- భారత సముద్ర జలాల్లో భద్రతను మరింత పెంచడానికి వగీర్ తోడ్పడనుందా..?
- శత్రువుల కంట పడకుండా సంచరించగల ఆధునిక టెక్నాలజీ వగీర్‌లో ఉందా..?
- ప్రస్తుతం నేవీలో ఎన్ని కలవరి శ్రేణి సబ్ మెరైన్ లు ఉన్నాయి..?
ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోంది.. భవిష్యత్ లో ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు అన్ని రకాల అర్హతలు కలిగిన భారత్ రక్షణ వ్యవస్థలైన త్రివిధ దళాల శక్తి రోజురోజుకు పెరుగుతూ పోతోంది. కలవరి శ్రేణికి చెందిన అయిదో జలాంతర్గామి ‘వగీర్’ భారత నౌకాదళంలో చేరింది. ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. గతేడాది డిసెంబర్ 20న భారత నౌకాదళానికి దాన్ని అప్పగించారు. ప్రస్తుతం నేవీలో నాలుగు కలవరి శ్రేణి సబ్‌మెరైన్‌లు ఉన్నాయి.
శత్రువుల కంట పడకుండా సంచరించగల ఆధునిక టెక్నాలజీ వగీర్‌లో ఉందని, ఇది సముద్రజలాల్లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. భారత నౌకాదళంలో 1973లో తొలిసారి ‘వగీర్’ను తీసుకొచ్చారు. మూడు దశాబ్దాల పాటు సేవలు అందించిన ఆ జలాంతర్గామిని 2001లో డీకమిషన్ చేశారు.ఆ తరువాత మరింత అధునాత ‘వగీర్’ కోసం 2020 నవంబరులో కొత్త ప్రాజెక్ట్ చేపట్టారు. అతి తక్కువ సమయంలో భారత్ లో నిర్మించిన తొలి జలాంతర్గామి ఇదేనని నేవి చెబుతోంది. ప్రాజెక్ట్-75 కింద కలవరి శ్రేణిలో ఆరో జలాంతర్గామి నిర్మాణం వేగంగా జరుగుతోంది.
దీన్ని ఫ్రెంచ్ కంపెనీ డిజైన్ చేసింది. భారత సముద్ర జలాల్లో భద్రతను మరింత పెంచడానికి వగీర్ తోడ్పడుతుందని నేవి అధికారులు వెల్లడించారు.. భారతదేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని చాటి చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని నేవి తెలిపింది.. సరిహద్దు సంబంధిత సమస్యలపై భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఉనికి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది ఆగస్టులో
చైనాకు చెందిన ‘యువాన్ వాంగ్ 5’ నౌకను హంబన్ టోట నౌకాశ్రయానికి శ్రీలంక అనుమతించింది.
దీనిపై భారత్ కూడా శ్రీలంక ప్రభుత్వానికి నిరసన తెలిపింది. అది గూఢచారి, నిఘా నౌక అని చెబుతున్నారు. హంబన్ తోట ఓడరేవును చైనా సాయంతో నిర్మించారు. అయితే రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో దానిని 99 సంవత్సరాలు చైనాకు తాకట్టు పెట్టారు. ఈ శ్రీలంక ప్రాంతం తమిళనాడుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున జాఫ్నాలో చైనా ఉనికిని భారతదేశానికి ముప్పుగా పరిగణిస్తున్నారు.. వగీర్ అత్యుత్తమ సెన్సార్‌లు కలిగి ఉందని అధికారులు వెల్లడించారు.. వైర్ – గైడెడ్ టార్పెడోలు, పెద్ద శత్రు నౌకాదళాన్ని తుదముట్టించడానికి ఉపరితల క్షిపణులు ఉన్నాయని తెలిపింది. దాని శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌లు స్టెల్త్ మిషన్ కోసం బ్యాటరీలను త్వరగా ఛార్జ్ చేయగలవని నేవీ తెలిపింది..
సరిహద్దు సంబంధిత సమస్యలపై భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ఉనికి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది ఆగస్టులో చైనాకు చెందిన ‘యువాన్ వాంగ్ 5’ నౌకను హంబన్ టోట నౌకాశ్రయానికి శ్రీలంక అనుమతించింది. దీనిపై భారత్ కూడా శ్రీలంక ప్రభుత్వానికి నిరసన తెలిపింది. అది గూఢచారి, నిఘా నౌక అని చెబుతున్నారు. హంబన్ తోట ఓడరేవును చైనా సాయంతో నిర్మించారు.అయితే రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో దానిని 99 సంవత్సరాలు చైనాకు తాకట్టు పెట్టారు.
ఈ శ్రీలంక ప్రాంతం తమిళనాడుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున జాఫ్నాలో చైనా ఉనికిని భారతదేశానికి ముప్పుగా పరిగణిస్తున్నారు.. వగీర్ అత్యుత్తమ సెన్సార్‌లు కలిగి ఉందని అధికారులు వెల్లడించారు.. వైర్ – గైడెడ్ టార్పెడోలు, పెద్ద శత్రు నౌకాదళాన్ని తుదముట్టించడానికి ఉపరితల క్షిపణులు ఉన్నాయని తెలిపింది. దాని శక్తివంతమైన డీజిల్ ఇంజిన్‌లు స్టెల్త్ మిషన్ కోసం బ్యాటరీలను త్వరగా ఛార్జ్ చేయగలవని నేవీ తెలిపింది..
ఒకవైపు సరిహద్దుల్లో పొరుగు దేశాలతో భారత్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా… మరోవైపు సైనిక సామర్థ్యాలను మెరుగుపరిచే ప్రక్రియ కూడా వేగవంతమైంది. గతేడాది డిసెంబర్ 18న విధ్వంసక యుద్ధనౌక పీ15బీ క్షిపణి భారత నావికాదళంలోకి ప్రవేశించింది. ”మజగావ్ డాక్ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌక రక్షణ పరికరాల తయారీలో దేశానికి ఉన్న సామర్థ్యానికి గొప్ప ఉదాహరణగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.
రానున్న కాలంలో భారత దేశ అవసరాలు తీర్చుకోవడమే కాకుండా ప్రపంచ అవసరాల కోసం యుద్ధనౌకలను నిర్మిస్తామనడంలో సందేహం లేదు. హిందూ మహాసముద్రంతో నేరుగా ముడిపడి ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన దేశం కాబట్టి, దాని భద్రతలో మన నౌకాదళం పాత్ర మరింత ముఖ్యమైనది.. గతేడాది సెప్టెంబర్ లో భారత్ తన అతిపెద్ద యుద్ధనౌక విక్రాంత్ ను నౌకాదళంలో చేర్చుకుంది.
ఆ సమయంలో వైస్ అడ్మిరల్ గా పనిచేశారు ఎ.కె. చావ్లా.. 80వ దశకంలో ఆర్థిక సరళీకరణ తర్వాత చైనా తన నౌకాదళ శక్తిని పెంచుకోకుండా ప్రపంచ శక్తిగా ఎదగలేనని గ్రహించింది. నేడు వాళ్లది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళం. కొత్త విమానాలను చాలా వేగంగా తయారు చేస్తున్నారు… గత కొన్నేళ్లుగా భారత్, చైనాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇరు దేశాల సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో వివాదం కొనసాగుతోంది.
డిసెంబరు 9న భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ వద్దగల తవాంగ్ సెక్టార్‌లో చైనా, భారత సైనికుల మధ్య హింసాత్మకఘర్షణలుజరిగాయి. ఇందులో ఇరు వైపులా సైనికులు గాయపడ్డారు. అంతకుముందు జూన్ 2020లో గాల్వాన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల మధ్య వచ్చే నెలలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాలలో భారతదేశం వైమానిక విన్యాసాలు
నిర్వహించనుంది.
ప్రస్తుతం ఇండియన్ నేవీలో 16 సబ్‌మెరైన్‌లు ఉన్నాయి. ఇందులో ఎక్కువ రష్యా, జర్మనీల నుండి కొనుగోలు చేసినవే.. ఇందులో ప్రధానమయినవి సింధుఘోష్ తరగతికి చెందినవి. వీటిలో మొత్తం 10 సబ్‌మెరైన్‌లు ఉన్నాయి. వీటి బరువు 3,000 టన్నులు ఉంటుంది.. ప్రతి సబ్‌మెరైన్‌లో 220 కి.మీ దూరంలోపు ఉన్న నౌకల పైన ప్రయోగించగలిగే మిస్సైళ్ళు ఉంటాయి. ఈ సబ్‌మెరైన్‌లు సముద్రంలో 300 మీటర్ల లోతువరకు వెళ్లగలగి, 18 నాట్ల వేగంతో 45 రోజుల పాటు సముద్ర ఉపరితలాన్ని చేరుకోకుండా ప్రయాణించగలవు.
1985 నుండి అణు సబ్‌మెరైన్‌లను నిర్మించడానికి కల్పాక్కం వద్ద ఉన్న అణు కేంద్రంతో కలసి నేవీ కృషి చేస్తున్నది. 2010 నాటికి 6,000 టన్నులు బరువు కలిగి, పూర్తి అణు సామర్థ్యం కలిగిన సబ్‌మెరైన్‌ను, 2010-2025 నాటికి ఇలాంటివి మరో నాలుగు నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి… భారత రక్షణ శాఖ తయారు చేసిన ఆయుధాలనే కాక విదేశాలతో, ముఖ్యంగా రష్యా, ఇజ్రాయిల్ మొదలయిన దేశాలతో సమ్యుక్తంగా నిర్మించిన ఎన్నో ఆయుధాలను
నేవీ వినియోగిస్తుంది.
ప్రస్తుతం నేవీ దగ్గర జలాంతర్గాముల నుండి ప్రయోగించగల సాగరిక, అగ్ని క్షిపణులు, ఉపరితలం నుండి భూభాగం పైకి ప్రయోగించగల పృథ్వి క్షిపణులు,
యుద్ధ నౌకలను ధ్వంసం చేయగల బ్రహ్మోస్, సీ ఈగిల్ క్షిపణులు ఐదు రకాల రాకెట్ లాంచర్లు ఉన్నాయి.. మిత్రదేశాలతో కలిసి భారత నౌకాదళం 2022 మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి 4 వరకు మిలాన్-2022 నిర్వహించింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన 26 యుద్ధనౌకలు, 21 యుద్ధ విమానాలు, ఒక సబ్‌మెరైన్ పాల్గొన్నాయి. సముద్రంలో కదులుతున్న నౌకపైకి హెలికాప్టర్ దిగడం, ఒక నౌకపై నుంచి మరొక నౌకపైకి వెళ్లడం, సబ్‌మెరైన్లను ఎదుర్కోవడం వంటి విన్యాసాలను ప్రదర్శించారు.