Homeఅంతర్జాతీయంతాలిబన్ ప్రభుత్వం అరాచకం... మరో కఠిన నిర్ణయం

తాలిబన్ ప్రభుత్వం అరాచకం… మరో కఠిన నిర్ణయం

మహిళలు, బాలికలపై తాలిబాన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తూనే ఉంది.. ఉన్నత చదువులపై కఠిన ఆంక్షలను రెట్టింపు చేస్తోంది.. యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలకు వారిని అనుమతించరాదంటూ.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది..మహిళలు, బాలికల చదువులపై తాలిబాన్ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై ప్రపంచ దేశాల నుంచి నిరసన వ్యక్తం అవుతోందా..? మహిళల స్వేచ్ఛ, ఆంక్షలు లేని విద్య కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశంపై ఒత్తిడి వస్తోందా..?

అఫ్ఘనిస్తాన్ లో మహిళల ఉన్నత చదువులపై తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. మహిళల చదువుపై ఆంక్షలు రెట్టింపు చేసింది. యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు వారిని అనుమతించరాదంటూ ప్రైవేట్ విశ్వ విద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టరేట్ స్థాయి ప్రవేశాలకు నిర్వహించే ఎలాంటి పరీక్షలకు వారికి అనుమతి ఇవ్వొద్దంటూ తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. దీనిని ఆ దేశ విద్యాశాఖ ప్రతినిధి జియాఉల్లా హష్మీ నిర్ధారించారు.

మహిళల విద్యపై అఫ్ఘనిస్తాన్ లో అమలవుతున్న ఆంక్షలపై ప్రపంచ దేశాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.మహిళల స్వేచ్ఛ, ఆంక్షలు లేని విద్య కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశంపై ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు ఈ నెలలో అఫ్ఘనిస్తాన్ లో వరుస పర్యటనలు జరిపి ఆ దేశ నేతలతో చర్చలు జరుపుతున్నారు. దీంతో మహిళల విద్యపై ఆంక్షలను అప్ఘానిస్తాన్ ప్రభుత్వం ఎత్తివేయడం గానీ, సవరించడం గానీ చేస్తుందని అందరూ ఆశిస్తున్న స్థాయిలో మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాలిబన్ పాలకులు ఉత్తర్వులు జారీ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ లో బాలికల హైస్కూల్ స్థాయి చదువులపై పలు ఆంక్షలు అమలవుతుండటం జరుగుతుంది..

మరోవైపు తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముుందని హెచ్చరించింది. ఇటీవల ఆఫ్ఘాన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించింది. మహిళలు, బాలికల హక్కులను పరిరక్షణకు చొరవ చూపాలని తాలిబన్లను కోరింది.

చదువులు, ఉద్యోగాల నుంచి మహిళలను దూరం చేస్తూ తాలిబన్ ప్రభుత్వం విధిస్తున్న నిషేదాజ్ఞలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. స్థానికంగా మానవతా సంక్షోభం నెలకొన్న వేళ ఈ ఆంక్షలు ఆఫ్ఘాన్ ను మరింత ఏకాకిని చేస్తాయని తెలిపింది.తమ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారికి తమ సంఘీభావం ప్రకటించింది. అధికారులతో చర్చలు జరిపింది. తమ పరిశీలనలు, సిఫారుసులను ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలతో పంచుకోనుంది.

ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టిన నాటి నుంచి తాలిబన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా మహిళల విద్యపై నిషేధాన్ని విధించిన తాలిబన్లు.. ఉద్యోగాలు చేయడం,యూనివర్సిటీలకు వెళ్లడం, ఎన్ జీవోలలో పని చేయడాన్ని కట్టడి చేశారు. దీనిపై స్థానిక మహిళలు ఆందోళనలు కూడా నిర్వహించారు. తాలిబన్ల నిర్ణయాలను అంతర్జాతీయంగా చాలా దేశాలు వ్యతిరేకించాయి.అయినప్పటికీ వాటిని తిరిగి కొనసాగించడం తమ ప్రాధాన్యం కాదని తాలిబాన్లు తెలిపారు. హింస ఇస్లామిక్ చట్టాలను మహిళలు అతిక్రమించడం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తాలిబన్లు స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్ లోని మహిళల హక్కులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తాము వెనక్కి తగ్గేదేలే అనేదిగా తాలిబాన్లు వ్యవహరిస్తున్నారు.

ఇస్లామిక్, షరియాకు అనుగుణంగా అన్ని విషయాలను నియంత్రిస్తున్నారని, షరియాకు వ్యతిరేకంగా ఏ పనిని కూడా తమ ప్రభుత్వం అనుమతించబోదని తాలిబన్లు స్పష్టం చేశారు. షరియా చట్టాల ప్రకారమే మహిళలపై ఆంక్షలు విధిస్తున్నామన్న తాలిబన్ల వాదనను ముస్లిం దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఖండించింది. మహిళల హక్కులను కాలరాయొద్దంటూ తాలిబన్లకు ఇటీవలే సూచనలు చేసింది.

మహిళలు, బాలికల చదువు ఉద్యోగం లాంటి హక్కుల నుంచి దూరం చేయొద్దని చెప్పింది. అయితే తాలిబన్లు మాత్రం ఎవరి మాట వినేలా కనిపించడంలేదు..తాలిబాన్లు ఏడవ తరగతి నుండి బాలికలను పాఠశాలకు రాకుండా నిషేధించారు, అన్ని కవర్ దుస్తులను విధించారు.. ఆంక్షలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని హింసిస్తున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి తాలిబాన్‌లు సాగిస్తున్న అణచివేతతో ఆఫ్ఘన్ మహిళలు, బాలికల జీవితాలు నాశనమవుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఆగష్టు 2021లో రాజధాని కాబూల్‌ను వారు స్వాధీనం చేసుకున్న తర్వాత అంతర్జాతీయంగా మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత, తాలిబాన్ 1990లలో అధికారంలో ఉన్న వారి మొదటి సారి నుండి తమను తాము మోడరేట్ చేసినట్లుగా ప్రదర్శించారు. ప్రారంభంలో, తాలిబాన్ అధికారులు మహిళలు పనిని కొనసాగించడానికి, బాలికలు వారి విద్యను కొనసాగించడానికి అనుమతించడం గురించి మాట్లాడారు.బదులుగా, వారు ఏడవ తరగతి నుండి బాలికలను పాఠశాలకు రాకుండా నిషేధించిన వారి కఠినమైన పాలన యొక్క అనుభవజ్ఞులతో నిండిన పూర్తి పురుషుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కళ్ళు మాత్రమే కనిపించేలా….

మహిళలకు పనికి ప్రవేశాన్ని పరిమితం చేసే అన్ని-కవరింగ్ దుస్తులను విధించారు.గృహహింసను ఎదుర్కొంటున్న వారికి రక్షణను కూడా తాలిబాన్లు నిర్వీర్యం చేశారని, చిన్నపాటి ఉల్లంఘనలకు మహిళలు మరియు బాలికలను నిర్బంధించారని.. బాల్య వివాహాలు పెరగడానికి దోహదపడ్డాయని ఆమ్నెస్టీ పేర్కొంది. ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు తాలిబాన్లు అరెస్టు చేసిన మహిళలను హింసించడం,దుర్వినియోగం చేయడం కూడా నివేదికలో నమోదు చేయబడింది.

Must Read

spot_img