టాలీవుడ్ లో తన ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని ప్లాన్ చేసుకున్న శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అనుకున్నట్టుగానే ఒక క్రేజీ మూవీతో ఎంట్రీ ఇస్తుంది. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వి కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది.
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అని కొన్ని నెలలుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ ఆఫర్ రాక ముందే మిలి సినిమా ప్రమోషన్స్ కి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పింది జాన్వి. ఎలాగు పాప ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని మేకర్స్ కూడా జాన్వి కపూర్ నే ఎన్టీఆర్ సినిమాకు హీరోయిన్ గా ఫైనల్ చేశారు. స్టార్ తనయురాలిగా బాలీవుడ్ లో వరుస సినిమాలతో
దూసుకెళ్తున్న జాన్వి తెలుగులో ఎంట్రీకి సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది. అదీగాక ఎన్టీఆర్ సినిమా అనేసరికి ఇంకాస్త థ్రిల్ అవుతుంది.
ఎన్టిఆర్ తో కొరటాల శివ జనతా గ్యారేజ్ సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి ఈ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారు. తారక్ తో తెలుగు ఎంట్రీ ఇస్తున్న జాన్వి కచ్చితంగా ఇక్కడ కూడా అదరగొడుతుందని చెప్పొచ్చు. శ్రీదేవి కూడా తెలుగులో టాప్ హీరోలందరితో కలిసి నటించింది. ఇక్కడ స్టార్ స్టేటస్ అందుకున్నాక బాలీవుడ్ వైపు వెళ్లింది. అయితే జాన్వి కపూర్ మాత్రం ముందు హిందీ సినిమాల్లో నటించి ఆ తర్వాత తెలుగులో నటిస్తుంది. జాన్వికి ఈ ఆఫర్ లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.
అంతేకాదు ఈ సినిమాలో నటించడానికి అమ్మడు భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసిందట. యువ సుధ ఆర్ట్స్ ఎన్టిఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఎన్.టి.ఆర్ 30వ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.