Homeసినిమాశివకార్తికేయన్‌ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్

శివకార్తికేయన్‌ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్

సౌత్ సినిమా రేంజ్ మారిపోయింది. బాహుబలి దెబ్బతో తెలుగు సినిమా క్రేజ్ ఖండాంతరాలు దాటడంతో ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగు,తమిళ, కన్నడ హీరోలు ఇతర బాషాల దర్శకులతో సినిమాలు చేయడం ఇతర బాషల హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. మార్కెట్ పెరుగుతున్న దృష్ట్యా హాలీవుడ్ టెక్నిషన్ ను సైతం తమిళ సినిమాలో భాగం చేస్తున్నారు.

రజనీకాంత్, కమలహాసన్, అజిత్, విజయ్… ఇలా టాప్ స్టార్స్ కోలీవుడ్ వెండి తెరను షేక్ చేస్తున్నారు. ఇలాంటి హీరోల మధ్య తనకంటూ…ఒక ప్లేస్ క్రియేట్ చేసుకొని దూసుకెళ్తున్నా శివ కార్తికేయన్. పేరు చిన్న హీరో అయిన 100కోట్ల సినిమాలతో తమిళ ఇండస్ట్రీకి కాసుల పంట పండిస్తున్నాడు. డాక్టర్, డాన్ వంటి సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఈ నయా యంగ్ హీరో. ఇటివల వచ్చిన ప్రిన్స్ సినిమా కాస్తా డిసప్పాయింట్ చేసిన…ఐ డోంట్ కేర్ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ తో ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన మూడు ప్రాజెక్ట్‌లను సెట్స్‌ మీద ఉంచాడు.

మూడు ప్రాజెక్ట్స్ లో ముందు వరుసలో ఉన్న సినిమా మాత్రం అయాలన్ . సై-ఫై కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సీ.జీ వర్క్‌ పనుల్లో బిజీగా ఉంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మేకర్స్‌ వెల్లడించారు. ఈ సినిమాలో సీ.జీ వర్క్‌ ముఖ్య పాత్ర పోషిస్తుందట. దానికి కోసం మేకర్స్‌ భారీగా ఖర్చు పెడుతున్నారని కోలీవుడ్ కోడైకూస్తోంది కాగా సీ.జీ వర్క్‌ కోసం అవతార్‌ సినిమాకు పని చేసిన టెక్నీషియన్లను రంగంలోకి దింపారని తెలుస్తోంది.

ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌ అయింది. అవతార్‌ రేంజ్‌ టెక్నీషియన్‌లు ఈ మూవీకి పనిచేయనుండటంతో అటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను 24AM స్టూడీయోస్‌ బ్యానర్‌పై ఆర్‌.డీ.రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. శివ కార్తికేయన్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ నటిస్తోంది.

ఏర్‌. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.



Must Read

spot_img