తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమా జైలర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలర్ తో.. మరోసారి రజనీ తనదైన స్వాగ్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో పాన్ ఇండియా యాక్టర్స్ కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది.
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ జైలర్. పెద్దన్న సినిమా తర్వాత రజనీకాంత్ నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం. అలాగే దర్శకుడు నెల్సన్ దిలీప్ బీస్ట్ మూవీ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్ మొదటిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అన్ని ఇండస్ట్రీల నుంచి నటులను ఎంపిక చేయడం విశేషం.
మలయాళం నుంచి స్టార్ హీరో మోహన్ లాల్ ని ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్ ని ఫైనల్ చేశారు. టాలీవుడ్ నుంచి సునీల్ ని ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. తాజాగా అతని క్యారెక్టర్ కి సంబంధించి ఫస్ట్ లుక్ ని ట్విట్టర్లో విడుదల చేశారు. ఇక బాలీవుడ్ నుంచి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పంకజ్ త్రిపాఠిని ఓ కీలక పాత్ర కోసం ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఈ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్స్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ ని ఫైనల్ చేశారు. ఓ పాత్ర కోసం ప్రియాంక అరుల్ మోహన్ ని ఎంపిక చేశారు. టాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమ్యకృష్ణ ని స్టార్ హీరోయిన్ త్రిషను ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే జైలర్ సినిమా కంప్లీట్ గా స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిస్తున్న సినిమా అని చెప్పాలి. మరి ఇంతమంది సీనియర్ స్టార్స్ ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.