ఎవరి పిచ్చి వారికానందం అని ఊరికే అనలేదు. అత్యాధునికులం అని భావించే యూరప్ దేశాలలోనూ వింత వింత సంప్రదాయాలు ఆచారాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా న్యూయార్క్ నగరంలో యవతీ యువకులు అడా మగా వ్యత్యాసం లేకుండా ప్యాంట్లు లేకుండానే తిరిగారు. మెట్రోరైళ్లలో ఇదే సందడి కనిపించింది. ఇలాంటి వింత ఈవెంట్ ఏడాదికోసారి జరుపుకుంటున్నారు..ఇది యూకేలోనూ కనిపించింది..
నో ప్యాంట్స్ డే..అన్న వింత రోజును అమెరికాలో జరుపుకున్నారు. న్యూయార్క్ నగర వీధుల్లో ప్యాంటు లేకుండా తిరుగుతూ యువతీయువకులు హల్ చల్ చేసారు. చూసినవాళ్లంతా ఇదేం ఈవెంట్రా బాబోయ్ అంటూ ఖంగు తిన్నారు. ప్రపంచంలో పలు రకాల సంస్కృతులు, వింత ఆచారాలు మనకు నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇలాంటి వింత ఘటనల్లో నో పాంట్స్ డే ద్రుశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పురుషులు, స్త్రీలు అనే బేధంలేకుండా ఆ ప్రాంతంలోని ప్రజలు ప్యాంటు వేసుకోకుండా వీధుల్లో సంచరిస్తూ కనిపించారు. బస్సు, మెట్రో, రోడ్లపై ఇలా ఎక్కడ చూసిన అధికశాతం మంది ప్యాంటు లేకుండానే కనిపించారు. ఆడవాళ్లు కూడా కేవలం పొడవాటి డ్రాయర్ మీదనే రోడ్లపై ఏంచక్కాతిరిగేసారు.
ఇలాంటి వింత ఈవెంట్ యూఎస్‌ఏలోని న్యూయార్క్ నగరంలో ప్రతీ ఏటా కనిపిస్తుంది. అయితే ప్రతీరోజూ కాదు. కేవలం గ్లోబల్ ఈవెంట్ రోజుమాత్రమే. దీనిని నో ట్రౌజర్స్ డే అంటారు. అంతేకాదు నో ప్యాంట్ డే అని కూడా పిలుస్తారు. లండన్‌లోని ప్రధాన వీధుల్లో నో ట్రౌజర్స్ డే పరేడ్‌లో పాల్గొంటారు. వీరంతా ప్యాంటు లేకుండా కేవలం నిక్కర్ లేదా డ్రాయర్ మీదమాత్రమే కనిపిస్తారు.
ఇందులో మహిళలుసైతం అధికశాతంమందే పాల్గొంటారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్‌ను ది స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ ఏర్పాటు చేస్తోంది. కేవలం నవ్వించేందుకు మాత్రమే ఈ ఈవెంట్ నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
దీనిని సరదాగా తీసుకోవాలి. ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు కాదని వారు కోరారు. గత ఏడాది ప్రారంభమైన ఎలిజబెత్ లైన్‌లో ఇరవై ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో ప్రారంభమైన వార్షిక ఈవెంట్‌కు వందలాది మంది ప్రజలు అండర్‌వేర్‌లతో మాత్రమే పాల్గొన్నారు. ప్యాంట్ లేకుండా బస్సులు, మెట్రోల్లో ప్రయాణించారు. నో ట్రౌజర్ డేలో యువతీ, యువకులతో పాటు పెద్దలు కూడా పాల్గొంటారు.
2022లో న్యూయార్క్‌లో నో ప్యాంట్స్ అనేది సబ్‌వే రైడ్‌లో ఓ భాగంగా ఉండేది. నిజానికి ఈ ఈవెంట్‌ను ఏడుగురు కుర్రాళ్లతో ఒక చిన్న జోక్‌గా ప్రారంభమైంది. వీరు యునివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లోని ఓ చిన్న క్యాంపస్ క్లబ్ ఈ ఈవెంట్ ను నిర్వహించింది. ప్రతీ సంవత్సరం మే నెల మొదటి శుక్రవారం సెమిస్టర్ పూర్తయిన సందర్భంగా చేస్తారు.
ప్యాంటు విసర్జించడం అన్న సరదా కార్యక్రమాన్ని నిజానికి 2000 సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. అది అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు, పక్కనే ఉన్న కెనడాలోని పలు ప్రాంతాలు, దాంతో పాటే ఫ్రాన్స్ , స్వీడెన్, ఆస్ట్రేలియా, ఫిన్ లాండ్, బ్రిటన్ దేశాలకూ పాకింది. ఈ కార్యక్రమానికి బాగా ప్రచారం లభిస్తూండటంతో..ఈవెంట్ కాస్తా వైల్డ్ ఫైర్ లా విస్తరించింది.
ఆ తరువాత ఇంటర్నెట్, సోషల్ మీడియా అభివ్రుద్ది చెందడంతో ప్రపంచంలోని చాలా దేశాలకు పాకింది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని డజన్ల కొద్దీ నగరాల్లో యువత ఈ ఈవెంట్‌లో పాల్గొంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఇది కాస్త, సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతూండటంతో ప్రపంచంలోని చాలా నగరాలకు వ్యాపిస్తోంది. చివరకు అంతర్జాతీయ ఈవెంట్‌గా విస్తరించిందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 60కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఈ ఈ వెంట్ ను నిర్వహిస్తున్నారు.