Homeఅంతర్జాతీయంజపాన్ తీరం లో వింతలు..మనకు హాని కలిగిస్తాయా..?

జపాన్ తీరం లో వింతలు..మనకు హాని కలిగిస్తాయా..?

సముద్ర తీర ప్రాంతాలకు అనేక వస్తువులు కొట్టుకుని వచ్చి.. స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాయి.. బీచ్ లో కనిపించే వింత వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? వారి వివరాలు కనుగొనేందుకు పరిశోధకులు, సముద్ర శాస్త్రవేత్తలు సముద్ర ప్రవాహాల మ్యాప్ లను వాడుతూ.. కనుగొంటున్నారు.

  • సముద్ర తీరాలకు ప్రవాహం ద్వారా చేరకునే ఆ వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..?
  • స్థానికులను భయాందోళనకు గురిచేసేలా ఉన్న వస్తువులను ఎవరైనా వ్యూహాత్మకంగానే పంపిస్తున్నారా..?
    లేక ప్రమాదాల కారణంగా ముక్కలైన వస్తువులే ఇలా తీరాలకు చేరుతున్నాయా..?
  • ఇంతకూ పరిశోధకులు ఏమంటున్నారు..?

మెటల్ బాల్స్ నుంచి పిల్లలు ఆడుకునే బొమ్మ ఫోన్లు, పెద్ద పెద్ద కంటైనర్ల వరకు అనేక వస్తువులు సముద్ర తీరాలకు కొట్టుకుని వస్తూ స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా జపాన్‌లో 1.5 మీటర్ల వెడల్పులో గుండ్రంగా ఉన్న ఒక బంతి లాంటి వస్తువు హమామత్సు నగరంలోని సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. జపానీయులకు అసలిదేమిటన్నది తెలియదు. దీన్ని కొంతకాలం భద్రపరిచి, తర్వాత డిస్పోస్ చేస్తామని హమామత్సు నగర అధికారులు చెప్పారు.

అసలు ఆ వస్తువు ఏంటి? అనే అంశంపై అధికారులు ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్‌ లో ఒక వింత వస్తువు ఉన్నట్లు ఈ వారం ప్రారంభంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది.అది గాడ్జిల్లా గుడ్డు అని కొందరు, పడవలు నీటిపై తేలియాడేలా చేసే ఒక నిర్మాణమనిమరికొందరు, అంతరిక్ష వస్తువు అయ్యుండొచ్చని ఇంకొందరు ఊహించుకున్నారు. అది మెటల్‌తో తయారైన వస్తువు. బాంబు నిపుణులు పరీక్షించి.. అది పేలుడు పదార్థం కాదని తేల్చారు. ఇది గూఢచర్య కోసం వాడే డివైజ్ కూడా కాదు. మరి ఆ వస్తువు ఏంటి? అనేది ఇంకా తెలియలేదు.

‘‘హమామత్సు నగరంలోని ప్రతీ ఒక్కరూ ఈ వింత వస్తువు గురించే చెప్పుకుంటున్నారు.. అయితే, అమెరికా భూభాగంపైకి ఇటీవల చైనా పెద్ద ఎత్తున గూఢచార బెలూన్లను పంపుతోందని వార్తలు వచ్చాయి. ఈ బెలూన్లపై చాలాచోట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సముద్ర తీరానికి ఇలాంటి గుర్తుతెలియని ఒక గుండ్రటి వస్తువు కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. 2019లో థేమ్స్ నది పరివాహన ప్రాంతంలో ఒక పెద్ద వస్తువును గుర్తించినట్టు లండన్పోలీసులు తెలిపారు.

పేలుడు వస్తువు కాని ఈ బబుల్‌ కు క్రిస్మస్ బబుల్ అని పోలీసులు పేరు పెట్టారు. సముద్ర తీర ప్రాంతాలకు ఇలాంటి అంతుచిక్కని వస్తువులు చాలానే కొట్టుకుని వస్తుంటాయి. ఇటీవల కాలంలో ప్రజలను ఆశ్చర్యపరిచేలా ఎన్నో గుర్తుతెలియని వస్తువులు కనిపిస్తున్నాయి.2022లో ఫ్లోరిడాలో 24 మీటర్ల పొడవైన చెక్క, ఇనుముతో చేసిన ఒక అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీన్నికూడా జనం రకరకాలుగా చెప్పుకున్నారు. ఇది షిప్‌లు ఆగేందుకు ఉపయోగించేదని కొందరంటే, ప్రమాదానికి గురైన ఓడలో ఒక పార్ట్ అని మరికొందరు ఊహించారు.

35 ఏళ్లుగా బ్రిట్టనీ తీర ప్రాంతంలో నివసించే వారికి బొమ్మ టెలిఫోన్‌లు కొట్టుకొస్తూ కనిపించాయి. ఇవి ఇలా ఎందుకు కొట్టుకొస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో చాలాకాలంగా అర్ధం కాలేదు. చివరకు, దీనికి కారణంగా ఈ మధ్యే సముద్రంలో దొరికిన కంటెయినర్ అని తేల్చారు. మునిగిపోయిన ఆ కంటెయినర్‌లో ఈ బొమ్మలు ఉండి ఉంటాయని, అవే ఇలా కొట్టుకొచ్చాయని వారు నిర్ధరణకు వచ్చారు.

  • 2018లో కాలిఫోర్నియాలో అతిపెద్ద బురుజులాంటి వస్తువును గుర్తించారు..

దశాబ్దం క్రితం జిపెటర్ అనే పేరు రాసి ఉన్న రబ్బర్ బ్లాక్‌లు యూరప్‌, యూకేలలోని బీచ్‌లలో కనిపించాయి. ఒకటి తర్వాత మరోకటి ఇలా చాలా రబ్బర్ మెటీరియల్ బ్లాక్‌లు వాకింగ్‌కు వెళ్లిన ప్రజలకు కనిపించాయి.. ఇవి ఇండోనేషియా నుంచి వచ్చి ఉండొచ్చని భావించారు. 2020లో కూడా స్కాట్లాండ్‌లో వీటిని కనుగొన్నారు. ఈ రబ్బర్ బ్లాక్‌లను 19వ శతాబ్దం, 20వ శతాబ్దం మధ్య వరకు వాడినట్టు భావిస్తున్నారు..2018లో కాలిఫోర్నియాలో అతిపెద్ద బురుజులాంటి వస్తువును గుర్తించారు. కొంతమంది దీన్ని అంతరిక్షం నుంచి పడిన వస్తువుగా భావించారు.

అయితే, స్థానిక అధికారులు దీన్ని మరింతగా పరిశీలించి… ఇది ఓడల దిక్సూచి అని తేల్చారు. ప్లాస్టిక్, రబ్బర్‌ తో తయారైన వస్తువులు సముద్రాల్లో దశాబ్దాల పాటు అలానే ఉంటాయని, వేలాది మైళ్లు ప్రయాణిస్తాయని ఇటీవల సముద్రానికి కొట్టుకొచ్చిన వస్తువులను పరిశీలిస్తే తెలుస్తోంది. 2020లో బ్రిటన్ దీవుల్లోని బీచ్‌లలో కనిపించిన వస్తువుల జాబితాను నేషనల్ ట్రస్ట్ విడుదల చేసింది. వీటిలో రష్యాకు చెందిన దోమలు, కీటకాలను చంపే స్ప్రే బాటిల్స్, సౌదీ అరేబియా నుంచి కొట్టుకొచ్చిన ఏరోసోల్ క్యాన్, 1976 నాటి క్రిస్ప్ ప్యాకెట్, 1980 పిక్‌నిక్‌ చెందిన వస్తువులు ఉన్నాయి.

ఇలా సముద్రంలో కొట్టుకొచ్చిన వస్తువులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాన్ని పరిశోధకులు, సముద్ర ప్రవాహాల మ్యాప్‌లను వాడుతూ కనుగొంటున్నారు.1980 నుంచి సముద్ర శాస్త్రవేత్తలు, నీళ్ల మీద తేలియాడుతూ, కొట్టుకొచ్చే వస్తువులను గుర్తించే పరికరాన్ని తయారు చేశారు.నీటిలోకి పంపిన తర్వాత, ప్రతి కొన్ని గంటలకి ఆ పరికరాలు తాము ఏ స్థానంలో ఉన్నాయనే మెసేజ్‌ను సముద్ర శాస్త్రవేత్తలకు చేరవేస్తుంటాయి. ఇవి పంపిన డేటాను వాడుతూ దశాబ్దాల క్రితమే సముద్ర శాస్త్రవేత్తలు ఇంటరాక్టివ్ మ్యాప్‌ను ఏర్పాటు చేశారు.

ఈ మ్యాప్ ద్వారా ఎంత దూరం ఇవి ప్రయాణిస్తున్నాయని కనుగొంటున్నారు.సముద్రంలో ఒక పాయింట్ దగ్గర క్లిక్ చేస్తే, కొన్ని రోజులు, వారాలు, నెలల తర్వాత ఈ వస్తువు ఎంత దూరం ప్రయాణించి ఆగగలుగుతుందో ఈ మ్యాప్ చెబుతోంది. ఉదాహరణకు, జపాన్ తీరంలో ఒక వస్తువును సముద్రంలోకి వదిలితే, మూడేళ్ల తర్వాత అది కాలిఫోర్నియా తీర ప్రాంతాన్ని చేరుకుంటోంది. కొన్ని సార్లు, ఈ వస్తువులే సముద్ర ప్రవాహాలను మ్యాప్ చేసేందుకు శాస్త్రవేత్తలకు సాయంగా నిలుస్తున్నాయి.

దీని కోసం 29 వేల ప్లాస్టిక్ తాబేలు, కప్పలు, బాతులను 1992లో ఎవర్ లారెల్ షిప్‌ నుంచి పసిఫిక్ మహా సముద్రంలోకి విడిచిపెట్టారు.వీటిని సముద్రంలోకి విడిచిపెట్టి దశాబ్దం దాటిన తర్వాత కూడా వీటిని తీర ప్రాంతాల్లో కనుగొంటున్నారు. ఇవి ఎంత దూరం ప్రయాణించాయి, ఏయే ప్రదేశాలు ప్రయాణించాయి, ఎక్కడికి చేరుకున్నాయో ట్రాక్ చేసేందుకు పరిశోధకులకు ఇవి సాయపడ్డాయి.

  • వస్తువుల గురించి పరిశోధకులు, సముద్ర శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి మిస్టరీని ఛేదిస్తున్నారు..

జపాన్‌లో ఈ వారంలో అతిపెద్ద గోళాకారంలో ఉన్న ఒక వస్తువును కనుగొన్నారు. దీన్ని కూడా పరిశోధకులు సముద్ర ప్రవాహాలను మ్యాప్ చేసేందుకు ఉపయోగించబోతున్నారు. ఇలాంటి పరిశోధక పరికరాలు సముద్రంలో పడేస్తోన్న ప్రింటర్ ఇంక్ క్యాట్రిడ్జ్‌లు, సిరంజీలు, గోల్ఫ్ బాల్స్, బిజినెస్ కార్డులు, డ్రింక్ బాటిళ్ల వరకు మ్యాప్చేసేందుకు ఉపయోగపడుతున్నాయి.. సముద్ర ప్రవాహాలను ట్రాక్ చేసేందుకు సిగరెట్ లైటర్లను కూడా వాడుతున్నట్లు భావిస్తున్నారు.. ‘‘వాడిపడేసే లైటర్లు కూడా సముద్రపు చెత్తలో ఒకటి. వీటిపై ఏ దేశంలో లేదా ఏ నగరంలో దీన్ని వాడారో సమాచారం ప్రచురితమై ఉంటుంది..

లైటర్ ఎక్కువ కాలం పాటు సముద్రంపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటుంది. లైటర్లు ముదురు రంగులో ఉండి, చిన్న పరిణామంలో ఉండటం వల్ల వీటిని తేలిగ్గా గుర్తించి, కనుగొని, బీచ్‌లో సేకరించవచ్చు.ఏడేళ్లుగా జపాన్ నుంచి అమెరికా వరకు ఉత్తర పసిఫిక్ ప్రాంతాల్లో తీరాల నుంచి 79,948 లైటర్లను సేకరించి పరిశోధించినట్టు ఒక అధ్యయనంలో తేలింది..ఆసియా, అమెరికాలో ఈసముద్రపు చెత్త ఎటువైపు కొట్టుకుని పోతుందో… ట్రాక్ చేసేందుకు, మ్యాప్ చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయన్నారు.

బీచ్‌లలోకి కొట్టుకుని వస్తున్న చెత్త, కాలుష్యపు ప్లాస్టిక్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుందో మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దేశాలకు సాయపడుతుంది. సముద్రాలపై పయనిస్తోన్న ఈ చెత్త ప్రపంచంలో కొత్త ప్రాంతాలను కనుగొనేందుకు కూడా సాయంగా నిలుస్తున్నాయి. 2011లో జపాన్‌ను సునామీ ముంచెత్తింది. అప్పుడు ఐదు మిలియన్ టన్నుల చెత్త సముద్రంలోకి కొట్టుకుపోయింది. పశ్చిమ అమెరికా, కెనడా తీరాలకు కొట్టుకు రావడానికి ముందు, కొన్ని వస్తువులు నార్త్ పసిఫిక్‌లో ఏడాదికి పైగా నీళ్లపైనే తేలియాడాయి.

పరిశోధకులు జపాన్ తీర ప్రాంతంలోకి కొట్టుకొచ్చిన వస్తువుల్లో 289 జీవులను గుర్తించి, వాటిని అనాలసిస్ చేశారు. వీటిల్లో ఉత్తర పసిఫిక్ సముద్రపు స్టార్‌ఫిష్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి తీర ప్రాంతాలకు కొట్టుకుని రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక జీవవైవిధ్యం అంతరించుకుపోతుందని భయాందోళనలున్నాయి.. జపాన్‌ తీర ప్రాంతంలోకి కొట్టుకుని వచ్చిన అంతుచిక్కని ఈ వస్తువు ఏమిటన్నది ఇంకా మిస్టరీగానే ఉంది.

ఎన్నో రకాల వస్తువులు సముద్ర తీరాలకు కొట్టుకుని రావడం చూస్తుంటాం.. అందులో కొన్ని స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటుండగా.. మరికొన్ని భయాందోళనను కలిగిస్తున్నాయి.. ఈ వస్తువుల గురించి పరిశోధకులు, సముద్ర శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి మిస్టరీని ఛేదిస్తున్నారు..

Must Read

spot_img