టీడీపీకి వచ్చే ఎన్నికలు .. తాడో పేడో నన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో లోకేష్ యువగళంలో .. జూనియర్ ఎన్టీఆర్ చర్చ తెరపైకి రావడం .. ఈ హీట్ ను మరింత పెంచేస్తోంది. మరి దీనిపై అధినాయకత్వం వ్యూహం ఏమిటన్నదే హాట్ టాపిక్ గా మారింది.
2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయిన దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పెద్ద ఎత్తున విషయం తెలిసిందే. ఇంకా టిడిపిని ఎన్టీఆర్ కు అప్పగించాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మీటింగుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. సిఎం ఎన్టీఆర్ అంటూ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎలాగో చంద్రబాబుకు వయసు మీద పడిందని, లోకేష్ కు పార్టీని నడిపినే సామర్థ్యం లేదని, అందుకే ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్వెల్లువెత్తింది. టిడిపిని మళ్ళీ గెలిపించే సత్తా ఎన్టీఆర్‌కే ఉందని అభిమానులు అంటున్నారు.
అయితే ఎన్టీఆర్ అభిమానుల ముసుగులో వైసీపీ శ్రేణులు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని, టిడిపిలో చిచ్చు పెట్టడానికి ఆ రకంగా చేస్తున్నారని టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. కానీ ఏదేమైనా టిడిపిలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. చంద్రబాబు, లోకేష్ సభల్లో ఎన్టీఆర్ జెండాలతో ఫ్యాన్స్ హంగామా చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా లోకేష్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో జరిగింది. ఈ క్రమంలో కొందరు ఎన్టీఆర్ అభిమానులు..ఎన్టీఆర్ ఫ్లెక్సీ కట్టారు. పైగా దానిపై అన్న పెట్టిన పార్టీ అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్ రావాలి..అంటూ రాశారు. దీంతో మరోసారి తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరు హైలైట్ అయింది. ఇటీవల కూడా లోకేష్ .. జూనియర్ ఎన్టీఆర్ ని 100 శాతం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అసలు ఆయన తాత పెట్టిన పార్టీలోకి లోకేష్ ఆహ్వానించేది ఏంటి? అని టిడిపి అసలు ఎన్టీఆర్‌దే అని కొడాలి నాని, వంశీలు అంటున్నారు. కానీ రాజకీయాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు..
కానీ ఆయన్ను రాజకీయాలు వదలడం లేదు. టీడీపీ యువ నేత నారా లోకేష్ .. యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.
అందులో భాగంగా ఇటీవల యువతతో మాట్లాడిన ఆయన.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఆయన అభిమానులు హడావుడి చేశారు.. లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న పీలేరులో.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో హంగామా చేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభంజనంతో విశ్వవ్యాప్తంగా జూనియర్ఎ న్టీఆర్ పేరు మారు మోగుతోంది. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి జూనియర్ నాయకత్వం వహించాలన్న డిమాండ్ సైతం వెల్లువెత్తుతోంది. ఇప్పుడు ఫ్లెక్సీలతో పాటు లోకేష్ వ్యాఖ్యలు ఈ డిమాండ్ ను మరింత పెంచేశాయని టాక్ వినిపిస్తోంది.
సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉంటే.. ఆయన అభిమానులు.. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం యంగ్ టైగర్ రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. ఆ విషయం అధిష్టానానికి తెలిసేలా.. చేస్తున్నారు. ఆ మధ్య చంద్రబాబు సభల్లో ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న చిత్తూరు జిల్లాలో ఎన్టీఆర్ఫ్లెక్సీలు పెడుతూ తమ అభిమతం తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతిలో హలో లోకేష్ అనే కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అంటూ కార్యకర్త ప్రశ్నించారు. దీనికి లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని, అలా వచ్చే అందర్నీ తాను ఆహ్వానిస్తానని చెప్పారు లోకేష్.. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

దింతో నారాలోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రజలకోసం రాజకీయ అరంగేట్రం చేయాలనీ కోరారు. జూనియర్ ఎన్టీఆర్, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు ఆయన. గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి
ఆవిష్కరించారు. అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరి చంద్రబాబు పర్యటించినప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ డిమాండ్ పై అధిష్టానం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అలాగని నో అని కూడా చెప్పలేదు. చంద్రబాబు సైతం సరే అంటూ అప్పుడు తల ఊపారు అంతే. అయితే జూనియర్ ఎన్టీఆర్ త్వరగా రావాలని ఫ్యాన్ మాత్రం కోరుకుంటున్నారు.
లోకేష్ సమాధానం బాగానే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. అసలు జూనియర్ ని ఆహ్వానించడానికి నువ్వెవరు అంటూ లోకేష్ ని టార్గెట్ చేశారు కొంతమంది. జూనియర్ తాత పెట్టిన పార్టీ టీడీపీ అని, పార్టీపై చంద్రబాబు, లోకేష్ కంటే ఎక్కువ హక్కు ఆయనకే ఉంటుందని, అలాంటి జూనియర్ ని లోకేష్ రాజకీయాల్లోకి, పార్టీలోకి ఆహ్వానించడమేంటని మండిపడ్డారు. ఇదే అంశాన్ని వైసీపీ సైతం ప్లస్ గా మార్చుకోవాలని తనవంతు ప్రయత్నాలు షురూ చేసింది.
వైసీపీ సానుభూతి పరులు లోకేష్ సమాధానాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని ఓసారి ప్రచారానికి తిప్పుకుని చంద్రబాబు మోసం చేశారని, ఇప్పుడు మరోసారి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన లోకేష్ కి గుర్తొచ్చారని, అది కేవలం కావాలని అడిగించిన ప్రశ్నేనంటున్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చినప్పుడు స్టేజ్ కింద ఉన్నవారిలో మంచి స్పందన వచ్చింది. లోకేష్ కూడా తడబడకుండా ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు, తప్పించుకోలేదు. కానీ ఇప్పుడిలా సోషల్ మీడియాకి మాత్రం బుక్కయ్యారు. ఎన్టీఆర్ ని ఆహ్వానించడానికి మీరెవరు అంటూ లోకేష్ ని టార్గెట్చే స్తున్నారంతా, ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు. కాగా తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ హవా నడుస్తూనే ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.
టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కు అప్పగించాలంటూ టీడీపీలోని ఓ వర్గం నేతలతోపాటు కార్యకర్తలు నందమూరి అభిమానుల నుంచి:గత కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ వారసుడు ఎవరు? తెలుగుదేశం భవిష్యత్ సారథి ఎవరు? అంటూ ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. లోకేష్ పాదయాత్ర సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి రావడమే హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికారమే టీడీపీ లక్ష్యం. ఇందుకోసం ఏ అవకాశం వదులుకోవటానికి సిద్దంగా లేదు. అటు చంద్రబాబు నేరుగా పవన్ తో పొత్తుల దిశగా అడుగులు వేస్తుంటే..ఇటు లోకేష్ వ్యూహాత్మకంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం పలికారు. ఇప్పటి వరకు జూనియర్ టీడీపీలో రీ ఎంట్రీకి లోకేష్ కారణమంటూ జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికే ప్రయత్నం చేసారు.
దీంతో ఇదంతా రాజకీయ వ్యూహమన్న వాదనలు సైతం వెల్లువెత్తుతున్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసారు. ఆ తరువాత పార్టీ వ్యవహారాల్లో దూరంగానే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. పార్టీలో లోకేష్ కారణంగానే జూనియర్ కు అవకాశం దక్కటం లేదనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యువగళంలో జూనియర్ ఫ్లెక్సీలు, డిమాండ్లు పెరుగుతుండడం .. చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై పార్టీ అగ్ర నాయకత్వం ఏం చేస్తుందన్నదే హాట్ టాపిక్ అవుతోంది.
మరి తారక్ ఏమంటారన్నదే హాట్ టాపిక్ గా మారింది.