Homeఅంతర్జాతీయంభారత దేశం నుంచి శ్రీలంకకు ఫెర్రీ సర్వీసులు ప్రారంభం!!!

భారత దేశం నుంచి శ్రీలంకకు ఫెర్రీ సర్వీసులు ప్రారంభం!!!

పుదుచ్చేరి నుంచి కాంకేసంతూరై వరకు ఆపరేట్ అయ్యేలా వచ్చే నెలలోనే ఇవి నడవనున్నాయి. ఇప్పటికే జనం పెద్ద ఎత్తున టిక్కెట్ బుక్కింగులు చేసుకుంటున్నారు. నిజానికి శ్రీలంక నుంచి భారత దక్షణాది ప్రాంతాలకు సంబంధాలు ఈనాటివి కావు. సక్రమంగానో అక్రమంగానే ఈ రెండు ప్రాంతాల మధ్య జనం వస్తూ పోతూనే ఉన్నారు. దాన్ని ఇప్పుడు చట్టబద్దం చేస్తున్నాయి భారత శ్రీలంక దేశాలు. అందులో భాగంగానే ఫెర్రీ బోటు సర్వీసులు లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు రెండు దేశాల పోర్టుల్లో షిప్పింగ్ అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీల మధ్య కస్టమ్స్, ఇమిగ్రేషన్ వంటి చట్టపరమైన భద్రతలకు సంబంధించిన వ్యవహారాలపై ఇరుదేశాల మంత్రుల మధ్య చర్చలు ముగిసాయి.

ప్రజలు సురక్షితంగా ప్రయాణం చేసేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొనబోతున్నారు. వచ్చే సంవత్సరం జనవరి రెండో వారం తరువాత ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయని శ్రీలంక మంత్రి నిమల్ సిరిపాల తెలిపారు. భారత్ నుంచి పెద్ద సంఖ్యలో జనం శ్రీలంకతో సంబంధాలు కలిగి ఉన్నారు. జాఫ్నా పెనిన్సులా నుంచి వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. ఈ సౌకర్యంతో రెండు దేశాలకు పెద్ద ఎత్తున విదేశీ మారకం లభించనున్నట్టు చెబుతున్నారు. అంతే కాకుండా శ్రీలంకకు చెందిన బుద్దిస్టు యాత్రికులు పెద్ద సంఖ్యలో భారత్ ను సందర్శించుకునే అవకాశం లభిస్తుంది.

ముందుగా ఈ సర్వీసును మొదలుపెట్టిన కొంత కాలం తరువాత అటు దక్షిణ భారతదేశం నుంచి మరికొన్న చోట్ల నుంచి శ్రీలంకలోని ట్రింకోమలీ, కొలంబోకు ఫెర్రీ సర్వీసులు మొదలవనున్నాయి. దీంతో విమానాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అయితే ఇందుకోసం రెండు దేశాల పోర్టులలో కొన్ని సర్వీసులు కలుగజేయాల్సి ఉంటుంది. అంటే రైల్వే స్టేషన్లను అభివ్రుద్ద పరిచినట్టే పోర్టుల్లో ప్యాసింజర్స్ ని చెక్ చేయడం, అవసరాలు తీర్చడం లాంటివి కలుగజేయాల్సి ఉంటుంది.

ఒక్కో షెర్రీలో ఒక్క ట్రిప్పులో 3 నుంచి 4 వందల మంది ప్రయాణీకులు ఒక్కసారిగా ప్రయాణించనున్నారు. రెండు దేశాల మధ్య ఈ ప్రయాణం మూడు నుంచి మూడున్నర గంటల పాటు సాగనుంది. ఇప్పటి వరకు ఫెర్రీ ఓనర్స్ అసోసియేషన్ తో జరిపిన చర్చల మేరకు ఒక్కో ప్రయాణికుడి నుంచి 60 డాలర్లు వసూలు చేస్తారు. అంటే మన కరెన్సీలో అయితే 5 వేలు, లంక కరెన్సీలో అయితే 21 వేల రూపాయలన్నమాట. వీరితో వంద కేజీల లగేజీని ఉచితంగా క్యారీ చేయవచ్చు. నిజానికి పొరుగుదేశం శ్రీలంక ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే అల్లాడుతోంది. అయితే సంక్షోభం నుంచి గట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తోంది.

ఆ దిశగా అనేక కలక సమస్యలు ఎదుర్కుంటోంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా సైన్యంలో అనవసరంగా ఉన్న 16వేల పోస్టులను తొలగించేందుకు నిర్ణయించింది. వ్యయాన్ని తగ్గించుకోవాలన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి ‘IMF’ షరతులను ఒక్కటొక్కటిగా అమలు చేస్తోంది. దేశ భద్రతపై ఉన్న ఆందోళనను పక్కనబెట్టి సైనికులను సైతం తొలగించుకుంటోంది. ఇందుకోసం తీవ్ర వ్యతిరేకతలు ఎదురవుతున్నా అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే ప్రభుత్వం సైన్యంపై ఉక్కుపాదం మోపింది.

సైనికులు స్వచ్ఛందంగా పదవీ విరమణ కోసం కృషి చేయాలని, తద్వారా రక్షణ వ్యయాన్ని తగ్గించవచ్చని ఆయన ఇటీవల ప్రతిపాదించారు.సైనికులు స్వచ్ఛంద పదవీ విరమణ పొందేందుకు వీలుగా సైన్యం నిబంధనల్లో పలు మార్పులు చేసింది. శ్రీలంక ఆర్మీలో సర్వీస్‌లో ఉన్నప్పుడు సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేయడం చట్టవిరుద్ధం. ఈ క్రమంలో అలాంటి గైర్హాజరీకి చట్టపరమైన గుర్తింపు ఇచ్చేందుకు సాధారణ క్షమాభిక్ష ప్రకటించారు. ఇందులో భాగంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోవాలనుకునే వారిని హాజరు కాని వారిని పరిగణించి సర్వీసు నుంచి విడుదల చేస్తారు.

సైన్యంలో గైర్హాజరైన సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ సాధారణ క్షమాభిక్ష ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఏ కారణంతోనైనా విధులకు గైర్హాజరైన సైనికులను సర్వీస్‌ నుంచి రిలీవ్‌ చేయనున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సైనిక సిబ్బందికి సైతం ఈ వెసులుబాటును కల్పించారు. క్షమాభిక్ష పథకం కోసం ఇప్పటివరకు 16వేల 141 మంది సైనికులు దరఖాస్తు చేసుకున్నారని ఆర్మీ అధికార ప్రతినిధి రవి హెరాత్ తెలిపారు. 21 మంది అధికారులు, 15వేల 838 మంది ఇతర ర్యాంక్ సిబ్బంది మెడికల్ అండ్ సెక్యూరిటీ క్లియరెన్స్‌తో రాజీనామాలను పంపారని చెబుతున్నారు. ప్రక్రుతి పరంగా కూడా శ్రీలంకలో ప్రతికూల పరిస్థితులే ఇంకా కొనసాగుతున్నాయి.

పర్యాటకం ఇంకా వేగం పుంజుకోవడం లేదు. వ్యవసాయం అంతంత మాత్రంగానే ఉంది. గత వారం తుఫాను సమయంలో వీచిన చలిగాలుల కారణంగా జంతువులు అస్వస్థతకు గురవగా.. వాటికి సరైన చికిత్స అందడం లేదని ఆరోపణలున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో జంతువులు ప్రాణాలు వదులుతున్నాయి. దేశంలో మందులు, ఇంధనం కొరత కారణంగా సరైన వైద్యం అందక జనం కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. సరైన వైద్యం అందక డిసెంబర్ 14 వరకు పెద్ద సంఖ్యలో జంతువులు మరణించాయి. ప్రస్తుతం 400కు పైగా జంతువులకు చికిత్స అందిస్తున్నారు.

పశువులకు కావలసిన మందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వాటి నిల్వలు సైతం తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జంతువుల యజమానులు కొందరు తాము సొంతంగా మందులు కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. మందులు లేకపోవడంతో చాలా జంతువులను రక్షించలేకపోయామని.. అందుబాటులో ఉన్న వాటితో కొన్నింటి ప్రాణాలను మాత్రం కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా శ్రీలంక అంతటా చల్లని గాలులు వీచాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.

గత కొన్న మాసాల క్రితం తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కున్న శ్రీలంక ఇటీవలే రాజకీయ సుస్థిరత నెలకొంది. అయినా దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నట్టు చెప్పుకోవాలి. దీంతో ఆర్థిక సంస్కరణలు చేపట్టాలనే వాదన మొదలైంది. అసలు దేశంలో ఆర్థిక వ్యవస్థే లేనప్పుడు సంస్కరణలతో ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే. అయితే నూతన ఆర్థిక వ్యవస్థను తయారుచేస్త

Must Read

spot_img