నితిన్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అందాల బ్యూటీ అదాశర్మ. సినిమాలో అవకాశాలు భారీగా లేకపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోషూట్స్‌తో యువతకు పిచ్చెక్కిస్తూ…ఎప్పుడూ ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో హాట్ ఫోటోలను అప్తోడ్ చేస్తూ అభిమానులకు కనుల విందు పంచుతూ ఉంటుంది.
అయితే సెలబ్రిటీ అన్న తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నెగిటివ్, పాజిటివ్ కామెంట్స్ పెడతారు. పాజిటివ్ కామెంట్స్ కు ఎలా రీయాక్ట్ అవుతామో…నెగిటివ్ కామెంట్స్ పై కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి.

రీసెంట్ గా అదాశర్మ ట్విట్టర్ అకౌంట్ లో ఓ అభిమాని పెట్టిన కామెంట్ కి ఆమె ఇచ్చిన రిప్లే చూసి అందరూ షాక్ కు గురవుతున్నారు. అసలు విషయం ఏమిటంటే ఇటీవల అదా శర్మ తన ట్విట్టర్ ఖాతాలో బ్లూ శారీతో దిగిన ఫోటోలు అప్లోడ్ చేసింది.
ఆమె ఫోటలు పెట్టడం ఆలస్యం కొద్ది నిమిషాల్లోనే వందలు, వేలల్లో లైక్ లు, కామెంట్లు వచ్చాయి. ఆ కామెంట్స్ లో ఒక అభిమాని ‘మొన్న ప్రొపోజ్ చేశాను కదా..ఎప్పుడు ఎస్ చెప్తావ్ అని అడుగుతాడు..నువ్వు ఎస్ చెప్పకపోతే నేను తమన్నా ని పెళ్లి చేసేసుకుంటా’ అంటూ కామెంట్ పెట్టాడు.
దీనికి అదా శర్మ క్వాట్ చేస్తూ తమన్నాను పెళ్లి చేసుకో నేను మనస్ఫూర్తిగా మీ ఇద్దరి పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను..ఆమెని సంతోషంగా ఉంచుతావని ఆశిస్తున్నాను అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చింది….ఆమె కామెంట్ ఫన్నీగా ఉన్న ఇది తమన్నా చూస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో అని నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో మాట్లాడుకుంటున్నారు.