Homeఅంతర్జాతీయంఫోర్త్ వేవ్ వేళ వర్క్ ఫ్రం హోమ్ కు మద్ధతు..

ఫోర్త్ వేవ్ వేళ వర్క్ ఫ్రం హోమ్ కు మద్ధతు..

గత రెండేళ్లలో కరోనా .. తీవ్ర మార్పుల్ని తీసుకొచ్చింది. ఆఫీసుల్లో పనిని .. ఇంటికి తీసుకొచ్చింది.. అయితే మళ్లీ కొత్త వేరియంట్ తో ఫోర్త్ వేవ్ టాక్
వేళ మళ్లీ ఇంటి నుంచే పని షురూ కానుంది.

ఐటీ కంపెనీల్లో కరోనా దెబ్బకు వర్క్ ఫ్రం హోం మొదలైంది. ఇప్పుడు మళ్లీ ఫోర్త్ వేవ్ భయాందోళనలతో వర్క్ ఫ్రం హోం దిశగా ఐటీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అయితే ఇదెంతమేరకు సాధ్యమన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

కరోనా పరిస్థితులు చాలా రంగాల్లో మార్పులు తీసుకొచ్చాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొత్త విధానాలు అమల్లోకి వచ్చాయి. ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశాలను కంపెనీలు కల్పించాయి. ఇదిలా కొనసాగుతుండగానే, ఇప్పుడు కరోనా వైరస్ పుట్టిల్లైన చైనాలో కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రకం వేరియంట్ లక్షల మందిని ఆసుపత్రుల పాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో కంపెనీల్లోనే కాక ఉద్యోగుల్లోనూ భయాలు మెుదలయ్యాయి. దీంతో కంపెనీలు మళ్లీ 2023లోనూ హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, మారికో, టాటా స్టీల్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తో పాటు మరిన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఇదే బాటను ఎంచుకునే అవకాశం ఉంది.

ప్రస్తుత మాంద్య వేళ హైబ్రిడ్ మోడల్ వర్క్ అనేది కంపెనీలు, ఉద్యోగుల మధ్య ప్రాధాన్యత ఎంపికగా మారుతోంది. పైగా ఇటు ఉద్యోగాన్ని, అటు కుటుంబాన్ని ఏకకాలంలో బ్యాలెన్స్ చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ దోహదపడుతుందని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నట్లు ఇప్పటికే పలు సర్వేల్లో వెల్లడైంది. చాలా ఐటీ సేవల కంపెనీలు తమ ప్రాజెక్టులకు అనుగుణంగా ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.

దీనికి సంబంధించి రోస్టర్ తయారు చేయాలని మేనేజర్లకు సైతం సమాచారం ఇచ్చాయి. దీనివల్ల ఆఫీసుల్లో ఉద్యోగులు ఒకరిని ఒకరు కలవటం మంచి రిలేషన్ షిప్ పెరగటానికి దోహదపడుతోందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇది వారి ప్రొడక్టివిటీని కూడా పెంచటానికి సహాయకారిగా నిలుస్తుందని అంటున్నారు. ఫ్లిఫ్ కార్ట్ కంపెనీ గత కొన్ని నెలలుగా హైబ్రిడ్ మోడల్‌ను అమలు చేస్తోంది.

మూన్ లైటింగ్ సమస్యలతో ఐటీ కంపెనీలు..

ఇదే సమయంలో LTIMind Tree ప్రస్తుతం 100 శాతం ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నప్పటికీ, ఉద్యోగుల డిమాండ్, అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించే అవకాశముందని కంపెనీ పేర్కొంది. భారత్‌లో కరోనా కేసులు మళ్లీ విపరీతంగాపెరిగిపోతున్నాయి. మరోసారి గతంలో ఎదుర్కొన్న పరిస్థితులు పునరావృతమైతే ఎలా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు BF 7 Variant విజృంభణతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.

ఇటీవల చైనాలో రోజుకు లక్షల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో మరోసారి పలు దేశాలకు చైనా కొత్త వేరియంట్‌ను పంపినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లో కూడా కొవిడ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కూడా అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయాలు, బస్‌స్టేషన్లు, మెట్రో వంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.

ఇదే తరుణంలో మరోసారి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నాయి పలు కంపెనీలు. 2021లో కరోనా సృష్టించిన విలయం తెలిసిందే. ఎందరో జీవితాలు రోడ్డున పడ్డాయి. ఉద్యోగాలు, ప్రాణాలు పోయాయి. బతుకులు ఆగమయ్యాయి. ఇదే నేపథ్యంలో ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. ఉపాధి కరువైంది. కంపెనీలు కూడా చాలా వరకు తమ వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకున్నాయి. ఇక మిగతావారికి వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించాయి.

అయితే ఇప్పుడిప్పుడే ఆఫీసులు మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు వారంలో 5 రోజులు కాకున్నా.. కనీసం రెండు, మూడు రోజులైనా ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.

ఈ మేరకు హైబ్రిడ్ మోడల్‌కు సంబంధించి ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా సహా ఇతర ఐటీ దిగ్గజ కంపెనీలు మార్గదర్శకాలను విడుదల
చేశాయి. హైబ్రిడ్ మోడల్ అంటే కొన్ని రోజులు ఆఫీసుల్లో, కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేయాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న COVID-19 కేసుల మధ్య భారత ప్రభుత్వం కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక మార్గదర్శకాలను జారీ చేస్తున్నప్పుడు, ఇంటి నుండి పని తిరిగి వచ్చే అవకాశం ఉంది. వివిధ నివేదికల ప్రకారం, COVID-19 వ్యాప్తి చెందుతుందనే భయాలు, లాక్‌డౌన్ దేశాన్ని పట్టుకున్నందున
Work From Home తిరిగి అమలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే కరోనా భయం దేశాన్ని పట్టుకున్నందున ఆతిథ్యం, రవాణా, పర్యాటకం, రియల్ ఎస్టేట్‌తో సహా వివిధ రంగాలు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. Omicron కొత్త BF.7 వేరియంట్ చాలా మందిలో భయాందోళనలు కలిగిస్తోంది కాబట్టి, వివిధ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ని ఎంచుకునే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో నాల్గో వేవ్ దేశాన్ని తాకగలదని చాలా మంది భయపడుతున్నారు.

అందుకే కంపెనీలు ఇంటి నుండి పని ఎంపికకు తిరిగి రావడానికి తమను తాము సిద్ధం చేసుకుంటున్నాయని తెలుస్తోంది. మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితి రాకపోవచ్చని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నా.. భరోసా మాత్రం ఇవ్వలేకపోతున్నారు. చైనా పాటిస్తున్న గోప్యతతో సబ్‌ వేరియంట్లు ఎన్ని పుట్టుకొస్తున్నాయో.. మన వ్యాక్సిన్‌ వాటిని సమర్థవంతంగా ఎందుక్కొంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొన్ని నెలలుగా ఆరంభమైన వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌.. నుంచి వర్క్ ఫ్రం హోం దిశగా మారుతున్నాయి.

కరోనా తగ్గుముఖంతో అందరూ ఆఫీసులకు రావాలని, ఆఫీసుల నుండే పనులు చేయాలని ఆయా సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఊహించని విధంగా మళ్లీ కరోనా అనేక కంపెనీలపై, వ్యాపార సంస్థలపై బాంబు పేల్చింది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే క్రమంలో హైబ్రిడ్‌ మోడల్‌ అమలుచేస్తున్న సంస్థలు, తాజా కరోనా ఆందోళనల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆఫీసుకు వచ్చి పని చేయడంపై ఆలోచనలో పడ్డాయి.

మళ్లీ కరోనా కారణంగా పరిస్థితులు తారుమారు అయినట్టు భావిస్తున్న సంస్థలు ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని, వర్క్‌ ఫ్రం హోం పని చేసుకోమని చెబుతున్నాయి. మళ్లీ కరోనా ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగులు కూడా వర్క్‌ ఫ్రం హోం చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు మరోమారు వర్క్ ఫ్రం హోం పై అన్ని కంపెనీలు ఆలోచించేలా చేస్తున్నాయి.

మరోవైపు ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా హైబ్రిడ్ మోడల్ ను కొనసాగించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక తాము కల్పించే ఈ సౌకర్యాలతో ఉద్యోగులు ఆఫీస్ వర్క్ తో పాటుగా పర్సనల్ లైఫ్ ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చనే అభిప్రాయం కంపెనీల్లో వ్యక్తమౌతుంది. ఏది ఏమైనా మళ్ళీ కరోనా ఆందోళనల నేపధ్యంలో ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోం పని చెయ్యటానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

అయితే అదే సమయంలో గతంలో వర్క్ ఫ్రం హోం వేళ తలెత్తిన మూన్ లైటింగ్ వంటి అంశాలపై కంపెనీలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్నదే ఆసక్తికరంగా మారింది. దీంతో కరోనా ఫోర్త్ వేవ్ వేళ .. కంపెనీలు మొత్తంగా వర్క్ ఫ్రం హోం ను అమలు చేస్తాయా లేక హైబ్రీడ్ విధానాన్ని అనుసరిస్తాయో అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఫోర్త్ వేవ్ వేళ డబ్ల్యూఎఫ్ హెచ్ కు మద్ధతు పెరుగుతోంది. అయితే మూన్ లైటింగ్ సమస్యలతో ఐటీ కంపెనీలు హైబ్రీడ్ తరహా విధానాన్ని
అనుసరిస్తాయన్నదే చర్చనీయాంశమవుతోంది.

Must Read

spot_img