ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధర పలికిన స్మృతి మంధానను మరో అదృష్టం వరించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ గా టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నియమితురాలైంది. ఈ మేరకు విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ లో పోటీపడే ఐదు జట్లలో తొలి జట్టు తమ కెప్టెన్ లను ప్రకటించింది. ఈ నెల 13న జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో మంధానకు ఆర్ సీబీ రికార్డు స్థాయి ధర రూ.3.4 కోట్లు చెల్లించింది. మంధానకు కెప్టెన్సీ అప్పగించిన విషయాన్ని పురుషుల జట్టు సీనియర్ బ్యాటర్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్ ప్రకటించారు. ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ వీడియోను ఆర్సీబీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పంచుకుంది. కోహ్లీ, మంధాన ఇద్దరి జెర్సీ నంబర్ 18 కావడం విశేషం. తనకు కెప్టెన్సీ అప్పగించడంపై మంధాన హర్షం వ్యక్తం చేసింది. ఫ్రాంచైజీకి కీర్తిని తీసుకురావడానికి 100 శాతం ప్రయత్నిస్తానని చెప్పింది. కాగా, మార్చి 4 నుంచి మార్చి 26 వరకు జరగనుంది.