Homeఅంతర్జాతీయంత్వరలో భూమిపైకి ఏలియన్స్.. !

త్వరలో భూమిపైకి ఏలియన్స్.. !

మానవాళి నిరంతరం తమలాంటి బుద్దిజీవుల కోసం ఇతర గ్రహాలపై అన్వేషణ జరుపుతూనే ఉంది. మరి అకస్మాత్తుగా వారితో కాంటాక్ట్ ఏర్పడితే ఎలా స్పందించాలి.. ఉన్నట్టుండి గ్రహాంతరవాసులు మన ముందుకు వచ్చిపడితే వారితో ఎలా మాట్లాడాలి..ఎలా వ్యవహరించాలి అన్న విషయంపై కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్త పురాణాలను పరిశీలిస్తే అందులో చాలా సందర్భాలలో విశ్వాంతరాల నుంచి బుద్దిజీవులు భూమిపై దండయాత్రలు చేసినట్టు ప్రస్తావనలు న్నాయి. వారు మన గ్రహంపై పెద్ద స్థాయిలో పేలుడు పదార్థాలు ప్రయోగించారని చెప్పడం జరిగింది. అయితే గత నాలుగు దశాబ్దాలుగా వచ్చిన హాలివుడ్ సినిమాలలో ఏలియన్స్, ఎక్స్ ట్రా టెరెస్ట్రియల్స్ గురించిన కథలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ పాత్రల రూపకల్పనలో ఇసాక్ అసిమొవ్, ఉర్సులా లే గ్విన్ లాంటి సైన్స్ ఫిక్షన్ రైటర్స్ ఈ ప్రశ్ననే ఎదుర్కున్నారు. ఒకవేళ సడన్ గా ఏలియన్స్ మన భూమిని విజిట్ చేస్తే మనం ఎలా స్పందిస్తాం..అన్నదానిపై వారి రచనలు ఈ సినిమాలను ప్రభావితం చేసాయి.

అప్పట్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలైన 2008లో వచ్చిన ఈటీ, స్టార్ ట్రెక్ ఎపిసోడ్స్, 2009లో వచ్చిన డిస్ట్రిక్ట్9, చాలా రకాలుగా న్యారేట్ చేసాయి. ఈ సినిమాలలో గ్రహాంతరవాసులను మనకన్నా తక్కువ శక్తి కలిగినవారిగానే చూసారు. వారిని సెకండ్ క్లాస్ సిటిజెన్స్ లాగే కనిపించారు. వారు మనుషులతో స్నేహం చేయడం అసాధ్యం అన్నట్టుగానే చిత్రీకరణ జరిగేది. డిస్ట్రిక్ట్ 9 చిత్రంలో అయితే వేలాదిగా భూమిపై దండయాత్రకు వచ్చిన ఏలియన్స్ దక్షిణాఫ్రికా స్లమ్స్ ఏరియాను ఆక్రమించుకుని మనుషులను బందీలుగా చేసుకోవడం దాడులు చేయడం చూపించారు. అయితే ఇవన్నీ కాల్పనిక విషయాలు మాత్రమే.. ఇప్పటి వరకైతే గ్రహాంతరవాసుల జీవనం గురించిన శాస్త్రీయ ఆధారాలైతే లేవు. వారి రాక కోసం మాత్రం అంతా ఎదురుచూస్తున్నది మాత్రం నిజం. సమీప భవిశ్యత్తులో వారిని కలవడం సాధ్యమైతే వారితో ఎలా వ్యవహరించాలి అన్నది ఇంకా తేలలేదు.

ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావుల అభిప్రాయం మేరకు గ్రహాంతరవాసుల అస్థిత్వం నిజమేనని భావించారు.

అయితే వారు మనకంటే ప్రాచీనమైనవారుగా ఉన్నా, ఇంకా జీవం రూపుదిద్దుకునే దశలోనూ ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం చేసారు. అయితే వారిని కలవడం లేదా వారు మనల్ని కలవడం అన్నది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక గ్రహానికి మరో గ్రహానికి ఉండే అపారమైన దూరం ఇందులో కీలకమైన పాత్ర పోశిస్తాయి. మీకు తెలుసా మనకు అత్యంత దగ్గరగా ఉండే నక్షత్రంగా చెప్పుకునే అల్ఫా సెంట్యారీ కి చేరాలంటే మనకున్న టెక్నాలజీ ప్రకారం..అంటే మన వద్ద ఉన్న రాకెట్ టెక్నాలజీ మేరకు ప్రయాణించాలంటే వేలాది సంవత్సరాలు పడుతుంది. మనిషి జీవితకాలం కేవలం వంద సంవత్సరాలలోపే అవడం వారిని కలవడం దాదాపు అసాధ్యం అనే చెబుతున్నారు. అయితే అవతలి బుద్ది జీవులు మనకు తెలియని అడ్వాన్స్ డ్ టెక్నాలజీలు ఉంటే మనల్ని కలిసేందుకు వస్తే రావచ్చు. ఆ వచ్చేవాళ్లు మనకు హాని కలిగిస్తారో లేక స్నేహ హస్తం అందిస్తారో మాత్రం ఆలోచనలకు అందడం లేదు.

అయితే స్టీఫెన్ హాకింగ్ మాత్రం అలా వారిని స్వాగతించడం, మన అడ్రసును వారికి తెలియజేయడం వల్ల ప్రమాదం ఉంటుందనే హెచ్చరించారు. అయితే గ్రహాంతరవాసులతో ఫస్ట్ మీటింగ్ అన్నది చాలా కీలకంగా మారింది. వారు వచ్చేదాకా వారి గురించి తెలిసే అవకాశమైతే లేదు. ఇప్పటికే చంద్రుడిపై తొలి పాదం మోపిన నేపథ్యంలో భూమిపై మనుషులు కూడా ఏలియన్స్ గానే వ్యవహరిస్తున్నారు. భవిశ్యత్తులో మనం మార్స్ గ్రహానికి వెళ్లగలిగితే అక్కడెవరైనా ఉంటే వారికి మనం ఏలియన్స్ రూపంలోనే అడుగుపెట్టడం జరుగుతుంది. అయితే మనం నివసించే భూమిపైన ఉండే దేశాల మధ్య ప్రజలే ఒకరిని మరొకరు డిఫరెంటుగా చూస్తారు. వారితో ఎలా ప్రవర్తిస్తారో ఊహించడం కష్టం..అండమాన్ లో ఇంతవరకు నాగరికత తెలియని సెంటినల్స్ ఇతర దేశాల వారిని దగ్గరకు కూడా రానీయకుండా చూస్తున్నారు. ఎవరైనా పొరబాటున ఆ ద్వీపానికి చేరితే బతికి బట్ట కట్టడం కష్టమే..అలాంటిది మరో గ్రహం నుంచి వచ్చే గ్రహాంతరవాసులు మనతో ఎలా ఉంటారో ఊహించడం చాలా కష్టం..

మరో విషయం కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటున్నారు నిపుణులు. అదేంటంటే..మనకు తెలియని రూపంలో వారు ఇదివరకే భూమిని విజిట్ చేసి ఉండొచ్చని ఊహిస్తున్నారు. తాజాగా ఏలియన్‌ కారణంగా ఓ మహిళ గర్భందాల్చినట్టు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌కు చెందిన డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఓ డాక్యుమెంట్‌లో తెలిపింది. ఓ వ్యక్తి వేసిన సమాచార హక్కు పిటిషన్‌ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ప్రఖ్యాత వార్తాసంస్థ ‘ది సన్‌’ వెల్లడించింది. అలాగే, ఏలియన్స్‌ను, వాళ్లు ప్రయాణించే ఎగిరే పళ్లాలను చూసిన వారిలో అనేక ఆరోగ్య పరమైన సమస్యలు వస్తూండటం కూడా తెలిపింది. జట్టు రాలడం, తలనొప్పి, జ్వరం, పీడకలలు, ముక్కులో నుంచి రక్తం కారడం, చర్మంపై కాలిన గాయాలు, గుండెదడ వంటివి కనిపిస్తున్నట్టు వెల్లడించింది. అయితే, ఈ కథనంపై అమెరికా అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.

వాళ్లు స్పందించరు..ఎప్పుడో గానీ మళ్లీ ఆ ప్రస్తావన బయటకు రాదు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అయితే ఏలియన్స్ గురించిన కథనాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆ థీమ్ తో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నడుస్తుంటాయి. అయితే గ్రహాంతరవాసులు మానవ స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నాయని, దాంతో ఒక మహిళ గర్భం దాల్చిందని పెంటగాన్ డాక్యుమెంట్ సంచలనం స్రుష్టించింది. గ్రహాంతరవాసులతో సంబంధంలోకి పోయిన మానవుల ఆరోగ్యంపై ప్రభావం గురించి శోధిస్తున్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. గ్రహాంతర వాసులు మానవులను అపహరించడం, మానవ స్త్రీలతో సంపర్కం పెట్టుకోవడం, లైంగిక దాడులకు దిగడం, వారితో దూర సంభాషణ అనుభవం, భౌతిక స్పర్శ లేకుండానే ఒక శరీరం మరో శరీరంతో కలిసిపోవడం వంటి అనుభవాల గురించి కూడా పెంటగాన్ డాక్యుమెంట్లు వెల్లడించాయని అమెరికా మీడియా చెబుతోంది.

ఇప్పటికీ మానవాళి నిత్యం మనం నివసించే భూమి లొకేషన్, ఇక్కడ నివసించే జీవజాలం, వాతావరణం గురించిన వివరాలను ఎంక్రిప్ట్ చేసి శబ్దతరంగాలు, ఎలక్ట్రో మాగ్నెటివ్ వేవ్ ల రూపంలో, కాంతి రూపంలో దిగాంతాలకు పంపిస్తూనే ఉన్నారు.

అలా చేయడం వలన ఏం జరుగుతుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందుకే గ్రహాంతరవాసుల్ని సంప్రదించడం గురించి స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అయినా, ఆ మాటలను పెడచెవిన పెట్టిన శాస్త్రవేత్తలు విశ్వంలో భూమి ఉన్న స్థానాన్ని తెలుపుతూ అంతరిక్షంలోకి సమాచారం పంపుతున్నారు. అంటే, మనుషులు ఎక్కడ ఉన్నారో తెలుపుతూ ఏలియన్స్‌కు సంకేతాలు పంపుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ‘బీకాన్ ఇన్ ది గెలాక్సీ’ అని పిలుస్తున్నారు. ఈ ప్రయత్నం 1974లో జరిగింది. ఏలియన్ల కోసం పంపిన అరెసిబో మెసేజ్‌ లో భూగ్రహం గురించిన వివరాలు ఉన్నాయి. అంటే మన పాలపుంతలో భూమి స్థానం ఎక్కడుందో, ఈ భూగ్రహంపై ఎలాంటి జీవులున్నాయో తెలియజేస్తూ మనుషుల ఆకారాలను కూడా పంపుతున్నారు. భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణానికి ముందు మాట్లాడుతూ.. ‘మీరు చరిత్రను పరిశీలిస్తే.. మానవులకి, తక్కువ మేధో జీవులకు మధ్య సంబంధాలు వారి దృక్కోణం నుంచి చూస్తే వినాశకరమైనవిగా ఉంటాయన్నారు. అలాగే, ఆధునిక, ఆదిమ టెక్నాలజీలతో నాగరికతల మధ్య సంప్రదింపులు అంత సులభం కాకపోవచ్చు.

దీంతో పెద్దగా లాభం ఉండకపోవచ్చని అన్నారు. గ్రహాంతరవాసుల కోసం గెలాక్సీలోకి మనం పంపించే మెసేజ్‌లో సౌరకుటుంబంలో భూమి ఉన్న ప్రదేశం మాత్రమే కాకుండా ఇందులో గ్రహం మ్యాప్, మానవుల రసాయన రూపం గురించి సమాచారం ఉంటుంది. ఓ నగ్న పురుషుడు, ఓ నగ్న స్త్రీల రూపాలు కూడా ఉన్నాయి. గ్లోబులార్ క్లస్టర్‌లకు సంబంధించి పాలపుంతలో సౌర వ్యవస్థ టైమ్ స్టాంప్డ్ స్థానం వంటి డిజిటైజ్ సమాచారం ఉంది. ఈ సందేశం చైనా, కాలిఫోర్నియాలోని రేడియో టెలిస్కోప్‌ల రేడియో తరంగాల నుండి పంపబడింది. పాలపుంతలోని గెలాక్సీ కేంద్రం నుండి 13,000 కాంతి సంవత్సరాల బిందువుకు ఈ సందేశాన్ని పంపింది. కానీ ఎంత కాంతి వేగంతో ఈ మెసెస్ ను పంపించినా అది దిగాంతాలకు అవతలకు చేరాలంటే వేలాది సంవత్సరాల సుదీర్థకాలం పడుతుంది. అందుకే మనం గ్రహంతరవాసులను కలుస్తామా అన్నది ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img