రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్నేషనల్ వైడ్‌గా అదరగొట్టేసింది. హాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది. హాలీవుడ్ డైరెక్టర్లు, క్రిటిక్స్ ఇలా అందరూ కూడా రాజమౌళిని పొగిడేశారు. ఇక ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు రేసులో కూడా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు ఇంట్ ఇచ్చాడు డైరక్టర్ రాజమౌళి.
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ట్రిపుల్ ఆర్ సినిమా సత్తా చాటింది. అద్భుతమైన వసూళ్లు నమోదు చేయడం మాత్రమే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యి అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. ఎన్నో అవార్డులు.. రివార్డులు దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు ఆస్కార్ వేటలో పడింది.
ఆస్కార్ అవార్డు ను దక్కించుకున్నా లేకున్నా కచ్చితంగా నామినేషన్స్ ను దక్కించుకుంటుందని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీలోని మాస్ ట్రాక్ నాటు నాటు బెస్ట్ సాంగ్ నామినేషన్స్ బరిలో నిలిచింది.
ఇప్పటికే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్న ఈ సినిమా ముందు ముందు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయం. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా యొక్క సీక్వెల్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. రాజమౌళి స్వయంగా మీడియాతో సీక్వెల్ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. తాజాగా మరోసారి ఈ సినిమా యొక్క సీక్వెల్ గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా యొక్క సీక్వెల్ స్టోరీ లైన్ కూడా రెడీ అయినట్టు రాజమౌళి పేర్కొన్నారు. సీక్వెల్ కి స్టోరీ లైన్ ఐడియా కీరవాణి ఇచ్చారని రాజమౌళి పేర్కొన్నారు. ఆ ఐడియాతో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. మహేష్ బాబు తో జక్కన్న తదుపరి సినిమా ఉండబోతుంది. రాజమౌళి త్వరలో చేయబోతున్న మహేష్ బాబు సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. సీక్వెల్ కోసం ప్రతి ఒక్క ఇండియన్ సినీ ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు.