మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం ఈయన సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రతీ భాషలో మార్కెట్ పెంచుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పృథ్వీరాజ్ తాజాగా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.
మళయాళంలో తన సినిమాలతో వరుస సూపర్ హిట్లు కొడుతున్న స్టార్ ఎవరు అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు వినిపిస్తుంది. ఆయన చేస్తున్న సినిమాలు మళయాళంలో హిట్ అవడమే కాకుండా వాటి రీమేక్ చేసి కూడా హిట్ కొడుతున్నారు. తెలుగులో వచ్చిన భీమ్లా నాయక్ గాడ్ ఫాదర్ సినిమాలు మళయాళంలో పృధ్వి రాజ్ తీసిన సినిమాలే.
మళయాళంలో అదరగొడుతున్న పృధ్వి రాజ్ ఇప్పటికే సలార్ విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో భారీ సినిమాలో కూడా పృధ్వి రాజ్ విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ పృధ్వి రాజ్ విలన్ గా చేస్తున్న ఆ సినిమా ఏది అంటే బడే మియా చోటే మియా.
అలి అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ నటిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశారు. బాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని సినిమాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. వాటిలో ఈ బడే మియా చోటే మియా ఒకటని చెప్పొచ్చు. ఈ సినిమాలో విలన్ గా పృధ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ గా ఎనౌన్స్ చేసి పృధ్వి రాజ్సు కుమార్ పోస్టర్ వదిలారు చిత్రయూనిట్. పృథ్వీరాజ్ చేస్తున్నాడు అనగానే ఆ ప్రాజెక్ట్ పై మరింత అంచనాలు పెరిగాయి.అంతేకాదు ఈ సినిమాకు సౌత్ మార్కెట్ కోసం కూడా మూవీలో పృథ్వీరాజ్ ని తీసుకున్నారని అనిపిస్తుంది. ఈమధ్య సౌత్ సినిమాలన్ని బాలీవుడ్ లో డైరెక్ట్ గా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా హిందీ సినిమాలని కూడా అన్ని సౌత్ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు అలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.
అందుకే ఇక మీదట సౌత్ మార్కెట్ పై కూడా బాలీవుడ్ మేకర్స్ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. సలార్ సినిమాతో పాటుగా బడే మియా చోటే మియా సినిమాలతో పృథ్వీరాజ్ బాలీవుడ్ లో తన సత్తా చాటనున్నారు. ఎలాంటి పాత్రలో అయింత తన మార్క్ చూపించే పృధ్వి రాజ్ ఈ రెండు సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోనున్నారు. పృధ్విరాజ్ విలన్ గా ఈ మూవీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పరచుకుంది.