సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కంటే ఇటీవల కాలంలో ఫెయిల్యూర్ శాతం మరింత ఎక్కువవుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు కూడా కంటెంట్ బాగోలేకపోతే మాత్రం దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి. ఇక 2022లో అత్యధిక స్థాయిలో నష్టాలను కలిగించిన సినిమాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎక్కువగా భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలే బోల్తా కొట్టాయి.
2022లో సక్సెస్ రేటు కంటే… ఫెయిల్యూర్ రేటే ఎక్కువగా ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు భారిగా నిరాశ పరిచియాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలను క్రియేట్చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా 90 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన
పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు కొరటాల శివ చివరకు డిస్ట్రిబ్యూటర్లు అందరిని కూడా సముదాయించి కొన్ని నష్టాలను కూడా పూరించే ప్రయత్నం చేశారు.
ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా కూడా ఊహించని విధంగా దెబ్బకొట్టింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే విడుదల అయింది. ఇక సినిమా కంటెంట్ ఆడియన్స్ కు నచ్చకపోవడంతో మొదటి రోజే దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా మొత్తం గా అయితే 62 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో కూడా ఇదే అత్యంత దారుణమైన డిజాస్టర్
సినిమాగా నిలిచింది. 2022లో ప్రభాస్ అభిమానులకు అత్యంత నిరాశను కలిగించిన సినిమా రాదేశ్యామ్. ఈ సినిమా విడుదలకు ముందు టీజర్ ట్రైలర్తో ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ చేసింది. ఇక విడుదల తర్వాత లవ్ స్టోరీ కంటెంట్ ఏ మాత్రం కనెక్ట్ కాకపోవడంతో ఆడియన్స్ రెండవ రోజు నుంచి ఈ సినిమాను దూరం పెట్టారు. దీంతో ఈ సినిమాకు మొత్తంగా 120 కోట్ల వరకు నష్టాలు వచ్చాయి.
యువ హీరో రామ్ పోతినేని మొదటిసారి లింగుస్వామి దర్శకత్వంలో చేసిన బిగ్ మాస్ మూవీ ది వారియర్ మొదట డీసెంట్ టాక్ ను అందుకుంది. అయితే ఈ సినిమా పూర్తిస్థాయిలో మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్రాఫిట్స్అందుకోలేకపోయింది. మొత్తంగా ఈ ఏడాది అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. మొత్తంగా ది వారియర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 18 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.
ఈ ఏడాది అక్కినేని హీరోలకు ఏమాత్రం కలిసి రాలేదు.
ముందుగా అక్కినేని నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని అనుకున్నప్పటికీ ఈ సినిమా నెగిటివ్ టాక్ కందుకొని 17 కోట్ల వరకు నష్టలను మిగిల్చింది. ఇక ఆయన తనయుడు నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా కూడా డివైడ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఆ సినిమా కూడా దాదాపు 21 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.