన్ని నియంత్రిస్తుంది. అది కూడా జంతువుల నుంచి ప్రేరణ పొందిందేనని అంటున్నారు శాస్త్రవేత్తలు

సాధారణంగా వడ్రంగిపిట్ట తన ముక్కును ఉపయోగించి రంద్రాలు చేసి అందులో నివాసం ఉంటుంది.. ముక్కుతో పదేపదే చెట్టు కాండాన్ని డ్రిల్లింగ్ చేసినప్పటికీ ఆ పిట్టకు ఏమీ కాదు.. ఎందుకంటే దాని పుర్రె గట్టిగా ఉంటుంది.. దీని ఆధారంగానే పెద్ద పెద్ద అబ్జర్బార్ లేయర్డ్ షాక్ శోషక నిర్మాణాలు రూపొందించేందుకు అడుగులు పడ్డాయి. లేయర్డ్ షాక్ శోషక నిర్మాణాల వంటి ఆవిష్కరణలను కూడా ప్రేరేపించాయి. గబ్బిలాలు ధ్వని విడుదల చేస్తాయి. ఆ శబ్దాలు అల్ట్రా సౌండ్ తరంగాల మాదిరి ప్రతి స్పందనలను సృష్టిస్తాయి. వీటి ఆధారంగానే ఆల్ట్రా సౌండ్ అనే వైద్య పరీక్షను రూపొందించారు. పరిమిత వ్యక్తుల భద్రతను రక్షించేందుకు నావిగేషన్ ప్రక్రియను కూడా రూపొందించేందుకు గబ్బిలాలే కారణమయ్యాయి.

రాకీ తీరాల పగడపు దిబ్బల్లో ఉండే ఉష్ణ మండల చేపలు…కప్ లను రూపొందించేందుకు దారి తీశాయి. క్లింగ్ ఫిష్ ప్రేరేపిత శోషణ కప్పు దాని సొంత బరువు కంటే వంద రెట్లు ఎక్కువ ఉంటుంది.. ఈ నిర్మాణం రోబోటిక్ గ్రిప్పర్లను తయారు చేసేందుకు నాంది పలికింది.. ఇక సముద్రం అడుగుభాగం లో ఉండే బర్థాక్ మొక్కల సముదాయం దుస్తులు కుట్టుకునేందుకు నిలిచింది.. అంతేకాదు ఈ మొక్కల కదలికల ఆధారంగానే 1961 నుంచి 1972 వరకు నాసా అపోలో మిషన్లను రూపొందించింది. స్కాలోప్స్ వంటి సముద్రపు జీవులు జిగ్ జాగ్ వంటి ముడతలను కలిగి ఉంటాయి.. ఇవి సముద్రపు నీటి అడుగున అధిక పీడనం ఉన్నప్పటికీ వీలు కల్పిస్తాయి. ఇక ముడతలు గల నిర్మాణం ఉపరితలం వద్ద ఆ జీవి బలాన్ని పెంచుతుంది.

దీని ఆధారంగానే పలు జలాంతర్గములను రూపొందించారు. ఇక చాలా జంతువుల ఆధారంగానే మనిషి తన అభివృద్ధికి బాటలు వేసుకున్నాడు..ఒక ఆవిశ్కరణం నుంచి మరో ఆవిశ్కరణం పుట్టుకువస్తూ పరికరాలు యంత్రాలు అభివ్రుద్ది చెందుతూ వచ్చాయి. మొదట నిప్పు పుట్టించేందుకు రెండు రాళ్లు ఉపయోగించిన ఆదిమానవుడు నేడు బటన్ నొక్కితే నిప్పు వచ్చేలా చేసుకున్నాడు. అది ఎంతగా అభివ్రుద్ది చెందిందంటే రేపు అణువిచ్చిత్తితో కరెంటు పుట్టించడం, రాకెట్ ప్రయాణాలు చేయడం కూా రాబోతోంది. రాబోయే కాలంలో మరెన్నో కొత్త ఆవిశ్కరాలు మానవాళి అందుబాటులోకి రానున్నాయి. అయతే ఎప్పటి తరానికి అప్పటి ఆవిశ్కరణాలు మేలు చేస్తూండటం కూడా జరుగుతోంది.

Must Read

spot_img