అనా మోంటెస్ ను అమెరికా నిఘా సంస్థలు ‘‘ద క్వీన్ ఆఫ్ క్యూబా’’గా పిలుస్తుంటాయి. క్యూబాలోని సీక్రెట్ సర్వీస్ లోనూ ఆమె అలానే సుపరిచితురాలు.
అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లోని క్యూబా రాజకీయ, సైనిక అంశాలను విశ్లేషించే అనలిస్ట్‌గా పనిచేశారు.ఇంతకీ అనా మోంటెస్ ఎవరు…? అమెరికాపై అంతకాలం ఆమె ఎలా నిఘా పెట్టగలిగారు…? వారి నుంచి అనా ఎలా తప్పించుకునేవారు…? అనా కెరియర్ ఎలా సాగింది..?
అనా మోంటెస్ ను అమెరికా నిఘా సంస్థలు ‘‘ద క్వీన్ ఆఫ్ క్యూబా’’గా పిలుస్తుంటాయి. క్యూబాలోని సీక్రెట్ సర్వీస్ లోనూ ఆమె అలానే సుపరిచితురాలు.అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని క్యూబా రాజకీయ, సైనిక అంశాలను విశ్లేషించే అనలిస్ట్‌గా 1985 నుంచి 2001 మధ్య అనా పనిచేశారు.
తన కెరియర్ లో అనాకు ప్రమోషన్లతో పాటు పది ప్రత్యేక అవార్డులు కూడా వచ్చాయి. నేషనల్ఇంటెలిజెన్స్ సర్టిఫకేట్ ఆఫ్ డిస్టింక్షన్ ను కూడా ఆమె అందుకున్నారు. ఇది అమెరికా నిఘా విభాగంలో ఇచ్చే మూడో అత్యున్నత అవార్డు. 1997లో అప్పటి అమెరికా గూఢచర్య విభాగం సీఐఏ జార్జ్ టెనెట్
దీన్ని ఆమెకు ఇచ్చారు.
అయితే, ఆమె సేవలు డీఐఏలో కంటే క్యూబాలోని ఫిడెల్ క్యాస్ట్రో ప్రభుత్వానికి బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకోవాలి. అమెరికా సేకరించిన అత్యంత రహస్య సమాచారాన్ని అనామోంటెస్ క్యూబాకు చేరవేశారు.
‘‘మొదటిరోజు డీఐఏలోకి అడుగుపెట్టినప్పటికే అనా మోంటెస్ క్యూబన్ ఇంటిలిజెన్స్ సర్వీస్ ఏజెంట్. పని మొదలుపెట్టే ముందు, ఒక విషయాన్ని ఆమె రోజూ గుర్తుపెట్టుకునేవారు. అదేమిటంటే.. అమెరికా నుంచి తమకు రక్షణ కల్పించే సమాచారాన్ని క్యూబన్లు తెలుసుకోవాలి’’ అని అనాపై దర్యాప్తు చేపట్టిన ఇద్దరు ఎఫ్‌బీఐ ఏజెంట్లలో ఒకరైన పీటర్ ల్యాప్ వెల్లడించారు.
2001లో క్యూబాకు సమాచారం చేరవేస్తూ అనా పట్టుబడ్డారు. ఆ తర్వాత ఆమెకు అమెరికా కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా ఆమె జైలు నుంచి విడుదల అయ్యారు. ప్రధాన గూఢచారి ‘‘ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అరెస్టైన ప్రధాన గుఢచారుల్లో అనా మోంటెస్ కూడా ఒకరు. ఆమె వల్ల అమెరికాకు చాలా నష్టం జరిగింది’’ అని ల్యాప్ తెలిపారు.. అనా కేసులో చేపట్టిన దర్యాప్తు అనంతరం ‘‘ద క్వీన్ ఆఫ్ క్యూబా’’ పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు. ఈ ఏడాది అక్టోబరులో దాన్ని విడుదల చేయబోతున్నారు.20 ఏళ్లకు పైగా జైలులో గడిపిన తర్వాత జనవరి 7న అనా విడుదల అయ్యారు. ఇప్పుడు ఆమె వయసు 65 ఏళ్లు. జైలు నుంచి విడుదలైనా ఐదేళ్ల పాటు పోలీసుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.
అనా ఇంటర్నెట్ వినియోగాన్ని కూడా అధికారులు ఒక కంట కనిపెడుతుంటారు. ప్రభుత్వం కోసం పనిచేయకుండా ఆమెపై ఆంక్షలు విధించారు. విదేశీ ఏజెంట్లను కూడా అనుమతి లేకుండా కలవడానికి వీల్లేదు.
ప్యూర్టోరికో దంపతులకు జర్మనీలోని అమెరికా సైనిక స్థావరంలో 1957లో అనా జన్మించారు. అనా తండ్రి డాక్టరుగా పనిచేసేవారు. ఆ తర్వాత వీరి కుటుంబం కేన్సస్‌కు, అక్కడి నుంచి మేరీల్యాండ్ కు వచ్చింది. స్కూల్లో మంచి ప్రతిభావంతురాలైన విద్యార్థిగా అనాకు పేరుంది.
వర్జీనియా యూనివర్సిటీ నుంచి ‘‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’’లో ఆమె డిగ్రీ పట్టా పొందారు. చదువులో భాగంగా 1977లో ఆమె స్పెయిన్‌కు కూడా వెళ్లొచ్చారు. అక్కడే అర్జెంటీనా వామపక్ష విద్యార్థి ఒకరిని ఆమె కలిశారు. అర్జెంటీనాలో నిరంకుశ ప్రభుత్వాలకు అమెరికా ఇస్తున్న మద్దతు గురించి అతడి నుంచి ఆమె తెలుసుకున్నట్లు ఆమె స్నేహితురాలైన అనా కోలన్ 2013లో వాషింగ్టన్ పోస్టుకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘ఒక్కోచోటకు వెళ్లి వచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వం ఆయా దేశాల్లో చేపడుతున్న ‘అరాచక కార్యకలాపాల’ గురించి అనా చెప్పేది’’ అని కోలన్ గుర్తు చేసుకున్నారు.
డిగ్రీ పూర్తయిన తర్వాత అనా ప్యూర్టోరికోకు వెళ్లారు. అయితే, అక్కడ ఆమెకు ఉద్యోగం లభించలేదు. ఆ తర్వాత వాషింగ్టన్ డిసీ న్యాయ సేవల విభాగంలో వచ్చిన ఒక జాబ్ ఆఫర్‌ను ఆమె తీసుకున్నారు. అక్కడ పనిచేస్తూనే ఆమె జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో మాస్టర్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మాస్టర్ డిగ్రీ చదువుతున్నప్పుడే ఒక క్యూబా గూఢచారి ఆమెలో ప్రతిభను గుర్తించారు. క్యూబా కోసం పనిచేయాలని ఆమెకు సూచించారు.
‘‘ప్యూర్టోరికోకు చెందిన మార్టా రీటా వాలెంక్విజ్‌తో ఆమెకు పరిచయం పెరిగింది. నికరాగువా, ఎల్సా ల్వడోర్‌లలో అమెరికా చర్యల గురించి మార్టా ఎదుట అనా ఆగ్రహం వ్యక్తంచేసేవారు. వీరిద్దరూ అలా మంచి స్నేహితులయ్యారు. అప్పుడే వాషింగ్టన్ న్యాయసేవల విభాగంలో అనాకు తెలిసినవారు చాలా
మంది ఉన్నారని మార్టా తెలుసుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఐరాసలోని క్యూబా మిషన్ కోసం పనిచేస్తున్న ఒక దౌత్యవేత్తతో అనా కలిసేందుకు మార్టా ఏర్పాట్లు చేశారు’’ అని ల్యాప్ వివరించారు. అలా క్యూబా ఏజెంట్‌గా అనా మారిపోయారు.
మొదట్లో అసలు క్యూబాతో కలిసి పనిచేస్తానని తను ఊహించుకోలేదని అమెరికా అధికారుల ఎదుట అనా చెప్పారు.
‘‘ఆమెకు వారు ఎలాంటి డబ్బూ ఇచ్చేవారు కాదు. సైద్ధాంతిక కారణాలతో ఆమెవారి కోసం పనిచేశారు. ఒకవేళ క్యూబా తనకు డబ్బు ఇచ్చుంటే ఆమె నొచ్చుకునేవారేమో’’ అని ల్యాప్ వివరించారు.
తను పట్టుబడిన తర్వాత కూడా.. అమెరికా విధానాల నుంచి క్యూబన్లను రక్షించేందుకే తాను పనిచేసినట్లు ఆమె వెల్లడించారు.‘‘క్యూబా విషయంలో మన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అరాచకమైనవి. అందుకే వారికి సాయం చేయాలని నేను భావించాను. మన విలువలు, రాజకీయ ఉద్దేశాలు వారిపై రుద్దడం సరికాదని మొదట్నుంచీ నేను అనుకునేదాన్ని’’ అని అధికారుల ఎదుట అనా చెప్పారు.
క్యూబన్ల కు చాలా సాయం అవసరముందని క్యూబా ఏజెంట్లు ఆమెను నమ్మించగలిగారు..
‘‘ఆమె సైద్ధాంతిక భావజాలాన్ని ఆ ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏళ్లపాటు క్యూబా కోసం నిబద్ధతతో పనిచేసేలా ఆమెను మార్చేశారు,,
అయితే, ఇక్కడ వామపక్ష భావజాలంతో పాటు అమెరికాపై అనాలో గూడుకట్టుకున్న ద్వేషం కూడా ప్రధాన పాత్ర పోషించిందని ల్యాప్ భావిస్తున్నారు.
‘‘ఆమెలో చాలా అమెరికా వ్యతిరేక భావజాలముంది. నికరాగువా, ఎల్సా ల్వడోర్‌లలో అమెరికా ప్రభుత్వ చర్యల విషయంలో ఆమె చాలా అసంతృప్తితో ఉండేవారు. కేవలం వామపక్ష భావజాలం మాత్రమే దీనికి కారణం కాదు. ఆమెకు అమెరికాపై చాలా ద్వేషముంది. అదే సమయంలో క్యూబాపై విపరీతమైన ప్రేమ కూడా ఉంది..
1985 లో హవానాకు కూడా అనా వెళ్లారు. అయితే, సమాచార సేకరణకు అమెరికానే అక్కడకు ఆమెను పంపించేది. అక్కడ పనిచేస్తున్న అమెరికా అధికారులను ఆమె కలిశారు. ఆ తర్వాత క్యూబా బాసులతోనూ సమావేశమయ్యేవారు.
అప్పుడే డీఐఏ కోసం పనిచేసేలా ఆమెను క్యూబా ఏజెంట్లు ప్రోత్సహించారు. అలా ఆమె డీఐఏలోకి అడుగుపెట్టారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఆమె నివేదికలు సమర్పించేవారు.
అరెస్టుకు ముందుగా ఆమెను నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్‌లో సభ్యురాలిగా నియమించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. సీఐఏకు ఈ కౌన్సిల్ సలహాలు,సూచనలు ఇస్తుంది. అనా మంచి విశ్లేషకురాలు… దీంతో ఇటు వాషింగ్టన్‌లో, అటు హవానాలో రెండు చోట్ల ఆమె తన ప్రతిభను మెరుగ్గా ఉపయోగించేవారు..‘‘కేవలం తన డెస్కు ముందు గంటల పాటు కూర్చొని రోజు గడిపేసుంటే ‘క్వీన్ ఆఫ్ క్యూబా’గా ఆమె మారేవారు కాదు. ఆమె తన తెలివిని ఉపయోగించేకొద్దీ మరిన్ని అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చేవి. ఆమె అనలిస్టుగా మెరుగ్గా పనిచేయడంతో క్యూబా ఏజెంట్ల కోసం సమాచారం సేకరించడం మరింత సులువైంది..
తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ‘‘స్పై టూల్స్’’ను అనా ఉపయోగించేవారు.
గంటలపాటు కూర్చొని రహస్య సమాచారాన్ని చదివి ఆమె గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత రాత్రిపూట తన తొషిబా ల్యాప్‌టాప్ సాయంతో ఆ సమాచారాన్ని మళ్లీ టైప్‌చేసి ఫ్లాపీ డిస్కుల్లోకి ఎక్కించేవారు. వీటిని ఏజెంట్లకు ఇచ్చేవారు. అందువల్ల ఆమె ఎలాంటి పత్రాలను ఆఫీసు నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చేది కాదు.మంగళవారం, గురువారం, శనివారం ఒక ఒక షార్ట్‌వేవ్ రేడియోను రాత్రిపూట 9 నుంచి పది మధ్య ఆమె ఉపయోగించేవారు. దానిలో నంబర్లలో ఒక సందేశం వచ్చేది. ‘‘అటెన్షన్ 3, 1, 4,5…’’ ఇలా ఆ సందేశం ఉండేది. దీన్ని ఒక కోడ్ షీట్ సాయంతో ఆమె విశ్లేషించేవారు. ఆ కోడ్ షీట్‌ను నీటిలో పెడితే కరిగిపోయి మాయం అవుతుంది. అలా ఆమె క్యూబా ఏజెంట్ల నుంచి సమాచారం,
అయితే, తను సమాచారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఆ క్యూబా ఏజెంట్లతో భోజనానికి హోటల్‌కు వెళ్లేవారు. ‘‘ఆ హోటల్‌లోనే ఆమె ఫ్లాపీ డిస్కులను అందించేవారు. ఇక్కడ ఎలాంటి టెక్నిక్‌లు ఉండేవి కాదు. ఇది చాలా సాధారణ సమావేశంలా కనిపించేది..అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే, ఆమె పబ్లిక్ ఫోన్ బూత్ ఉపయోగించేవారు. అప్పుడు కూడా కోడ్ భాషలో మాట్లాడేవారు.
అనా వల్ల అమెరికాకు విపరీత నష్టం జరిగినట్లు ల్యాప్ వివరించారు. అమెరికా కోసం పనిచేసే చాలా మందితో ఆమె మాట్లాడేవారు. అసలు క్యూబా నుంచి అమెరికా కోసం ఎవరు పనిచేస్తున్నారో ఆమె తెలుసుకునేవారు. ఫలితంగా క్యూబాలో తమకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారో కనుక్కోవడం అక్కడి ఏజెంట్లకు తేలికయ్యేది.
‘‘ఆమె ల్యాప్‌టాప్ లో చాలా సమాచారం మాకు దొరికింది. క్యూబాలో పనిచేసేందుకు వెళ్లిన నలుగురు అమెరికా గూఢచారుల సమాచారం కూడా దానిలో ఉంది.అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఏజెంట్ గ్రీన్ బెరెట్.. ఎల్ సాల్వడోర్ లో హత్యకు గురికావడం వెనుక కూడా అనా పాత్ర ఉన్నట్లు ఒక మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ ఆరోపించారు.. ఆ ఆరోపణలు మేం నిరూపించలేం. కానీ, ఆయన ఎవరో క్యూబన్లకు ఆమె చెప్పేసి ఉంటారు. ఆయన ఏ మిషన్‌పై వచ్చారో కూడా సమాచారం అందించి ఉంటారు. తన చర్యల వల్ల ఎవరు చనిపోతున్నా.. ఎంత నష్టం జరిగినా.. ఆమె పట్టించుకునేవారు కాదు… అఫ్గానిస్తాన్ లో అమెరికా సైనిక ఆపరేషన్ గురించి కూడా అరెస్టుకు ముందుగా అనా సమాచారం సేకరించారు. బహుశా ఇది క్యూబాకు చేరుంటే.. తాలిబాన్ లేదా అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చల కోసం క్యూబా ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకొని ఉండొచ్చని కూడా విశ్లేషణలు వచ్చాయి.
అయితే, అనాపై అమెరికా అధికారులు అంతకు ముందు నుంచే నిఘాపెట్టారు. సెప్టెంబరు 11 దాడుల నడుమ, వెంటనే అనా అరెస్టు ప్రక్రియల్లో వేగం పెంచారు.
మొత్తంగా అదే ఏడాది సెప్టెంబరు 21న ఆమెను అరెస్టు చేశారు. తను విచారణకు పూర్తిగా సహకరిస్తాని అమెరికా అధికారులతో ఆమె ఒప్పందం చేసుకున్నారు. ఫలితంగా 25 ఏళ్లకు మించి జైలు శిక్ష పడకుండా చూడాలని హామీ తీసుకున్నారు. మొత్తంగా ఏడు నెలలపాటు ఆమె కేసుపై విచారణ జరిగింది.
అయితే, అనా విడుదలపై నేడు క్యూబా ఏజెంట్లలో పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చు.. అమెరికా అధికారుల ఎదుట అనా అన్ని వివరాలు వెల్లడించిన
తర్వాత కూడా క్యూబా ఏజెంట్లలో ఆమెపై ఆసక్తి ఉంటుందని అనుకోవడం లేదు.. క్యూబాకు కూడా ఆమె చాలా నష్టంచేశారు. అందుకే వారు కూడా కోపంగానే ఉండొచ్చు.. ఇప్పుడు ఇటు అమెరికాలో, అటు క్యూబాలో ఎవరూ ఆమెను ‘‘ద క్వీన్ ఆఫ్ క్యూబా’’గా భావించకపోవచ్చు..
యాంకర్ ఎండ్: అమెరికాపై నిఘా పెట్టిన అమెరికా అధికారులు.. ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు.. అధికారుల విచారణకు సహకరిస్తానని ఒప్పందం చేసుకోవడంతో.. ఆమెకు 25 ఏళ్లకు మించి శిక్ష పడకూడదని హామీ తీసుకున్నారు..