Homeసినిమాగాసిప్స్స్టార్ హీరోలు బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సినిమాపై గట్టి ఫోకస్..!

స్టార్ హీరోలు బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సినిమాపై గట్టి ఫోకస్..!

హిట్ కొట్టడం కాదు… ఆ తర్వాత దాన్నీ కంటిన్యూ చేయడం కత్తి మీద సామే. అందుకే స్టార్ హీరోలు బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చేసే సినిమాపై కాస్త గట్టినే ఫోకస్ చేస్తున్నారు. కథలో మార్పులు, షూటింగ్ స్పాట్, నటీనటులపై దర్శకుల కంటే… హీరోలే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు.

పాన్ ఇండియా హిట్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ తన టీమ్‌తో కలిసి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌లతో కలిసి ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్‌ని అందించటానికి సిద్ధమవుతున్నారు. ఈ గ్యాబ్ ఫారన్ టూర్ కి వెళ్లాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ తిరిగి రాగానే… జనవరిలో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో
ప్రారంభించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రెగ్యులర్ షూటింగ్ ని ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసి…ఆరు నెలల్లో సినిమాను ఫినీష్ చేయాలని అనే ఎన్టీఆర్ ప్లాన్.

సర్కారు వారి పాట తర్వాత ఘట్టమనేని కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా ssmb28. మహేష్, త్రివిక్రమ్ కలయికలో మూడో సినిమా రాబోతుందంటే అభిమానుల అంచనాలు వేరే లెవెల్‌లో ఉన్నాయి. కాబట్టే అన్ని వర్గాల ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇటీవలే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించినందున ఆ విషాదం నుంచి మహేష్ ప్రస్తుతం బయటపడుతున్నాడు. ఈ మేరకు ప్రాజెక్ట్‌లో వేగం పెంచాలని మూవీ టీమ్ యోచిస్తోంది. ఇదే క్రమంలో దుబాయ్‌లో తమన్, త్రివిక్రమ్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. వీరితో మహేష్ కూడా జాయిన్ అయ్యాడు. నెక్ట్స్ ఇయర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక రామ్ చరణ్ కూడా ఇదే రూట్ వెళ్తున్నాడు. శంకర్ సినిమాను అల్మోస్ట్ కంప్లీట్ చేసిన చెర్రీ..బుచ్చిబాబు సినిమా అనౌన్స్ చేశారు. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీని కొత్త నిర్మాతలు నిర్మిస్తుండగా ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారట. తొలి సినిమాతో వందకోట్ల వరకు వసూల్ చేసిన బుచ్చిబాబును నమ్మి మేకర్స్ ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. భారీ కాస్టింగ్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Must Read

spot_img