టాటా .. ఇక సెమీకండక్టర్ల తయారీలోకి ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త .. మరోసారి చర్చనీయాంశంగా మారింది. వ్యాపారం కన్నా దేశమే ప్రయారిటీ
అంటూ తనదైన బాణిని వినిపించే టాటా .. ఇక చిప్ తయారీతో దేశ వృద్ధికి మద్ధతు పలకనున్నారు.
ప్రపంచ దేశాల్లో భారత కీర్తిని ఎగురవేయడానికి .. టాటా గ్రూప్ ఎప్పుడూ తొలిస్థానంలోనే ఉంటుంది. ఇప్పుడు అదే తీరున .. చిప్ తయారీ కేంద్రంగా
మారాలనుకుంటోన్న భారత్ కు తనదైన మద్ధతుకు టాటా గ్రూప్ సన్నద్ధమవుతోంది.
సెమీకండక్టర్ చిప్స్ మార్కెట్‌లోకి రానున్న టాటా …
ఉప్పు నుంచి ఉక్కు వరకు ఇలా అనేక రంగాల్లో విస్తరించి దేశాభివృద్ధిలో భాగంగా మారింది టాటా గ్రూప్. ఎల్లప్పుడూ వ్యాపారం కంటే దేశమే ముందు అని నిరూపించుకున్న ఈ కంపెనీ తాజాగా మరో వ్యాపారంలోకి అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది భారత వృద్ధిని వేగం పుంజుకునేలా చేయటంతో పాటు భవిష్యత్తులో ప్రపంచదేశాలకు భారత్ తక్కువ కాదని నిరూపించేందుకు దోహదపడనుంది. వ్యాపారం అనేది ప్రస్తుత గ్లోబలైజేషన్ కాలంలో విస్తరించింది. దీనివల్ల దేశాల మధ్య ఒకరిపై మరొకరు ఆధారపడటం అనివార్యంగా మారింది.
అయితే కొన్నిసార్లు ఏర్పడుతున్న సమస్యల కారణంగా అనేక దేశాలు బ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చిప్ తయారీలో ఏర్పడిన కొరత కారణంగా ప్రపంచ దేశాల్లోని వ్యాపారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా మారింది. అయితే దీనిని పరిష్కరించేందుకు టాటాలు రంగంలోనికి దిగనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. టాటా గ్రూప్ ఇప్పటికే చిప్ తయారీ కోసం ఒక ఎంటిటీని సెటప్ చేసింది. టాటా ఎలక్ట్రానిక్స్ కింద సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ బిజినెస్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత డిమాండ్ ఉన్నందున సెమీకండక్టర్లకు భారీగా డిమాండ్ పెరగనుంది. దీనిని అందిపుచ్చుకునేందుకు, కరోనా వల్ల ఈ రంగంలో ఏర్పడిన అవాంతరాలను పూడ్చి దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కీలక భూమిక పోషించేందుకు టాటాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న టాటాలు సెమీకండక్టర్ ఉత్పత్తిలోకి ప్రవేశించాలనే నిర్ణయం వెనుక కరోనా సృష్టించిన ఉత్పత్తి అంతరాయాలు ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ప్రస్తుతం చిప్ తయారీ కోసం సంస్థ అనేక కంపెనీలతో చర్చలు జరుపుతోంది.
అనుభవం లేని కంపెనీ సొంతంగా చిప్‌మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సవాలుగా పరిగణించబడుతుంది. అందుకే ఇప్పటికే ఉన్న చిప్త యారీదారులతో భాగస్వామ్య అవకాశాలను టాటాలు అందిపుచ్చుకుంటున్నారు. సెమీకండక్టర్ల తయారీ రంగంలో చాలా కీలకంగా అనేక తైవాన్ కంపెనీలు ఉన్నాయి. అయితే ఇవి చైనా కేంద్రంగా ఉత్పత్తిని తయారు చేసేవి.
అయితే కరోనా తర్వాత అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తైవాన్-చైనా మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు, చైనాపై ఆధారపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సరఫరా సమస్యలతో కంపెనీలు ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ కారణంగా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటాలు సైతం సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు చంద్రశేఖరన్ వెల్లడించారు. దీనికి ముందు భారత వ్యాపార దిగ్గజం అయిన వేదాంతా గ్రూప్ కూడా ఇదే వ్యాపారంలోకి అరంగేట్రం చేసింది. గుజరాత్ కేంద్రంగా ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.
సెమీకండక్టర్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని, చిప్ సప్లై చెయిన్ సిస్టమ్‌లో అంతర్జాతీయంగా.. భారత్ కీలక పాత్ర పోషించగలదన్న లక్ష్యంతో టాటా గ్రూప్ ఈ దిశగా అడుగులు వేస్తున్నామని సంస్థ పేర్కొంది. కొవిడ్-19 సమయంలో తీవ్రంగా ప్రభావితమైన చిప్ సరఫరా వ్యవస్థ.. ఇప్పటికీ కోలుకోలేకపోయిందని, ఆ అవాంతరాలను పూడ్చడానికే తాము ఈ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. విద్యుత్ వాహనాల వంటి వర్ధమాన రంగాల్లో కొత్త వ్యాపారాలను సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చంద్రశేఖరన్ స్పష్టం చేశారు.
ఈ సందర్బంగానే 2020లో టాటా గ్రూప్ ప్రారంభించిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. దీని కిందే.. చిప్ అసెంబ్లీ టెస్టింగ్ బిజినెస్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు
ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్, 5G నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్, సెమీకండక్టర్ల రంగంలోకి ప్రవేశించేందుకు టాటా గ్రూప్ ప్లాన్ చేస్తున్నట్లు చంద్రశేఖరన్ గతంలోనే చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ సరఫరా గొలుసు.. ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉందని, అయితే.. ఇది ఇతర దేశాలకు మళ్లిస్తే పోస్ట్ పాండిమిక్ తర్వాత పెద్ద మార్పు కనిపిస్తుందని అన్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత టాటా గ్రూప్ కొత్త కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశిస్తోంది. 5G సర్వీసెస్ కోసం టెలికాం పరికరాల సంస్థ తేజస్ నెట్‌వర్క్స్‌లో వాటా దక్కించుకుంది.
మరోవైపు సూపర్ యాప్ కోసం బిగ్‌బాస్కెట్, 1MG, క్యూర్‌ఫిట్ వంటి సంస్థలనూ టాటా డిజిటల్ కొనుగోలు చేసింది. రానున్న రోజుల్లో సెమీకండక్టర్ చిప్స్ తయారీ కోసం 90 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టునున్నట్టు చంద్రశేఖరన్ వెల్లడించారు. టాటా కంపెనీ సెమీకండక్టర్ చిప్స్‌ను తయారీ రంగంలోకి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా చిప్స్ మార్కెట్‌లో భారత్ ప్రధాన ఎగుమతిదారు అవుతుంది. 2020లో టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోకి వచ్చింది. ప్రస్తుతం టాటా ఎలక్ట్రానిక్స్‌లో లక్ష కోట్ల రూపాయల బిజినెస్ అవుతోంది.
టాటా డిజిటల్ విభాగం సూపర్ యాప్‌ను తయారుచేసే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే బిగ్‌బాస్కెట్, 1 ఎంజీ వంటి యాప్‌లను కొనుగోలు చేసింది. అంతేకాదు ఫిట్‌నెస్‌కు సంబంధించిన క్యూర్‌ఫిట్ అనే యాప్‌లో పెట్టుబడులు పెట్టింది. సెమీ కండక్టర్లు.. అదేనండీ కంప్యూటర్లు, మొబైల్ పోన్లలో వాడే చిప్‌లు. వీటి తయారీలో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం చైనా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికన్ సెమీ కండక్టర్ తయారీ కంపెనీలు సైతం.. చైనాలోనే తమ ఫ్యాక్టరీలు నెలకొల్పాయి. అక్కడి నుంచ ప్రపంచ దేశాలు చిప్‌లు సరఫరా అవుతున్నాయి. దీంతో చైనాకు బిలియన్ డాలర్ల సంపద సమకూరుతోంది. అయితే ఇదంతా గతం.
ఇప్పుడు ఈ చిప్ తయారీ కంపెనీలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ఎప్పుడైతే, అగ్రరాజ్యంతో డ్రాగన్ వైరం పెంచుకుందో.. అప్పటి నుంచి ఆంక్షలు మొదలయ్యాయి. అమెరికన్ కంపెనీలన్నీ తిరుగుబాట పట్టడం మొదలుపెట్టాయి. ఇప్పుడిదే భారత్‌కు అయాచితవరంగా మారింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి.. ప్రధాని నరేంద్ర మోదీ ఏ ఛాన్స్‌నూ వదలడం లేదు. సెమీ కండక్టర్ల విషయంలోనే కాదు, టెలికాం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్‌ను తయారీ హబ్‌గా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇందులో భాగంగా.. మోదీ.. టాప్ ఫైవ్ అమెరికన్ కార్పొరేట్ సంస్థల సీఈవోలతో చర్చలు జరిపారు. టెలికాం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ముఖ్యంగా డ్రోన్లు, 5జీ, సెమీకండక్టర్, సోలార్ ఎనర్జీ వంటి అంశాలపై చర్చలు జరిపారు. మోదీ చర్చలు జరిపిన వారిలో జనరల్ ఆటోమిక్స్, క్వాల్కామ్, బ్లాక్‌రాక్, అడోబ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు ఉన్నారు. వీరిలో అడోబ్ సీఈవో శంతను నారాయణన్, జనరల్ ఆటోమిక్స్ సీఈవో వివేక్ లాల్ భారత సంతతికి చెందినవారే. ఇక, సెమీ కండక్టర్ల విషయానికి వస్తే.. ఈ కంపెనీలను ఆకర్షించేవిధంగా భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో పలు సెమీ కండక్టర్ తయారీ కంపెనీలు భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించేందుకు మొగ్గుచూపాయి.
వచ్చే ఆర్నెళ్లలో భారత్‌లో సెమికండక్టర్లను ఉత్పత్తి చేసేందుకు.. పలు కంపెనీలు ప్రణాళికలు రూపొందించుకున్నాయని.. భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ సవానే తెలిపారు. ఇక, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేకర్ సైతం భారత్‌లో సెమీ కండక్టర్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు సుముఖంగా వున్నట్టు ప్రకటించారు. టాటా గ్రూప్ ద్వారా ఇప్పటికే ఎలక్ట్రానిక్ పరికరాలు, 5జీ టెక్నాలజీతో పాటు సెమీ కండక్టర్లను కూడా తయారుచేస్తోంది.
ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ లో టాటా గ్రూప్ ఉండగా, ఇక చిప్ తయారీలోనూ కాలు మోపేందుకు సన్నద్ధమవుతోంది. అయితే దీనిపై ఇప్పటికే ముందడుగు వేసింది.