Homeక్రీడలుక్రికెట్క్రికెట్ పేరు వింటేనే.. అందరికీ టీ ట్వంటీ ఫార్మాట్ గుర్తుకొస్తోందా..?

క్రికెట్ పేరు వింటేనే.. అందరికీ టీ ట్వంటీ ఫార్మాట్ గుర్తుకొస్తోందా..?

క్రికెట్ పేరు వింటేనే.. అందరికీ టీ ట్వంటీ ఫార్మాట్ గుర్తుకొస్తోందా..? ఈ పరిస్థితి వన్డే క్రికెట్ ను అంపశయ్య మీదకు నెట్టిందా..? 150 ఏళ్ల క్రికెట్ చరిత్రలో వన్డే క్రికెట్ ఇప్పుడు .. కీలక మార్పులకు వేదిక గా మారుతోందా..? ఇంతకీ వన్డే క్రికెట్ విషయంలో నిపుణులు, క్రీడాకారులు, ఫ్యాన్స్ ఏమంటున్నారు..? దీన్ని మార్చాలని, లేని పక్షంలో మరణమేనని ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు..?

క్రికెట్ ఆరంభమై, 150 ఏళ్లు గడిచాయి.. అప్పటి నుంచి అప్రతిహతంగా సాగిన వన్డే ఫార్మాట్ .. ఇప్పుడెందుకు వెనుక పడింది..? దీనికి క్రీడాభిమానుల్లో వచ్చిన మార్పే కారణమా…? మరి దీనికి పూర్వ వైభవం తేవాలంటే, ఏం చేయాలన్నది నిపుణుల వాదన.. ఓవర్ల కుదింపు .. వన్డే క్రికెట్ లో సాధ్యమేనా..? ఒకవేళ అమలు చేస్తే, ఒనగూరే ఫలితాలేమిటి..?

క్రికెట్‌లో కొత్త ఫార్మాట్ రానుందా? వన్డే క్రికెట్‌లో మార్పు తీసుకు రానున్నారా? ఇప్పుడు 40 ఓవర్ల పాటు వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు
సమాధానాలు పొందడం కష్టమే. కానీ, ఈ మార్పులు భవిష్యత్తులో రానున్నట్లు చర్చలు మొదలయ్యాయి. వన్డే ఫార్మాట్‌ను సజీవంగా ఉంచాలంటే అందులో మార్పు అవసరమని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వన్డే క్రికెట్‌లో ఇకపై 40 ఓవర్లు ఉండాలని సలహా ఇచ్చాడు. శాస్త్రి ప్రకటనను దినేష్ కార్తీక్ కూడా సమర్థించారు. వన్డే క్రికెట్ శోభను కోల్పోతుందని, ఈ ఏడాది ప్రపంచకప్ చివరిసారిగా 50 ఓవర్లు కావొచ్చని మాజీలు అభిప్రాయపడుతున్నారు. వన్డే క్రికెట్‌నుకాపాడుకోవాలంటే భవిష్యత్తులో 40-40 ఓవర్లకు తగ్గించాలని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. శాస్త్రి మాట్లాడుతూ, 1983లో మనం ప్రపంచకప్‌ గెలిచినప్పుడు 60 ఓవర్ల మ్యాచ్‌లు ఉండేవి.

ఆ తర్వాత ప్రజలలో ఆసక్తి తగ్గి దానిని 50 ఓవర్లకు కుదించారు. దాన్ని 40 ఓవర్లకు కుదించే సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. కాలంతో పాటు మార్పు అవసరమంటూ చెప్పుకొచ్చారు. క్రికెట్ గురించి తెలియని వారు ఉండరు. క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక మార్పులు వచ్చాయి. టెస్టులు, వన్డేలు, టీ-20లు, టీ-10 ఫార్మాట్‌లతో క్రీడాభిమానులను అలరిస్తున్న క్రికెట్.. ఇప్పుడు మరో కొత్త ఫార్మాట్‌కు సిద్దమైంది. సంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌కు భిన్నంగా క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌ ప్రారంభమైనప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌కు బీజం పడింది. ఆతరువాత టీ20 ఫార్మాట్‌ కూడా తోడవటంతో ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ రెట్టింపు అయ్యింది. మూడు గంటల్లో మ్యాచ్‌ ముగియడం, బోర్ కొట్టించే డిఫెన్స్ వంటివి ఉండకపోవడంతో ఇన్‌స్టంట్‌ హిట్‌ అయ్యింది.

ఇప్పుడు క్రికెట్‌ అభిమానులను మరింతగా ఎంటర్‌టైన్‌ చేసేందుకు ఇప్పుడు మరో కొత్త ఫార్మాట్ ముందుకొస్తోంది. ఎనిమిది మంది ఆటగాళ్లతో ఓ జట్టును ఏర్పాటు చేసి, ఒక్కో ఇన్నింగ్స్‌లో 100 బంతులతో క్రికెట్ ఆడేలా కొత్త ఫార్మట్‌కు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ప్రతిపాదించింది. ఈ ఫార్మాట్‌లో 6 బంతులతో కూడిన 15 ఓవర్లు, 10 బంతులతో కూడిన ఓ ఓవర్‌ ఉంటాయని బోర్డు తెలిపింది. ప్రస్తుత ట్వంటీ20 ఫార్మాట్ కన్నా ఇందులో 20 బంతులు తక్కువగా వేస్తారు. 2020 నుంచి ఈ కొత్త ఫార్మాట్‌‌ను ప్రారంభించేందుకు ఈసీబీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్య వన్డే క్రికెట్ భవిష్యత్తు గురించి చర్చలు ఎక్కువ అయ్యాయి.

ఇందుకు బలమైన కారణం కూడా ఉంది. ఈ జూలైలో 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి బెన్ స్టోక్స్ రిటైర్మెంట్‌తో మరోసారి ఈ ఫార్మాట్‌పై ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ఫార్మాట్ ఒకప్పుడు అభిమానులకు ఎంతో ఆనందాన్ని అందించింది. అయితే, కాలక్రమేణ ఈ ఫార్మాట్ తన ప్రాభావాన్ని కోల్పోతోంది. వన్డే క్రికెట్ తన మెరుపును కోల్పోవడం యాదృచ్చికం మాత్రం కాదు. టెస్ట్ ఫార్మాట్ అనేది క్రికెట్తొ లి ఫార్మాట్. అయితే, ఈ మధ్య వచ్చిన పొట్టి ఫార్మాట్ సహస్రాబ్దాలుగా అందించే థ్రిల్, వినోదాన్ని తన వెంట తీసుకపోయింది. దశాబ్దాల క్రితం, 50-ఓవర్ల ఫార్మాట్ ఆవిర్భావం ఆట పొడవైన ఫార్మాట్‌పై ఆసక్తిని తగ్గించడానికి దారితీసింది. ప్రస్తుతం T20 క్రికెట్ ODI క్రికెట్‌కు మరణ శాసనం రాస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా T20I మ్యాచ్‌లు, లీగ్‌ల ప్రజాదరణ పెరుగుదలతో.. 50 ఓవర్ల క్రికెట్ భవిష్యత్తును తీవ్రమైన ప్రమాదంలో పడేస్తోంది. అయితే, ఎన్నో అద్భుతమైన క్షణాలను అందించిన 50-ఓవర్ల ఫార్మాట్, గేమ్‌లోని పొడవైన, పొట్టి ఫార్మాట్‌ల మధ్య కీలకమైన వారధిగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.

150 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న క్రికెట్‌లో కాలాన్ని బట్టి మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ జెంటిల్మెన్‌ గేమ్‌ను అభిమానులకు మరింత చేరవ చేయడానికి, మరింత క్రీడాస్ఫూర్తితో ఆడటానికి తరచూ మార్పులు అవసరమవుతూనే ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా మరిన్ని మార్పులతో క్రికెట్‌ మన ముందుకు రానుంది. అంతర్జాతీయ క్రికెట్ లో వన్డే క్రికెట్ కు మంచి గుర్తింపు ఉంది. 50 ఓవర్ల పాటు సాగే ఈ ఆటలో ఎవరి ఆధిపత్యం ఉంటుంది అనే దానిపై అందరూ ఆసక్తికరంగానే చూస్తారు. క్రికెట్ లో టెస్ట్ క్రికెట్ తర్వాత ఒకప్పుడు మంచి ఆదరణ ఉన్నది దీనికే. సుమారు 150 ఏండ్లుగా ఆడుతున్న క్రికెట్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. టెస్టు క్రికెట్ నుంచి 60 ఓవర్ల వన్డే ఫార్మాట్.. దానిని 50 ఓవర్లకు కుదించడం.. 2000వ దశకంలో టీ20 ఫార్మాట్.. గత కొంతకాలంగా అది కాస్తా టీ10లీగ్ లకు వచ్చింది. దీంతో వన్డే క్రికెట్ బతకాలంటే ఈ ఆటలో కూడా మార్పులు రావాల్సిందే. ఈ ఫార్మాట్ ను బతికించుకోవాలంటే 40 ఓవర్లకు కుదించాల్సిందే… అన్న వాదనలు నిపుణులు, అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం క్రికెట్ లో టీ20 ఫార్మాటే ప్రధానం. ఆటకు ఇదే కామధేనువు. అంతర్జాతీయంగా ద్వైపాక్షిక సిరీస్ లు కూడా నియంత్రించాలి. ఇప్పటికే చాలా దేశాల్లో టీ20 ఫ్రాంచైజీలు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రపంచకప్ లు వచ్చినప్పుడు ద్వైపాక్షిక గేమ్ లను కొన్నింటిని ఆడిస్తే సరిపోతుందని వీరంతా అంటున్నారు. అప్పుడే క్రికెట్ లో అన్ని ఫార్మాట్లను బతికించుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే టీ20 క్రికెట్ వచ్చే వరకూ వన్డేల పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత క్రమంగా ఈ ఫార్మాట్ తన చరిష్మా కోల్పోతూ వస్తోంది. ఇప్పుడు వన్డేలంటే అభిమానులూ మొహం చిట్లిస్తున్నారు. ఒక రోజంతా ఎవరు టీవీల ముందు కూర్చుంటారని మాజీ క్రికెటర్లే అభిప్రాయపడుతున్నారు.

టెస్ట్ క్రికెట్ కు అన్నింటి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నిపుణులు కోరుతున్నారు. భారత ఉపఖండంతోపాటు ఆస్ట్రేలియాలాంటి దేశాలలో క్రికెట్ మూడు ఫార్మాట్లూ మనుగడ సాగిస్తాయని అభిప్రాయపడ్డారు. వన్డేలు మనుగడ సాగించాలంటే ఈ ఫార్మాట్ ను 40 ఓవర్లకు కుదించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. పాక్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ సైతం వన్డేలకు ఆదరణ పెరిగేందుకు ఈ ఫార్మాట్‌లో మార్పులు చేయాల్సిందిగా సూచించారు. ఇప్పుడు వన్డే క్రికెట్ చాలా బోరింగ్‌గా మారిపోయింది. దీన్ని 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి 40 ఓవర్ల ఫార్మాట్‌గా మారిస్తే కాస్త ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని అఫ్రిది కామెంట్ చేశారు.

ఇటీవలి కాలంలో చాలామంది క్రికెటర్ల వన్డేలకు గుడ్‌బై చెబుతున్నందున ఈ మార్పుపై ఐసీసీ దృష్టి సారించాలని కోరారు. 50 ఓవర్ల పాటు ఆట సాగడం వల్ల ప్రేక్షకులు బోర్‌ ఫీలవుతుంటే, ఆటగాళ్లు తీవ్ర అలసటకు లోనై ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఈ విషయంలో ఐసీసీ ఇకనైనా మేల్కొనకపోతే వన్డే ఫార్మాట్‌ చచ్చిపోతుందని తెలిపారు. మరోవైపు వసీమ్‌ అక్రమ్‌ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌లో నుంచి వన్డే ఫార్మాట్‌ను తొలగించాలని వాదిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇటీవల అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పడం ఈ ఫార్మాట్ మనుగడపై చర్చకు దారి తీసింది. టీ20లు రాజ్యమేలుతున్న ఈ కాలంలో వన్డేలకు ఆదరణ లభించడంలేదని మాజీ క్రికెటర్లు వాదిస్తున్నారు. అందుకే ఫార్మాట్‌లో మార్పులు చేయాలని సూచిస్తున్నారు.

ఐపీఎల్, 100 బాల్స్ క్రికెట్ పేరిట .. కొత్త ఫార్మాట్లు వస్తోన్న వేళ .. వన్డే క్రికెట్ లో .. మార్పులు సహేతుకమేనన్న వాదనలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. దీంతో క్రికెట్ఫా ర్మాట్ మార్పులు త్వరలోనే అందరినీ ఆకట్టుకోవడమే కాక .. పూర్వ వైభవాన్ని తెస్తాయన్న ఆశలు అభిమానుల్లో కనిపిస్తున్నాయి.

Must Read

spot_img