తమిళ స్టార్ హీరో సూర్య గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇతను అన్ని రకాల పాత్రలు, అని రకాల సినిమాలు చేస్తుంటాడు. తెలుగులోనూ సూర్యకి మంచి క్రేజ్ ఉంది. ఏ పాత్రలోనైనా పాత్రకి తగ్గట్టు కొత్త గెటప్ లో మారిపోతాడు సూర్య. ఎలాంటి పాత్ర అయినా సరే తన యాక్టింగ్ తో జీవం పోస్తుంటాడు. ఆకాశం నీ హద్దురా… జై భీమ్…. విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర తన రేంజ్ ను మరింతగా పెంచాయి. అసలు గర్వం లేని వ్యక్తిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూర్య.
నిజజీవితంలో కూడా సూర్య చాలా సోషల్ యాక్టివిటీస్ లు చేస్తుంటాడు. అంతేకాదు చాలా సింపుల్ గా ఉంటాడు. అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. అందుకే అతను తెలుగు ప్రేక్షకులకు కూడా మరింతగా ఆకర్షిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా.. తాజాగా హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా కోసం సూర్య రీసెంట్ గా ప్రిపేర్ చేసిన లుక్ గాని తన వర్కవుట్ వీడియోస్ గాని సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారాయి. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో బ్యూటిఫుల్ స్నాప్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సూర్య ఇటీవల ముంబై వెళ్లగా అక్కడ క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ని కలిసారు. అందులో పెద్ద వింతేముంది అనుకుంటున్నారా..? ఒక స్టార్..మరో స్టార్ తో ఫోటోలు దిగటం మాములే అనుకోవచ్చు కానీ ఆ ఫోటోలో విక్రమ్ సినిమాలో చూపించిన రోలెక్స్ లా లేడు. సాధారణ సచిన్ అభిమానిలా కనిపించాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో దిగిన ఫోటోను సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడమే కాకుండా గౌరవం, ప్రేమ @ సచిన్ టెండూల్కర్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే సూర్య సచిన్ తో ఎప్పుడు ఎక్కడ ఫొటో దిగాడనేది మాత్రం తెలియదు. సూర్య షేర్ చేసిన ఫోటోపై అభిమానులు స్పందించారు.
సూర్య లాంటి పెద్ద హీరో సచిన్ పక్కన ఫోటో దిగుతూ..ఓ సాధారణ అభిమానిగా ఉండటం పట్ల ఆయనకు సచిన్ పట్ల ఉన్న గౌరవాన్ని చూపించాడని నెట్టింట్లో అభిమానులు తెగ ఫోస్టులు పెడుతున్నారు. ఒక పక్క జాతీయ అవార్డు గెలిచిన విజేత.. మరోపక్క అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన క్రికెటర్.. ఇద్దరు దిగ్గజాలు ఎదురుపడిన వేళ అంటూ కామెంట్స్ జత చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఒక్క సూర్యకే ఉందంటూ.. కామెంట్ల రూపంలో సూర్య గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. దీనితో ఈ బ్యూటిఫుల్ స్నాప్ సినీ వర్గాల్లో మరియు స్పోర్ట్స్ అభిమానుల్లో వైరల్ గా మారిపోయింది. ఇక సూర్య సినిమా ప్రస్తుతం పలు భారీ సెట్స్ లో షూటింగ్ జరుగుతూ ఉండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే గ్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.