HomePoliticsషర్మిల పోటీపై తెలంగాణవ్యాప్తంగా ఆసక్తికర చర్చ.....

షర్మిల పోటీపై తెలంగాణవ్యాప్తంగా ఆసక్తికర చర్చ…..

పాలేరు నుంచి షర్మిల పోటీపై తెలంగాణవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమె పాలేరు నుంచే ఎందుకు బరిలోకి దిగాలనుకుంటున్నారు..? అమెకు కలిసివచ్చే అంశాలేమిటి..? అన్నదే చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో డిసైడ్ అయినట్లే తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తనకు సేఫ్ అని ఆమె భావిస్తున్నారు. వైయస్ షర్మిల పాలేరు నుంచి ఎందుకు పోటీ చేస్తుంది? పాలేరు లో ఆమెకి కలిసివచ్చే అంశాలేంటి? పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తే విజయం సాధిస్తారా? అసలు షర్మిల దృష్టి పాలేరుపై ఎందుకు పడిందన్న చర్చ తెలంగాణవ్యాప్తంగా వెల్లువెత్తుతుతోంది. అయితే వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసిన అప్పటి నుంచి పాలేరు పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన వైఎస్ షర్మిల అక్కడి నుంచే ఎన్నికల బరిలోకి దిగుతారని అనేకమార్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

ఈ మేరకు అక్కడి నుంచే పార్టీ ఎన్నికల కార్యచరణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 16న పాలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్టీపీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లనున్న షర్మిల తన పోటీపై పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం కనపడుతోంది. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది.

పైగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అభిమానులు కూడా ఎక్కువే. సామాజిక వర్గాల పరంగా చూస్తే.. ఇక్కడ రెడ్డి కులానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. వీరితో పాటు గిరిజన ఓటర్లు సెగ్మెంట్‌లో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలిచారు. కానీ ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లోకి వలస వెళ్లారు. అన్ని రకాలుగా పాలేరు నియోజకవర్గం తనకు సేఫ్ అని షర్మిల భావిస్తున్నారు. ఖమ్మం పట్టణానికి ఆనుకొని ఉన్నా.. పూర్తిగా రూరల్ ఓటర్లే ఈ నియోజకవర్గంలో ఉన్నారు.

ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభావం కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని మాజీ మంత్రి తుమ్మల భావిస్తున్నారు. కానీ, ఆయనకు టికెట్ దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇక బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటే పాలేరు నుంచి సీపీఎం పోటీ చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నాయకులు బీఆర్ఎస్‌లోకి వలస వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పార్టీకి బలమైన అభ్యర్థి లేరు. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే షర్మిల పాలేరును ఎంచుకున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. అదే జరిగితే ఇక్కడ పోటీ చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రజల నుంచి ఎంత ఆదరణ ఉందో తెలియదు కానీ.. ఆమెకు మాత్రం ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం ఎడతెగని మోజు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి అవ్వకపోయినా.. అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు మాత్రం ఆమె చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని షర్మిల ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ జైత్రయాత్ర జెండా పాలేరు నుంచే ఎగరాలని అన్నారు. వైఎస్సార్ అంటే ఎక్కువగా అభిమానించే వారంతా పాలేరులోనే ఉన్నారని.. అందుకే ఇక్కడి నుంచి పోటీకి దిగుతున్నానని వెల్లడించారు. అయితే.. తన అభిమతాన్ని ప్రజలపైకి నెట్టేసిన షర్మిల.. ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేయాలనేది ప్రజల కోరిక. వారి కోరిక మేరకు పాలేరు నుంచి పోటీ చేస్తా. వైఎస్ఆర్ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలి.

చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీ కోసం పని చేద్దాం. పాలేరు నియోజకవర్గం దిశా -నిర్దేశం కావాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం
చేయాలని షర్మిల వ్యాఖ్యానించారు. అయితే.. షర్మిల పక్కా లెక్కతోనే ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. పాలేరులో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అదేసమయంలో కమ్మ వర్గం కూడా 20 శాతం వరకు ఉంది. తనే చెప్పుకొన్నట్టుగా.. ఇక్కడ వైఎస్ అభిమానులు కూడా ఉన్న మాట వాస్తవమే. వైఎస్ చొరవతోనే రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. పైగా.. రెడ్డి వర్గం.. అటు ఏపీకి ఇటు తెలంగాణకు కూడా చేరువగా ఉన్న ప్రాంతం ఇది. అంటే రెడ్డి వర్గం తనను గెలిపిస్తుందనే భావనతోనే షర్మిల ఉన్నారనేది పరిశీలకుల అంచనా.

మరోవైపు.. టీఆర్ ఎస్ లో నెలకొన్న వర్గ పోరుపై కూడా షర్మిల దృష్టి పెట్టారు.

2014లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది. అప్పట్లో రామిరెడ్డి వెంకట రెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. అనారోగ్యంతో ఆయన హఠాన్మరణం చెందడంతో టీడీపీ నుంచి టీఆర్ ఎస్లోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు.. 2016లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే.. గత 2018 ఎన్నికల్లో తుమ్మల ఇక్కడ నుంచి ఓడిపోయారు. అయితే.. ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన కందాల ఉపేందర్రెడ్డి తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ను వదిలేసి.. టీఆర్ ఎస్లోకి చేరిపోయారు. దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్లో తుమ్మల వర్సెస్ కందాల మధ్య టికెట్ పోరు అంతర్గతంగా సాగుతోంది.

కేసీఆర్ ఈ టికెట్ ఎవరికి ఇస్తారనేది ఇప్పటికీ తేల్చలేదు. దీంతో టీఆర్ ఎస్లో వర్గ పోరు తారస్థాయికి చేరింది. దీంతో రెడ్డి సామాజిక వర్గం.. తలలు పట్టుకుంది. దీనిని గమనించిన షర్మిల.. వైఎస్ పేరుతో ఇక్కడ సెంటిమెంటును రాజేసి.. తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి.

టీఆర్ ఎస్ అటు తుమ్మలకు ఇచ్చినా.. ఇటు కందాలకు ఇచ్చినా.. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వారిలో వారే.. ఓటమికి ప్రయత్నిస్తే.. అది తనకు పరోపకారంగా మారుతుందనేది షర్మిల వ్యూహం. మొత్తానికి ప్రజల మద్దతుతో కాకుండా.. వైఎస్ సెంటిమెంటు అధికార పార్టీలో ఏర్పడిన లుకలుకలను అడ్డు పెట్టుకుని గెలవాలనేది షర్మిల వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. పాలేరు రాజకీయాల విషయానికి వస్తే పాలేరు కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకింగ్ గా ఉంది. అంతేకాదు పాలేరు లో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉంది. ఇక గిరిజనులు ఉన్నప్పటికీ, గిరిజన ఓటర్లను తమవైపు తిప్పుకోవడం వైయస్ షర్మిల కు అంత పెద్ద కష్టం కాదు.

పదిహేనుసార్లు పాలేరు లో ఎన్నికలు జరిగితే 11 సార్లు కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. అంతగా కాంగ్రెస్ పార్టీకి పాలేరు నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలేరులో విజయం సాధించింది అంటే తెలంగాణలో అధికార పార్టీ ప్రభావం అక్కడ పెద్దగా ఉండదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. పాలేరు నియోజకవర్గంలో దివంగత వైఎస్ఆర్ పరిపాలించిన సమయంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు.

అక్కడ చాలామంది ఇళ్లల్లో ఇప్పటికీ వైఎస్ఆర్ ఫోటోలు కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. వైయస్సార్ కు ఉన్న అభిమానగణం, కాంగ్రెస్ పార్టీకి ఉన్న పట్టుతో అక్కడ కాంగ్రెస్పా ర్టీ గెలిచింది. కందాల టిఆర్ఎస్ బాట పట్టడంతో కాంగ్రెస్ పార్టీలో, ప్రస్తుతం అక్కడ అనిశ్చితి కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు, వై యస్ ఆర్ అభిమానుల ఓటు బ్యాంకు, రెడ్డి సామాజికవర్గం అండదండలు తనకు మెండుగా ఉంటాయని భావిస్తున్న వైయస్ షర్మిల పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో వచ్చే ఎలక్షన్ కి వైయస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటన చేయడంతో పాలేరు సీటు హాట్ సీటుగా మారింది. వైఎస్ షర్మిల పోటీ పక్కా
కావటంతో అక్కడ షర్మిలకు ప్రత్యర్ధులు ఎవరు అన్న చర్చ జోరుగా సాగుతుంది.

మరి పాలేరు .. షర్మిల ను గెలిపిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img