ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సుందరాంగుడు ముస్తాబయ్యాడు. లవ్ ఆండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా MSK ప్రమిదశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం సుందరాంగుడు.
ఏవీ సుబ్బారావు సమర్పణలో బీసు చందర్ గౌడ్, యం.యస్.కె రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సుందరాంగుడు సినిమాలోని ‘సుందరాంగుడు నేనే- సుకుమారుడిని నేనే ‘ టైటిల్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.