Homeసినిమాపుష్ప-2…నీ యవ్వా మళ్లీ తగ్గేదే లే….

పుష్ప-2…నీ యవ్వా మళ్లీ తగ్గేదే లే….

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి పుష్ప 2. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప 2 స్టోరీ నేరేషన్ విషయంలో సుక్కు కీలక నిర్ణయం తీసుకున్నారట. సినిమా మేకింగ్ విషయంలో బన్నీ, సుకుమార్ లు తమ ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షూట్ లో అల్లు అర్జున్ పాల్గొంటున్నాడు. బన్నీ పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను సుకుమార్ షూట్ చేస్తునట్టు తెలుస్తోంది.

ఇక పుష్ప 2 సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయి. ఇప్పటికే పలు పాత్రలకు సంబంధించిన ప్రముఖ నటీనటులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అయితే ఇక పుష్ప 2 ఇంటర్వెల్ లో బన్నీ డాన్ లుక్ లో కనిపిస్తాడని టాక్.. రష్మిక పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఈ ట్విస్ట్, గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా నిలుస్తోందని.. పైగా ఈ ట్విస్ట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సుక్కు తన క్రియేటివిటీకి పదును పెట్టి ఈ సినిమాలోని క్యారెక్టర్స్ రాసుకున్నారు .. రష్మిక మందన్నకు స్క్రీన్ స్పేస్ చాలా వరకు తగ్గించారని వార్తలు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్ప మొదటి భాగంతో అటు అల్లు అర్జున్, ఇటు రష్మిక పాన్ ఇండియా క్రేజ్ కొట్టేశారు. బీటౌన్ లో కూడా పాపులర్ అయ్యారు. బన్నీ మాస్ లుక్‌కి తోడు మాన‌రిజంతో అందరిని ఆకట్టుకున్నాడు. పుష్ప నీ యవ్వా త‌గ్గేదే లే అనే మాన‌రిజం దేశ వీదేశాల్లో ట్రెండింగ్ కాగా రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర నార్త్ లో ఆమె క్రేజ్ రెట్టింపు చేసింది. దీనికి తోడు వారి ఇద్దరి మద్య కామోడీ ఓ రేంజ్ లో వర్క్అవుట్ అయింది. తాజాగా పుష్ప 2 లో డైరెక్టర్ సుకుమార్ రష్మిక పాత్ర చాలా వరకు కుదించినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా అంతా కూడా అల్లు అర్జున్ రూలింగ్ కనిపించనున్న నేపథ్యంలో ఆమెకు స్క్రీన్ స్పేస్ తగ్గించారని ఫిలిం నగర్ టాక్. అదేవిధంగా లీడింగ్ యాక్టర్లతో కొత్త పాత్రలను డిజైన్ చేశారట సుకుమార్.

ఇటీవలే వైజాగ్‌ షెడ్యూల్ పూర్తిచేసిన సుకుమార్.. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో రష్మిక పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టనున్నారాట. పాన్ ఇండియా ఇమేజ్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ కి పాన్ వరల్డ్ క్రేజ్ దక్కేలా సుకుమార్ ప్లాన్స్ చేస్తున్నారట. బన్నీ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్.

ఇక సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటు షూటింగ్ చేస్తున్న కానీ పుష్ప 2 లీక్స్ విషయంలో బాగా డిస్టర్బ్ అవుతున్నాడట. తన సినిమాతో అందరినీ సర్ప్రైజ్ చేద్దామని అనుకున్న లీక్స్ అసంతృప్తిని కలిగిస్తున్నట్లు సమాచారం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా షూటింగ్ లొకేషన్స్ నుంచి బయటకొస్తున్న పిక్స్ పట్ల సుక్కు సీరియస్ అవుతున్నారట. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి బయటకొచ్చిన స్టిల్స్ చూసి పుష్ప టీమ్‌ కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట సుక్కు. ఏది ఏమైనా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు.

Must Read

spot_img