Homeతెలంగాణసీనియర్ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్…

సీనియర్ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్…

సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ .. వీఆర్ఎస్ తీసుకుంటున్నారట.. అయితే ఇందులో వింతేమీ లేదు గానీ … ఇప్పుడు ఆయన వీఆర్ఎస్ తర్వాత తెలంగాణలో ఓ కీలక పదవి చేపట్టనునన్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించిన సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాలని తెలంగాణ హైకోర్టు గత నెలలో ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీనియర్ ఐఏఎస్‌ అధికారి జనవరి 12న ఏపీ కేడర్‌లో రిపోర్ట్ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను కూడా కలిశారు. ఈ పరిణామాలు జరిగి సుమారు నెల రోజులు గడిచినప్పటికి ఏపీ ప్రభుత్వం సోమేశ్‌కుమార్ కు పోస్ట్ కేటాయించలేదు.

ఈనేపధ్యంలోనే ఆయన స్వచ్చందంగా పదవీ విరమణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోమేశ్‌కుమార్ వాలంట్రీ రిటైర్‌మెంట్ దరఖాస్తును కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఆమోదించినట్లుగా తెలుస్తోంది. గతంలో తెలంగాణ సీఎస్‌గా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నతమైన బాధ్యతలు చేపట్టిన సోమేశ్‌కుమార్ ఏపీ క్యాడర్‌కి చెందిన అధికారిగా ఇటీవలే తెలంగాణ హైకోర్టు తెలిపింది. అందుకే ఆయన్ని ఏపీకి వెళ్లాలంటూ ఆదేశించడంతో సోమేశ్‌కుమార్‌ని సీఎస్‌గా తొలగిస్తూ ఆయన స్థానంలో రత్నకుమారి అనే మహిళా ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కారు. ఏపీకి బదిలీ కాబడిన సోమేశ్‌కుమార్ జనవరి 12న ఏపీ క్యాడర్‌లో రిపోర్ట్ చేయడం జరిగింది.

ఆ తర్వాత సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం కావడంతో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ స్వచ్చందంగా పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఏపీ సీఎంకు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని ఆమోదించినట్లుగా కూడా తెలుస్తోంది. ముందు నుంచీ అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కోర్టు తీర్పు కారణంగా తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయి, గత నెల 12న అమరావతికి వెళ్లి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేశారు. అయితే అప్పుడే ఆయన స్వచ్చంద పదవీ విరమణ తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే జరిగింది.

వాస్తవానికి సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేస్తూ గత నెలలో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద విరమణకు మొగ్గు చూపుతారన్న ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు ఆయనకు తెలంగాణ సర్కార్ ఏదో ఒక పదవి ఇచ్చి అకామిడేట్ చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రితో సత్సంబంధాల కారణంగా ఆయనకు ఏదో ఒక సలహాదారు వంటి పదవి, తేదా బీఆర్ఎస్ లో చేరి క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

అయితే విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా దాదాపు మూడేళ్ల పాటు పనిచేసిన సీఎస్ సోమేశ్ కుమార్ కు తెలంగాణ సీఎం ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ సీఎస్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎక్సయిజ్, కమర్షియల్ టాక్సెస్ కార్యదర్శిగానూ కొనసాగారు. ఇప్పుడు కూడా ఆయనకు ఆ బాధ్యతలను కేసీఆర్ అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ శాఖల బాధ్యతలను సోమేశ్‌కు అప్పగిస్తారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ.. సోమేష్ కుమార్ తెలంగాణ బాధ్యతల నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయిన తరువాత కూడా ఇప్పటి వరకూ ఆ శాఖల బాధ్యతలను ఇప్పటివరకు వేరే ఎవరికీ అప్పగించకపోవడంతో సోమేష్ అనుభవం దృష్ట్యా ఆయననే చూసుకోమనే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎన్నికల సంవత్సరం కావడం, కేంద్రం నుంచి సహకారం కరవైన నేపథ్యం, కారణంగా సొంత ఆర్థిక వనరులపైనే రాష్ట్రం ఆధారపడాల్సి ఉంది. దీంతో సోమేష్
కుమార్ కు రాష్ట్రానికి వనరులు సమకూర్చే బాధ్యత అప్పగిస్తారని అంటున్నారు. కీలక బాధ్యతలు అప్పగించడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారనీ, అందుకోసమే ఇప్పటికే ప్రస్తుతం సెక్రటేరియెట్ గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ లోనే సోమేష్ కోసం ఛాంబర్ రెడీ అవుతోందని అధికారుల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన రాజీవ్‌శర్మను ముఖ్య సలహాదారుగా, ఎస్‌కే జోషిని సాగునీటిపారుదల శాఖ సలహాదారుగా కేసీఆర్ నియమించిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. దీంతో రాజుగారు తలచుకుంటే దెబ్బలకు కొదవా?’ అని సామెత.

అలాంటిది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలచుకుంటే, అయినవారిని అందలాల మీద కూర్చోబెట్టడంలో అడ్డం ఏం ఉంటుంది? చట్టపరమైన నిబంధనలు, నియమాలు ఇలాంటివి ఏవీ కొందరు పెద్దలకు ఏమాత్రం అడ్డు రావు. వారు తమకు తోచిన రీతిలోనే ఎప్పటికీ చెలరేగుతూ ఉంటారు. రాజకీయ నాయకుల ప్రాపకం సంపాదిస్తే చాలు కొందరికి ఎప్పటికీ పదవులపరంగా పరమ వైభవ స్థితి కొనసాగుతూనే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఉదంతమే ఓ పెద్ద నిదర్శనమని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి సోమేష్ కుమార్ .. కేసీఆర్ కు అత్యంత ప్రీతిపాత్రమైన ఐఏఎస్ అధికారుల్లో ఒకరు. తెలంగాణ ఉద్యమ సమయంలోను ఒక సీనియర్ అధికారిగా తాను చేయగలిగిన సాయం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదులో స్థిరపడిన సీమాంధ్రులను భయానికి గురి చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. సీమాంధ్రుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందనిపించే ప్రదేశాలలో అపార్ట్మెంట్లు ఇంటి నిర్మాణాల నిబంధనలను హఠాత్తుగా తెరపైకి తెచ్చి అడ్డగోలుగా కూల్చివేతలకు కూడా పాల్పడ్డారు.

జిహెచ్ఎంసి కమిషనర్ గా కోర్టు అక్షింతలు వేసే వరకు ఒక విధ్వంస కాండను నడిపించారు. ఆయన సేవలను మెచ్చి, ప్రభుత్వ ప్రధాని కార్యదర్శిగా అందలం మీద కూర్చోబెట్టారు కేసీఆర్. అయితే ఆయన ఉద్యోగ బాధ్యతలలోనే ఒక మతలబు రహస్యంగా ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను ఏపీ సర్వీసులకు కేటాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లడం ఇష్టం లేని సోమేష్ కుమార్ ట్రిబ్యునల్ లో కేసు నడుపుతూ తెలంగాణలోనే కొనసాగుతూ వచ్చారు.

ఇటీవలే ఆ కేసు తేలిపోయింది. సోమేశ్ కుమార్ ఏపీ సర్వీస్ కు వెళ్లి జాయిన్ కావలసిందే అని విస్పష్టమైన తీర్పు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనను తక్షణం రిలీజ్ చేసింది. మరునాడు ఏపీలో రిపోర్ట్ చేసిన ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ కు అక్కడి ప్రభుత్వం ఏ పోస్టును ఇన్నాళ్లుగా కేటాయించలేదు. ఒక రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత స్థాయిలో బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత, మరో రాష్ట్రంలో స్థాయి తక్కువ గల పదవులు నిర్వహించాలంటే ఎవరికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది.

ఆ పరిస్థితుల్లో సోమేశ్ కుమార్ తాజాగా స్వచ్ఛంద పదవి విరమణ కోసం ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ దరఖాస్తు ఆమోదించింది కూడా. అయితే విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ఏంటంటే సోమేశ్ కుమార్ ఏపీ సర్వీసుల నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనకు తెలంగాణ ప్రభుత్వం లో కీలకమైన పదవిని కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. క్యాబినెట్ హోదా ఉండేలాగా కీలకమైన ప్రభుత్వ సలహాదారు పదవిలో తెలంగాణలో సోమేశ్ కుమార్ ఇకపై సేవలు అందించే అవకాశం ఉంది.

ఎటు తనకు నమ్మకస్తుడు, రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాల రచన అమలులో పరిజ్ఞానం ఉన్నవాడు అయిన సోమేశ్ కుమార్ ను సలహాదారు పదవిలో Zకూర్చోబెడితే తనకు బాగా ఉపయోగపడగలరని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి సోమేశ్ కుమార్ ఈ ఏడాది డిసెంబర్ వరకు సర్వీస్
లో కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో మరో పోస్ట్ లో కొనసాగేందుకు ముందుగానే ఆయన విఆర్ఎస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 1989 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్ ను తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించే అవకాశం కనిపిస్తోంది.

Must Read

spot_img