ప్రజెంట్ బాలీవుడ్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుందది. అమీర్ ఖాన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తుండటంతో ఇక బాలీవుడ్ పని అయిపోయినట్టేనా? అనే కామెంట్ లు సర్వత్రా వినిపించాయి. అయితే అనూహ్యంగా పఠాన్ బాలీవుడ్ కు సరికొత్త ఊపిరి పోసింది. వివాదాల మధ్య విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసుళ్లు రాబట్టి రికార్డులు తిరగరాసింది. దీంతో నెక్ట్స్ సినిమాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు బాలీవుడ్ మేకర్స్.
కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. మధ్యలో ‘భూల్ భూలయా-2’, ‘దృష్యం-3’ వంటి సినిమాలు బాలీవుడ్‌కు నేనున్నా అంటూ పలకరించినా.. ఎక్కడో సౌత్ సినిమాల డామినేషన్ కనిపించింది. సౌత్ సినిమాల కలెక్షన్‌లు ముందు అవి నథింగ్‌లా అనిపించాయి. సీన్ కట్ చేస్తే.. పఠాన్ బాలీవుడ్ సత్తా ఏంటో చూపించింది.
షాహీద్ కపూర్, కార్తీక్ ఆర్యన్ ,రాజ్ కుమార్ రావు వంటి హీరోలు రీమేక్ లతో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయారు. కానీ అజయ్ దేవ్ గన్ మాత్రం ఈ విషయంలో ‘దృశ్యం 2’ రీమేక్ తో అనూహ్య విజయాన్ని దక్కించుకుని ట్రేడ్ వర్గాలని అబ్బుర పరిచాడు. ఇదే తరహాలో మరోసారి బాలీవుడ్ హీరోలు సౌత్ రీమేక్ లనే నమ్ముకున్నారు. మలయాళ ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఆధారంగా రూపొందిన ‘సెల్ఫీ’ మూవీతో అక్షయ్ కుమార్ ఇమ్రాన్ హష్మీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరితో పాటు అజయ్ దేవగన్ కూడా మరో సౌత్ రీమేక్ నే నమ్ముకున్నాడు. ‘ఖైదీ’ సినిమాను అజయ్ దేవ్ గన్ ‘భోళా’ పేరుతో రీమేక్ చేశాడు.
‘పఠాన్’ బ్లాక్ బస్టర్ తరువాత బాలీవుడ్ లో విడుదలవుతున్న సినిమాలు కావడంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఈ రెండు సినిమాలు ‘పఠాన్’ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ బాలీవుడ్ గాడిలో పడినట్టేననే సంకేతాల్ని అందిస్తారా? లేదా మళ్లీ పాట పాటే పాడతారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సౌత్ రీమేక్ లలో సక్సెస్ లు సాధిస్తున్న అజయ్ దేవగన్ ‘భోళా’ని మాత్రం మాతృకని మరిపించే స్థాయిలో మార్చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ఖైదీ’ రీమేక్ అనడం కంటే ప్రీక్వెల్ అని అనాలేమో అనేంతగా ఈ మూవీని అజయ్ దేవగన్ మార్చేశాడు.