ఓ వైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు.. ద్రవ్యోల్భణం పెరుగుదలతో శ్రీలంక అప్పులు చెల్లించలేక సతమతమవుతోంది.. ఇప్పుడు శ్రీలంక కనీసం స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు కూడా సిద్దంగా లేకపోవడంతో విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
శ్రీలంకను దరిద్ర్యం వెంటాడుతోంది.. ఆ దేశంలో వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి సిద్దంగా ఉంది.. ఇప్పుడు ఇదే ప్రభుత్వంపై విపక్షాల ఆగ్రహానికి కారణమైంది.. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ వాయిందా పడింది.. ఇంతకూ శ్రీలంకలో ఏం జరుగుతోంది..?
శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.. కొంతకాలంగా పెరిగిన ద్రవ్యోల్భణం, నిత్వావసర ధరలు, చమురు ధరల కారణంగా ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే అన్ని రంగాలలో దివాళా తీసిన శ్రీలంకలో.. వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి సిద్ధంగా ఉంది.. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో శ్రీలంక పార్లమెంటును వాయిదా వేయవలసి వచ్చింది.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంపై నెలల తరబడి నిరసనల తర్వాత జూలైలో పదవీ బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు మార్చి 9 నాటి ఓటింగ్ కీలకమైన పరీక్ష కానుంది. ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, ఇంధనం లేదా పోలింగ్ బూత్‌లకు పోలీసు రక్షణ కోసం నిధులు ఇవ్వడానికి ట్రెజరీ నిరాకరించినట్లు తెలిసింది.

శ్రీలంకలో వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను సకాలంలో నిర్వహిస్తామని ఎన్నికల కమీషన్ చీఫ్ నిమల్ పుంచి హెవా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు.. కానీ.. ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేయనందున ఎన్నికలను నిర్వహించలేమని కోర్టుకు తెలిపారు ఎన్నికల కమీషన్ చీఫ్.. శ్రీలంక మొత్తం ఆదాయం జీతాలు, పింఛన్లు, అవసరమైన సేవలను నిర్వహించడానికి సరిపోదు కాబట్టి ఎన్నికలు అసాధ్యమని అధ్యక్షుడు గతంలోనే వెల్లడించారు.. నిరసనకారులు అధ్యక్ష భవనంపై దాడి చేయడంతో గొటబాయ రాజపక్సే స్థానంలో వచ్చిన విక్రమసింఘే, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి బెయిలౌట్ పొందే ప్రయత్నంలో పన్నుల పెంపుదల, ధరల పెరుగుదలను అమలు చేశారు… ఓటరు పరిశీలనను నివారించి అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేయడంతో పార్లమెంట్ మంగళవారం వాయిదా పడింది.
ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు, ఎన్నికలను విధ్వంసం చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఉపయోగిస్తోందని ప్రతిపక్ష ఎంపీ విమల్ వీరవన్స ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో శ్రీలంక అత్యున్నత న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది, అయితే ఎన్నికలు ముందుకు సాగాలని న్యాయమూర్తి ఆదేశించినప్పటికీ… కొనసాగించడానికి ప్రభుత్వం వద్ద నగదు ఉందా అనేది అస్పష్టంగా ఉంది. ఎన్నికలను నిర్వహించడానికి దాదాపు 10 బిలియన్ రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. దాదాపు 22 మిలియన్ల మంది ప్రజలకు నివాసంగా ఉన్న శ్రీలంక, అధిక ద్రవ్యోల్బణంతో పాటు నిత్యావసరాల కొరతను ఒక సంవత్సరానికి పైగా చవిచూసింది. దేశం అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాత అయిన చైనా ఇప్పటివరకు రుణ చెల్లింపులపై రెండేళ్ల తాత్కాలిక నిషేధాన్ని మాత్రమే అందించిందని శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి బందుల గుణవర్దన తెలిపారు.
శ్రీలంకలో స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి 9న జరగవలసి ఉంది. అయితే.. ఆర్థికంగా దివాళ తీసిన శ్రీలంక ఈ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటోంది.. ఈ ఎన్నికలు జరిగితే దేశాధ్యక్షుడు రణిల్వి క్రమసింఘే కు ప్రజల మద్దతు ఏ మేరకు ఉందో తెలిసే అవకాశం ఉంటుంది. అయితే బ్యాలట్ పేపర్ల ముద్రణకు, పోలింగ్ బూత్‌ల వద్ద భద్రత కల్పించేందుకు తగినన్ని నిధులు లేకపోవడంతో ఈ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటోంది. ఈ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటున్నట్లు తెలియడంతో ప్రతిపక్షాలు మంగళవారం పార్లమెంటులో నిరసన వ్యక్తం చేశాయి. దీంతో పార్లమెంటు వాయిదా పడింది. ఈ ఎన్నికలు దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు గీటురాయి వంటివని విశ్లేషకులు చెప్తున్నారు. విక్రమసింఘే గత ఏడాది జూలైలో దేశాధ్యక్ష పదవిని చేపట్టారు..

శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక మాంద్యం నెలకొంది. మాంద్యం కారణంగా దేశంలో నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. 1990 సంక్షోభాన్ని మించి శ్రీలంకలో ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. కనీస అవసరాలు పొందేందుకు కూడా ప్రజలకు అవకాశం లేకుండా పోయింది. పాలు, చికెన్, కూరగాయలు, ఆయిల్ వంటి నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో ఆహార పదార్థాలను కొనలేని ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీలంక పరిస్థితి అర్ధం చేసుకున్న భారత ప్రభుత్వం ఇప్పటికే $1 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ను అందించింది.
అయినా తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడపుడే బయటపడే పరిస్థితిలో లేదు. దేశంలో ద్రవ్యోల్భణం ఊహించని స్థాయిలో పెరిగిపోగా.. ఆ భారం ప్రజలపై పడింది. చైనా నుంచి శ్రీలంక తెచ్చుకున్న ఆర్ధిక సహాయాలే ఈ దుస్థితికి కారణమని ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు.
రోడ్లు, పోర్టులు, పవర్ ప్రాజెక్టులు ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చైనా.. శ్రీలంకకు భారీగా అప్పులు ఇచ్చింది. అయితే చైనా ఇస్తున్న రుణాలను శ్రీలంక ప్రభుత్వం నియంత్రణ లేకుండా ఖర్చు చేసింది. చివరకు రుణాల తిరిగి చెల్లించే కాలవ్యవధి దాటిపోయినా ఆ రుణాలను చెల్లించలేని పరిస్థితిలో శ్రీలంక చేతులెత్తేసింది. 2021 ఆగష్టు నుంచే శ్రీలంకలో ఆర్ధిక వ్యవస్థ పతనమవడం ప్రారంభించింది. అయితే ప్రస్తుతం శ్రీలంకలో ఆర్ధిక వ్యవస్థ పడిపోవడంపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, ఇతర మౌళికసదుపాయాల దిగుమతులపై అధికంగా ఆధారపడ్డ
శ్రీలంక.. ఆయా చెల్లింపుల నిమిత్తం విదేశీమారక రేటుపై సరళమైన నిర్ణయంతీసుకోవడంతో దేశంలో ధరలు పెరిగిపోయాయని ఆర్ధిక నిపుణులు విశ్లేషించారు. మరోవైపు.. దేశంలో నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోవడంపై ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్త మౌతుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో శ్రీలంక ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికి రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు.. ఇప్పటికీ శ్రీలంకలో పరిస్థితి ఏ మాత్రం మారలేదు.. దీంతో కనీసం స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేదని చెబుతుండటంతో విపక్షాలు ఆందోళనకు దిగడంతో.. పార్లమెంట్ వాయిదా పడింది..
శ్రీలంకలో వచ్చే నెలలో జరగాల్సిన స్థానిక ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ ప్రయత్నించినప్పటికీ.. అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఎన్నికల కమీషన్ వెనక్కి తగ్గింది.. అయితే.. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా లేకపోవడం విపక్షాల ఆగ్రహానికి కారణమైంది..