Homeఅంతర్జాతీయంభూమి మీద అత్యంత చిన్న మహిళ ?

భూమి మీద అత్యంత చిన్న మహిళ ?

రెండున్నరేళ్ల క్రితం దేశంలో కరోనా మహమ్మారి విజ్రుంభించిన సమయంలో దేశంలోని రాష్ట్రాలలో బాగా ప్రభావితమైంది మహారాష్ట్రా రాష్ట్రం..ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఉన్న నిరక్షరాస్యత కారణంగా జనంలో కరోనా గురించిన అవగాహన లేక విచ్చలవిడిగా వ్యాపించింది. ఆ సమయంలో భూమికి జానెడంత లేని ఓ మహిళ పోలీసులతో కలసి ప్రచారం సాగించారు జ్యోతి ఆమ్గె..ఆమె ప్రపంచంలోనే అతి చిన్న మహిళ. పేరు జ్యోతి అమ్గే. ఉండేది మ‌హారాష్ట్ర‌లో. అయితే.. ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న కరోనాపై పోరుకు ఆమె కూడా రంగంలోకి దిగారు. కోవిడ్‌ 19 వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ముందుకు వ‌చ్చారు. నాగ్‌పూర్‌లో పోలీసుల సహకారంతో ఈ అవ‌గాహ‌న‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. అతి చిన్నగా ఉన్న ఆమె మాట్లాడుతుంటే స్థానికులు ఎంతో ఆస‌క్తిగా విన్నారు.

ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించాల‌ని, లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దంటూ ఆమె అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇవ‌న్నీ పాటించిన‌ప్పుడే క‌రోనా మ‌హ‌మ్మారిని మ‌నం త‌రిమికొట్టగ‌ల‌మ‌ని ఆమె అన్నారు.అంతేగాకుండా.. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డితే.. కుటుంబంలో ఏర్ప‌డే స‌మ‌స్య‌ల‌ను ఆమె తన చిన్ని నోరుతో చేతులు కదలించుకుంటూ వివ‌రిస్తుంటే జనం ఆసక్తిగా వినేవారు. నిజానికి అప్పట్లో దేశంలోకెల్లా మ‌హారాష్ట్ర‌లోనే క‌రోనా వైర‌స్ రెచ్చిపోయి వ్యాపించింది. దేశంలోనే ఈ రాష్ట్రం మొద‌టి స్థానంలో ఉంది. అత్య‌ధిక కేసులు ఇక్క‌డేన‌మోదు అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సెల‌బ్రిటీలు కూడా ప్ర‌య‌త్నం చేసారు. ఆ సెలబ్రిటీలలో ఒకరు జ్యోతి ఆమ్గే..విదర్భ ప్రాంతానికి చెందిన నాగపూర్ లో ఆమె చేసిన ప్రచారం, ఆమె మాటలు జనాన్ని బాగా ప్రభావితం చేసాయి.. కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన జ్యోతి అమ్గే..

లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండాలని ఆమె ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు భౌతిక దూరం ఒక్కటే మార్గమని, ఇందుకోసం లాక్‌డౌన్‌ అ‍మలును ప్రజలు తప్పనిసరిగా పాటించి మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఇందుకోసం ఆమె పోలీసులతో కలిసి నాగపూర్‌ సమీపంలోని ఇతర ప్రాంతాలలో అవగాహన చర్యలు చేపట్టారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌కు ఇంట్లోని ఉండి సహకరించాలని. అదే విధంగా కరోనా వైరస్‌పై పోరాడేందుకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు మద్దతుగా నిలవాలి’ అంటూ సందేశాన్నిచ్చారు. ఆ ప్రచారం జనం మనస్సుల్లోకి చొచ్చుకుపోయింది.

ఆ విషయం కాస్త పక్కన బెడితే 29 ఏళ్ల వయసున్న జ్యోతి కేవలం 62.8 సెంటీమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిచిన్న మహిళగా అప్పటికే గిన్నిస్‌ బుక్‌లోకి చేరింది. ఆమె పూర్తి పేరు ‘జ్యోతి కిసాంజి అమ్గే’ షార్ట్ గా జ్యోతి ఆమ్గే అంటారు. 1993 డిసెంబరు 16న మహారాష్ట్రా నాగపూర్ లో జన్మించిన ఆమె ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు పొందారు. పైగా ఆమె తన చదువును నిర్విఘ్నంగా పూర్తిచేసారు. మీకు తెలుసా..ఆమె తన ఎమ్మే పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు.

తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి కారణంగా కొన్ని ప్రత్యేకమైన సినిమాల్లోనూ సీరియళ్లలోనూ నటించి భారతీయ నటిగా పేరు సంపాదించుకున్నారు. జ్యోతి అమ్గే 2009లో టూ ఫీట్ టాల్ టీన్ అనే డాక్యుమెంటరీలో నటించారు. అలాగే ఆమె భారతీయ పాపులర్ టెలివిజన్ షో అయిన బిగ్ బాస్ 6 లో గెస్ట్ పార్టిసిపెంట్ గా వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. అంతే కాదు.. ఆమె 2014 ఆగస్టు 13న అమెరికన్ హారర్ స్టోరీ అయిన ‘ఫ్రీక్ షో’ నాల్గవ సీజన్‌లో మా పెటైట్ పాత్రలోనూ నటించి యూరప్ దేశాలకు సుపరిచితం అయ్యారు.

ప్రస్తుతం ఆమె మైనపు విగ్రహం లోనావాలాలోని సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో ఉంది. 2011లో జ్యోతి అమ్గే 18వ పుట్టినరోజునాటికి తన ఎత్తు 62.8 సెంటీమీటర్లు..అంటే..2 అడుగులు మాత్రమే..అప్పటికి ఈ ఎత్తు ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి చేరడానికి అర్హత సంపాదించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అధికారికంగా ఆమెను అత్యంత చిన్న మహిళగా ప్రకటించింది. ప్రిమోర్డియల్ డ్వార్ఫిజం అనే జన్యుపరమైన రుగ్మత కారణంగా ఆమె ఎత్తు అంత వరకే పరిమితమైంది. ఆమె ఎంత చురుగ్గా మాట్లాడుతుందో అంత వేగంగా నడవలేదు. కారణం ఆమెలో జన్మతహా వచ్చిన ఓ లోపం కారణంగా కాళ్లు సహకరించవు. ఈ క్రమంలో పన్నెండేళ్ల క్రితం ఆమె రెండు కాళ్లకు అమెరికాలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. కాళ్లకు చికిత్సతో పాటుగా శరీరం వ్రుద్ది చెందకపోవడం అన్న అంశంపై పరిశోధనకు సహకరించారు జ్యోతి ఆమ్గే.

అందుకు ఆమె చేరిన ఆసుపత్రి వాళ్లు తమ కోసం నిర్మించుకున్న డాక్యుమెంటరీకి బదులుగా ఉచితంగా అన్నీ సమకూర్చారు. అయితే చికిత్స కోసం ఆమె నుంచి రక్తం సంగ్రహిస్తున్న నర్సును చూసి భయంతో ఏడుపు మొదలుపెట్టింది జ్యోతి. ఆ తరువాత వారి చికిత్సకు పరిశోధనలకు ససేమిరా అంది. దాంతో ఆమెపై ఆమె తల్లదండ్రులపై సదరు ఆసుపత్రి యాజమాన్యం పలు ఆరోపణలు చేసింది. భారతదేశమే ఇంత అని అభాండాలు వేసేందుకు సిధ్దమైంది. జ్యోతి ఆమ్గే.. ప్రపంచంలోనే అతి చిన్న మోడల్ గా పేరు మోసారు..ఆమె పేరుతో ఉన్న రికార్డ్స్ బోలెడుగా ఉన్నాయి. ఆమె ఎత్తు 2 అడుగుల ముప్పావు అంగుళం మించి ఎత్తు పెరగకపోవడానికి కారణం ఆమెకు ప్రిమోర్డియల్ డ్వార్ఫిజం ఉంది, ఇది జన్యుపరమైన రుగ్మత. 2009లో జ్యోతికి కేవలం 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె అత్యంత పొట్టిగా జీవించే అమ్మాయిగా ఎంపికైంది.

జ్యోతి కంటే ముందు అమెరికాకు చెందిన బ్రిడ్జెట్ జోర్డాన్ ఈ రికార్డును సొంతం చేసుకుంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం జ్యోతి అమ్గే 62.8 సెంటీమీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అతి చిన్న సజీవ మహిళగా నమోదయ్యారు. గతంలో ప్రపంచంలోనే పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన అమెరికాకు చెందిన బ్రిడ్జేట్ జోర్డాన్ కంటే జ్యోతి 6.2 సెంటీమీటర్లు తక్కువ . జ్యోతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచుగా ఫేస్ బుక్, ఇన్ స్టాలో తన ఫోటోలను పంచుకుంటుంది. తనను ఇంటర్వ్యూ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే వారితో బాగా సహకరిస్తుంటారు. అయిదేళ్ల వయసు వరకు జ్యోతి ఇతర చిన్నారుల్లానే సాధారణ ఎత్తు పెరిగిందని ఆమె తల్లి రంజన తెలిపారు.

అయితే ఆ తరువాతే కూతురు జ్యోతి ఎత్తు పెరగడంలో సమస్య తలెత్తిందని గతంలో వెల్లడించారు. వరల్డ్ షార్టెస్ట్ వుమెన్ అయిన జ్యోతి కోసం అమ్గే దుస్తులు, నగలు, ఆమెకు సంబంధించిన పలు వస్తువులు, ఉత్పత్తులు ప్రత్యేకంగా తయారుచేస్తారు. వాటినే ఆమె వినియోగిస్తారు. ఎప్పుడైనా షాపింగ్ కని వెళితే ఆమె వెంట బంధువులు వెళతారు. అక్కడ జ్యోతితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతుంటారు. జ్యోతి చూడ్డానికి చిన్నగానే ఉండొచ్చు..కానీ ఆమె ఆలోచనలు పెద్దగా ఉంటాయి. ఉన్నతంగా ఆలోచించే మెచ్చూరిటీ ఆమెకు వచ్చింది. చిన్నప్పుడు ఆమె ఎక్కడికి వెళితే అక్కడ జనం గుమికూడేవారు. అది కాస్త వింతగా ఆమెకు అనిపించేది. కానీ పోను పోను తనలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగిందని గర్వంగా చెబుతున్నారు జ్యోతి ఆమ్గే..

Must Read

spot_img