- బీసీసీఐకి .. స్టార్ స్పోర్ట్స్ ఝలక్ ఇచ్చిందా..?
- ఇండియా, శ్రీలంక సిరీస్ వేళ .. రూ.200 కోట్ల నష్టాన్ని స్టార్ స్పోర్ట్స్ మూటగట్టుకుందా..?
- దీనికి కారణమేంటి..?
మ్యాచ్ రైట్స్ పొందిన స్టార్ స్పోర్ట్స్ .. ఇప్పుడు బీసీసీఐ పై ఫైర్ అవుతోంది. రీసెంట్ గా సాగిన సిరీస్.. తమకు నష్టాన్ని తెచ్చిందని, అందుకే డీల్ లో డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి స్టార్ స్పోర్ట్స్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్,శ్రీలంక మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లతో స్టార్ స్పోర్ట్స్‌కు కోట్లలో నష్టం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లకు సంబంధించిన యాడ్ ఇన్వెంటరీ అమ్ముడవ్వలేదని, అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం కేవలం మూడు, నాలుగు బ్రాండ్స్ మాత్రమే వచ్చాయని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ ఓ కథనం ప్రచురించింది.
స్టార్ స్పోర్ట్స్ అధికారే భారత్-శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా రూ.200 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారని సమాచారం. స్టార్ నెట్‌వర్క్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌కు అయితే ఒక్క యాడ్ కూడా రాలేదట. దాంతో స్టార్ స్పోర్ట్స్..తమ పూర్తి డీల్‌లో రూ.130 కోట్లు డిస్కౌంట్ అడిగిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు జెర్సీ స్పాన్సర్, ఎడ్యుకేషనల్ టెకీ సంస్థ బైజూస్ కూడా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని బీసీసీఐకి సమాచారమిచ్చింది.

దాంతో హుటాహుటిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటి అయ్యింది. ఈ రెండు సమస్యలపై చర్చించింది. అయితే మార్చి 2023 వరకు కొనసాగాలని బైజూస్‌ను బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది. ఒప్పో స్థానంలో దాదాపు రూ.300 కోట్లకు బైజూస్ టీమిండియా జెర్సీ స్పాన్సర్ తీసుకుంది.
నవంబర్ 2023 వరకు బైజూస్ కొనసాగాల్సి ఉంది. కానీ మార్కెట్‌లో నెలకొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 2500 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్.. ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే జెర్సీ స్పాన్సర్‌షిప్‌ను వదులుకోవాలనుకుంటుంది. ఇప్పటికే ఈ డీల్ బ్యాంక్ గ్యారంటీ కింద రూ.140 కోట్లు బీసీసీఐ చెల్లించిన బైజూస్.. మిగతా 160 కోట్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేస్తుంది.
బైజూస్, స్టార్ ఇండియాకు సంబంధించిన ఇష్యూలపై అపెక్స్ మీటింగ్‌లో చర్చించామని, అయితే తుది నిర్ణయం తీసుకోలేదుని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోట్లతో కూడిన వ్యవహరం కావడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తుది నిర్ణయానికి మరింత సమయం పట్టవచ్చు. ఇక 2018-23 ఐదేళ్ల కాలానికి సంబంధించిన భారత అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ మ్యాచ్‌ల రైట్స్‌కు స్టార్ స్పోర్ట్స్ రూ.6138.1 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే ఈ మొత్తం డీల్ నుంచి తమకు రూ.130 కోట్లు డిస్కౌంట్ ఇవ్వాలని స్టార్ నెట్‌వర్క్ బీసీసీఐకి రిక్వెస్ట్ చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా జరగాల్సిన కొన్ని మ్యాచ్‌లు కరోనా కారణంగా రిషెడ్యూల్ అయ్యాయని, తమకు నష్టాలు వచ్చాయని స్టార్ నెట్‌వర్క్ పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ డీల్ మార్చిలో ముగియనుండగా.. స్టార్ నెట్ వర్క్ బకాయి డబ్బులను బీసీసీఐకి చెల్లించలేదు.
తదుపరి ఐదేళ్ల సైకిల్ రైట్స్ అమ్మడంపై కూడా బీసీసీఐ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా రూ48390 కోట్లు ఆర్చించిన బీసీసీఐ.. దానికి మించిన డబ్బు రాబట్టాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో భాగంగా భారత జట్టు కొత్త ఏడాదిని ఉత్కంఠ బరితమైన విజయంతో ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే.
మొదటి టి20 మ్యాచ్లో నువ్వు నేను అన్నట్లుగా సాగిన పోరులో చివరికి రెండు పరుగుల తేడాతో టీమ్ ఇండియా జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. సీనియర్లు రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో యువ ఆటగాడు హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించింది టీమ్ ఇండియా యాజమాన్యం.
- సీనియర్లను తోకేస్తున్న జూనియర్లు..
అంతేకాదు ఇక టి20 సిరీస్ ఆడుతున్న జట్టులో ఎవరికి సీనియర్లకు చోటు ఇవ్వకుండా యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేసింది అని చెప్పాలి. అయితే ఇటీవల భారత జట్టు విజయం సాధించినప్పటికీ అటు భారత అభిమానులు మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని మ్యాచులను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా ఇండియా విజయం సాధించిన మొదటి టీ20 మ్యాచ్ కారణంగా అటు అధికారిక బ్రాడ్కాస్టర్ అయినా స్టార్ స్పోర్ట్స్ కి దాదాపు 200 కోట్ల నష్టం వాటిల్లిందట.
అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మా లాంటి స్టార్ క్రికెటర్లు లేకపోవడంతో ఇక అటు ఎంతో మంది అభిమానులు కూడా ఈ మ్యాచ్ కు లైట్ తీసుకున్నారట. అంతేకాదు ఇక మ్యాచ్ మధ్యలో అడ్వర్టైజింగ్ చేసేందుకు కంపెనీలు అన్నీ కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ సిరీస్ మొత్తానికి రెండు మూడు బ్రాండ్స్ మాత్రమే అడ్వర్టైజ్డ్ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయట.
భారీ ధరకు బ్రాడ్ కాస్ట్ హక్కులను దక్కించుకున్న స్టార్ నెట్వర్క్ ఒక్కొక్క మ్యాచ్ కి 60 కోట్లను బీసీసీఐకి చెల్లిస్తుంది. కానీ మొదటి టి20 మ్యాచ్ పట్ల బడా కంపెనీలు ఏవి ఆసక్తి కనబరచక పోవడంతో చివరికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో మొత్తం కలిపి 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట. ఇదిలా ఉంటే, ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అనగానే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ బీసీసీఐ.
ఓవైపు ఇంటర్నేషనల్ మ్యాచులు, మరోవైపు దేశవాళీ మ్యాచులు నిర్వహిస్తూనే.. ప్రతి ఏడాది ఐపీఎల్ ని సక్సెస్ ఫుల్ గా ఆర్గనైజ్ చేస్తూ వస్తోంది. వేల కోట్లు ఆర్జిస్తూనే ఉంది. అయితే గతంతో పోలిస్తే.. కరోనా తర్వాత మన లైఫ్ స్టైల్ మారినట్లే.. క్రికెట్ మ్యాచులు చూసేవారి తీరు చాలావరకు మారిపోయింది. ఇలాంటి టైంలో బీసీసీఐకి స్టార్ స్పోర్ట్స్ సంస్థ రిక్వెస్ట్ పెట్టుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంక జట్టు ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తవగా.. మంగళవారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్ లతో స్టార్ స్పోర్ట్స్ కు నష్టం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా 2018-23 కాలానికి గానూ దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచుల హక్కుల కోసం స్టార్ స్పోర్ట్స్.. రూ.6138.1 కోట్లకు ఒప్పందం చేసుకుంది.
కానీ కరోనా తర్వాత చాలా మ్యాచులు రీషెడ్యూల్ కావడం వల్లే నష్టాలొచ్చాయని స్టార్ సంస్థ పేర్కొంది. అందుకే మొత్తం నుంచి రూ.130 కోట్ల డిస్కౌంట్ అడుగుతోంది. టీమిండియా జెర్సీ స్ఫాన్సర్ అయిన బైజూస్‌తో ఒప్పందంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. ఎడ్యుటెక్ కంపెనీ కాంట్రాక్టును వదులుకోవాలనే ఆలోచనతో ఉంది. అయితే.. 2022 డిసెంబర్‌లో ఇరు వర్గాల మధ్య వర్చువల్ మీటింగ్ జరిగింది.
ఆ సమావేశంలో 2023 మార్చి వరకు ఒప్పందాన్ని కొనసాగించాలని బైజూస్‌ను బీసీసీఐ కోరింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అనే ఆసక్తి మొదలైంది. పోయిన ఏడాది జూన్‌లో బైజూస్ 2023 నవంబర్ వరకు స్పాన్సర్‌షిప్‌ను పొడిగించేందుకు బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది.
దాదాపు 35 మిలియన్ డాలర్లకు (రూ. 200 కోట్లకు) అగ్రిమెంట్ కుదిరింది. ఈ మీటింగ్‌లో స్టార్ మీడియా హక్కుల గురించి కూడా చర్చించనున్నారు. స్వదేశంలో భారత్ ఆడే అన్ని సిరీస్‌ల మీడియా హక్కులను స్టార్ మీడియా సొంతం చేసుకుంది. ఐసీసీ ఈవెంట్ హక్కులు కలిగిన స్టార్ స్పోర్ట్స్ కొన్నేళ్లుగా అన్ని ఈవెంట్లను లైవ్ టెలీకాస్ట్ చేస్తోంది. టీ20 ప్రసారాలు కూడా అదే బ్రాడ్‌కాస్ట్ చేస్తోంది. ఇప్పటికే అన్ని మ్యాచ్‌లకు సరిపడా స్పాన్సర్లను బుక్ చేసింది.
ప్రపంచంలోనే ధనిక సంస్థైన బీసీసీఐ .. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ డిమాండ్ పై ఏం చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది..