Homeసినిమాకోలీవుడ్ లో బిజీ అయినా సునీల్,వరుసగా ఆఫర్లు కొట్టేసిన కమెడియన్ !

కోలీవుడ్ లో బిజీ అయినా సునీల్,వరుసగా ఆఫర్లు కొట్టేసిన కమెడియన్ !

కమెడియన్ గా స్టార్ డమ్ సాధించి.. హీరోగా కంప్లీట్ ఫెయిల్ అయ్యాడు సునిల్. అయితే ఈమధ్య రొటీన్ ను భిన్నంగా విలన్ అవతారం ఎత్తాడు సునిల్. విలన్ గా బాగా వర్కౌట్ అయినట్టుంది.. వరుసగా ఆఫర్లు కూడా కొట్టేస్తున్నాడు సునిల్. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. సునిల్ టాలీవుడ్ లో కాదు.. కోలీవుడ్ లో వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తున్నాడు. అది కూడా కమెడియన్ గా కాదు నెగెటీవ్ రోల్స్ కోసం సునిల్ ను అడుగున్నారు.

ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో నెగెటీవ్‌ రోల్‌ చేసిన సునీల్…తనలోని వేరియేషన్స్ తో ఆడియన్స్ మెప్పు పొందాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో దుమ్మురేపడంతో సునీల్‌కు సౌత్ లో భారీగా క్రేజ్ వచ్చింది. అన్నిభాషల నుంచి సునిల్ కు మంచి మంచి ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు సునిల్. ఈరెండు సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్స్ కూడా రీసెంట్ గానే రిలీజ్ అయ్యాయి. ఇక రీసెంట్ గా మరో భారీ బడ్జెట్ మూవీలో ఛాన్స్ కొట్టేశాడట సునిల్.

విశాల్‌ హీరోగా నటిస్తున్న మార్క్‌ ఆంటోని సినిమాలో సునీల్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని మూవీ టీమ్ తో పాటు.. హీరో విశాల్ కూడా కన్ ఫార్మ్ చేశాడు. సునిల్ కు వెల్ కమ్ చెపుతూ.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో పాటు.. స్పెషల్ ట్వీట్ కూడా చేశారు విశాల్. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మార్క్‌ ఆంటోని సినిమాను అదిక్ ర‌విచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ మధ్య రిలీజ్ అయిన విశాల్‌ లుక్‌ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేసింది. విశాల్‌కు జోడీగా రీతూవ‌ర్మ న‌టిస్తుంది.మినీ స్టూడీయోస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై ఎస్. వినోద్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

టాలీవుడ్‌లో స్టార్‌ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగాడు సునీల్‌. కెరీర్ పీక్స్ లో ఉండగా హీరో అవతారం ఎత్తి చేతులు కాల్చుకున్నాడు. అందాల రాముడు సినిమాతో హీరో అవతారమెత్తిన సునీల్‌కు మొదటి సినిమా బాగానే కలిసొచ్చింది. సరిగ్గా అప్పుడే రాజమౌళి చేతిలో పడ్డాడు సునీల్‌. దాంతో సునీల్‌ ఆలోచనలతో పాటు కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన మర్యాద రామన్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. సునిల్ కు ఎక్కడ లేని పాపులారిటీ వచ్చింది. ఇక అదే ఊపులో హీరోగా కమిట్ అయ్యాడు సునిల్

అయితే ఈ సినిమా తర్వాత హీరోగా నటించిన అన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో కెరీర్ అగమ్య గోచరంగా మారింది. కమెడియన్ గా తనకు ఉన్న బాడీ లాంగ్వేజ్ కూడా పోవడంతో ఎటూ తేల్చేకోలేక చాలా ఇబ్బంది పడ్డాడు సునిల్. కమెడియన్‌గా ఒక స్టాంప్‌ వేసుకున్న సునీల్‌ను ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్‌ చేయలేకపోయారు. ప్రస్తుతం హీరోగా కెరీర్ కు మంగళం పాడి.. ఇప్పుడు మళ్ళీ కమెడాయన్ గా.. విలన్ గా సెటిల్ అవుతున్నాడు.

Must Read

spot_img