Homeసినిమాదర్శకుడు బాల, సూర్య లది సూపర్ హిట్ కాంబినేషన్...

దర్శకుడు బాల, సూర్య లది సూపర్ హిట్ కాంబినేషన్…

తమిళ స్టార్ హీరో సూర్య విభిన్న కథలతో సినిమాలు చూస్తూ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. జై భీం, ఆకాశంలో నీ హద్దులో సినిమాలతో విమర్శకుల నుంచి సూర్య ప్రశంసలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే సూర్య 41వ చిత్రాన్ని దర్శకుడు బాల కాంబినేషన్లో చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో శివ పుత్రుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులోనూ డబ్బింగ్ ఇక్కడ కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా విడుదలైన 18 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్స్ సినిమా అనౌన్స్ కావడంతో ఫ్యాన్స్ సైతం హర్షం వ్యక్తం చేశారు.

ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్య.. జ్యోతిక నిర్మాతలుగా.. రాజేశేఖర పాండియన్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే “నా గురువు లాంటి వ్యక్తి బాలతో యాక్షన్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నా.. 18 ఏళ్ళ తర్వాత మళ్లీ ఇప్పుడు జరిగింది.. మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ సూర్య ట్వీట్ చేశారు. ఈ మూవీలో తనను డైరెక్టర్ బాల ఒక యూనిక్ గా చూపించడానికి ఒక ఉద్వేగ పూరితమైన కథను సిద్ధం చేశాడని సూర్య చెప్పారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈ మూవీలో సూర్యకు జోడిగా కృతి శెట్టి నటిస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ క్రేజ్ ప్రాజెక్టు నుంచి సూర్య తప్పుకొని తాజాగా అభిమానులకు భారీ షాకిచ్చాడు. ఈ మూవీ కథను దర్శకుడు బాల మార్చడంతోనే ఈ ప్రాజెక్టు నుంచి సూర్య బయటికి వచ్చినట్లు చెబుతున్నాడు. కాగా దర్శకుడు బాల సైతం కథలో మార్పులు చేయడం వల్ల సూర్యకు సూట్ కాదని పేర్కొనడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే తాజాగా మరో నటుడితో ఈ ప్రాజెక్టును పునః ప్రారంభించేందుకు దర్శకుడు బాల ప్లాన్ చేస్తున్నారు. సూర్య స్థానంలో ప్రముఖ నటుడు అరుణ్ విజయ్ నటిస్తాడనే ప్రచారం కోలివువుడ్ సర్కిల్స్ జరుగుతోంది. ఇక గతంలో సూర్యకు ప్రత్యామ్నాయంగా అథర్వను ఎంపిక చేశారనే వార్తలు విన్పించాయి. అయితే ప్రస్తుతం అరుణ్ విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Must Read

spot_img