ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో అట్లీ- విజయ్ కాంబో ఒకటి.
వీళ్ళిద్ధరి కలయికలో సినిమా వస్తుందంటే అది పక్కా బ్లాక్‌బస్టర్ అని తమిళంలో అంటుంటారు. ఇప్పటికే వీళ్ల కాంబోలో తెరకెక్కిన తేరీ, మెర్సల్, బిగిల్ ఒకదానికి మించి మరొకటి ఘన విజయం సాధించాయి. సీన్ కట్ చేస్తే.. మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.
తమిళ్ సూపర్ స్టార్ విజయ్ మరియు అట్లీ కాంబినేషన్ లో ఇప్పటికే థేరి.. మెర్సల్.. బిగిల్ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. వందల కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమాలు తమిళ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ను సొంతం చేసుకున్నాయి అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత హిందీలోనే తన సూపర్ హిట్ చిత్రంలో ఒక సినిమాను రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి.
ఇంతలోనే తమిళ మీడియాలో సూపర్ స్టార్ విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వారు ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో డబుల్ హ్యాట్రిక్ కు సన్ పిక్చర్స్ వారి బ్యానర్ లో ఒక సినిమా రూపొందబోతుందని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తమిళ మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ చేస్తున్న ‘లియో’ తర్వాత ఈ సినిమా ఉంటుందేమో చూడాలి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న లియో సినిమా అక్టోబర్ లో విడుదల కాబోతుంది.
అంతకు ముందే అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ లోనే సినిమా ను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారట. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కూడా అప్పటి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబోకు తమిళ సినీ ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. కనుక నాలుగవ సారి వీరిద్దరూ జత కట్టి సినిమా చేస్తే కచ్చితంగా అది డబుల్ హ్యాట్రిక్ గా నిలుస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏ స్థాయిలో వీరి కాంబో మూవీ ఉంటుంది అనేది చూడాలి.