Homeసినిమాగాసిప్స్శ్రీలీలా.. టాలీవుడ్‌లో ఇప్పుడు జోరుగా వినిపిస్తున్న పేరు.

శ్రీలీలా.. టాలీవుడ్‌లో ఇప్పుడు జోరుగా వినిపిస్తున్న పేరు.

శ్రీలీలా.. టాలీవుడ్‌లో ఇప్పుడు జోరుగా వినిపిస్తున్న పేరు. పెళ్లిసందడితో మెరిసిన ఈ సోయగం ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయిపోయింది. ధమాకా చిత్ర సక్సెస్‌తో మరింత జోరుపెంచింది. ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. టాలీవుడ్‌ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. అంతేకాదు, ఇతర స్టార్‌ హీరోయిన్ల ఆఫర్లని కొల్లకొడుతుంది.

శ్రీలీలా క్రేజ్‌కి అందరి చూపు ఈ బ్యూటీపైనే పడుతుంది. ఇదిప్పుడు తోటి హీరోయిన్లకి పెద్ద దెబ్బగా మారుతుంది. వారికి ప్రధానంగా పోటీగా మారబోతుందని అంటున్నారు. జనరల్‌గా తోటి హీరోయిన్లు పెరిగిపోతుంటే, తమ అవకాశాలను చేజిక్కుంచుకుంటుంటే వాళ్లలో జలసీ ఫీలింగ్‌ ఉంటుంది. స్టార్‌ ఇమేజ్‌ కలిగిన హీరోయిన్లు ఇప్పుడు అదే ఫీలింగ్‌లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే జోరు గతేడాది వరకు సాగింది. ఆమె సినిమా చేస్తే దానికి తిరుగేలేదు. సక్సెస్‌ గ్యారంటీ అనే టాక్‌ పడింది. దిల్‌రాజు లాంటి వాళ్లైతే ఏకంగా గోల్డెన్‌ లెగ్‌, లక్కీ హీరోయిన్‌ వంటి ట్యాగ్‌లు కూడా యాడ్‌ చేశారు. కానీ ఈ ఏడాది ఈ బ్యూటీకి కలిసి రాలేదు. వరుసగా పరాజయాలు చవిచూసింది. ఆచార్య,రాధేశ్యామ్‌,బీస్ట్,సర్కస్‌` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో తెలుగులోనూ ఈ బ్యూటీ క్రేజ్‌ పడిపోతుంది.

రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌ పేరుతెచ్చుకుంది. పాన్‌ ఇండియా హీరోయిన్‌ అయిపోయింది. పుష్పతో ఆమె క్రేజ్‌ ఇండియాకి పాకింది. కానీ ఈ ఏడాది ఆమె జోరు తగ్గింది. తెలుగులో చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా బోల్తా కొట్టింది. మరోవైపు హిందీలో చేసిన గుడ్‌ బై డిజాస్టర్‌ అయ్యింది. మరో సినిమా మిషన్‌ మజ్నుజనవరి 20న రిలీజ్‌ కాబోతుంది. దీనిపై పెద్దగా బజ్‌ లేదు. అలాగే విజయ్‌ తో నటించిన వారసుడు ఈ సంక్రాంతికి రాబోతుంది. అయితే రష్మికాకి సక్సెస్‌ లేకపోవడంతో గతేడాది ఉన్న జోరు, క్రేజ్‌ ఇప్పుడు కనిపించడం లేదు. గ్లామర్‌తో మెప్పిస్తుంది తప్ప…సినిమాల పరంగా ఆ స్థాయి జోరు కనిపించడం లేదు.

ఇవన్నీ ఇప్పుడు శ్రీలీలాకి ప్లస్‌గా మారుతున్నాయి. ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మిడిల్‌ రేంజ్‌ హీరోల నుంచి స్టార్‌ హీరోల సినిమాల వరకు ఆమెకి అవకాశాలు క్యూ కడుతుండటం విశేషం. తాజాగా ధమాకా చిత్రంతో ఆకట్టుకున్న శ్రీలీలా ఇప్పుడు మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమాలో, అలాగే బాలకృష్ణ-అనిల్‌ రావిపూడి చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు బోయపాటి-రామ్‌ చిత్రంలో, నవీన్‌ పొలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇవి కేవలం అధికారికంగా ప్రకటించినవి మాత్రమే, ఇవి కాక ఇంకా చర్చల దశలో మరో నాలుగైదు సినిమాలుంటాయని టాక్‌. ఇవన్నీ పూజా, రష్మిక, కృతి లాంటి హీరోయిన్లకి అవకాశాలను ఈ బ్యూటీ దక్కించుకుంటుందని చర్చ నడుస్తుంది.

Must Read

spot_img