ఒక్కసారిగా రష్యాలోని కాస్పియన్ తీరంలో వేలాదిగా సీల్ ప్రాణుల కలేబరాలు కనిపించడంతో జనం విస్తుపోయారు. సముద్ర తీరంలో ఎక్కడ చూసినా ఇదే విషాదద్రుశ్యం కనిపించింది. ఇంతకీ అవి ఉన్నట్టుండి ఎందుకు చనిపోయాయి. వాతావరణ మార్పులు లేదా పర్యావరణ కాలుష్యాలే కారణమా అన్న విషయంపై పరిశోధకులు ద్రుష్టిపెట్టారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండున్నర వేల సీల్స్ జీవచరాలు ఒక్కసారిగా రష్యా సముద్రతీరం వెంట చనిపోయి కనిపించాయి. ఎటు చూసినా చనిపోయి ఒడ్డుకు చేరిన సీల్ కలేబరాలు జనాన్ని బాగా కదిలించాయి. ఇంతకీ అవి ఎందుకు మృత్యువాత పడ్డాయి? కాస్పియన్ సముద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద లోతట్టు నీటి వనరుగా చెబుతున్నారు.రష్యా, కజకిస్తాన్, అజర్‌బైజాన్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్ దేశాలు ఈ సముద్రం చుట్టూ ఉంటాయి. రష్యాలోని డాగేస్తాన్ తీరానికి ఇటీవల పెద్ద సంఖ్యలో సీల్స్ కొట్టుకొస్తున్నాయి. ఏ ఒక్కటి కూడా సజీవంగా లేదు. అన్నీ మరణించిన సీల్స్.. ఒకటో, రెండో చనిపోయి తీర ప్రాంతానికి కొట్టుకువస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయిన సీల్స్ ఇలా కొట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది.
మొదట 700 సీల్స్ చనిపోయాని గుర్తించారు. కానీ వీటి లెక్క రెండున్నర వేలకు పైగా ఉండటం కలకలం రేపింది. గత రెండు వారాలుగా కాస్పియన్ సముద్ర తీరంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా ఈ సీల్స్‌ను చంపేసి ఇక్కడ పడేశారా అనే అనుమానం కూడా వచ్చింది.. అయితే వీటిని వేటాడి ఇక్కడి తీసుకొచ్చిన ఆనవాళ్లు, అంత అవసరం ఎక్కడా కనిపించలేదు. పోనీ తీరానికి వచ్చిన సీల్స్‌కు ఎవరైనా హింసించి చంపేశారా అంటే, అలాంటి పరిస్థితులు కూడా లేవని స్పష్టంగా తెలుస్తోంది.. కాస్పియన్ సముద్రంలో సహజ కారణాలవల్లే సీల్స్ చనిపోయాయిని డాడేస్తాన్ నేచురల్ రిసోర్సెస్ మినిస్ట్రీ చెబుతోంది. ఒక్కసారిగి ప్రక్రుతిలో వచ్చిన అసాధారణ మార్పులే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నివేదిక ప్రకారం సీల్స్ కాస్పియన్ సముద్రంలో ఉన్న ఏకైక క్షీరదాలు చెబుతున్నారు. ఇవి 2008 నుండి అంతరించిపోతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రాణలు 3 లక్షల వరకూ ఉంటాయని అంచనాలున్నాయి. కాస్పియన్ సీల్స్‌ను అంతరిస్తున్న ప్రాణులుగా గుర్తించి రెడ్ లిస్టులో చేర్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాణులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. చనిపోయిన సీల్స్ నుంచి నమూనాలను సేకరించి పరిశోధనలు మొదలు పెట్టారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా కాస్పియన్ తీరంలో వేల సంఖ్యలో మృత్యువాత పడిన సీల్స్ గురించి ఆందోళన వ్యక్తమౌతోంది. ఇంత పెద్ద సంక్యలో జీవుల మరణాలపై పరిశోధన జరుగుతోంది.

అంతరించిపోతున్న జాతుల్లో ఒకటైన సీల్స్ సముద్ర జీవుల మరణాలకు కారణం మానవ తప్పిదాలు కూడా కావచ్చన్న అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో గాలం, వల, ఉచ్చు లాంటి చేపలవేట సామగ్రి ఏటా దాదాపు ఆరున్నర లక్షల టన్నులు పోగుపడుతోందని ఓ అంచనా. సముద్రంలో, తీరంలో ఇవి శరీరానికి చుట్టుకొని ఎన్నో ప్రాణులు చనిపోతున్నాయి. ప్రాణాలు తీస్తున్న ఈ ఫిషింగ్ గేర్‌ను పర్యావరణ సంరక్షకులు ‘ఘోస్ట్ గేర్’ అని పిలుస్తారు. ఈ సామగ్రి చేపల బోట్లు, ఫిషింగ్ గ్రౌండ్ల నుంచి ప్రమాదవశాత్తూ పడిపోవడమో లేదా తుపాన్ల లాంటి అత్యవసర పరిస్థితుల్లో దీనిని పడేయడమో జరుగుతుంటుంది. సముద్ర జీవులను పట్టుకోవడానికి వీలుగా ఈ సామగ్రిని తయారుచేస్తారు.
సముద్రంలో కోల్పోయిన, లేదా వదిలేసిన చాలా కాలం తర్వాత కూడా అవి అదే పనిచేస్తుంది. ఇలా కోల్పోయిన సామగ్రి తన కాలం చెల్లిన తర్వాత కూడా చేపలను పట్టుకొంటూ ఉంటే దీనిని ‘ఘోస్ట్ ఫిషింగ్’ అంటారని ఆయన తెలిపారు. ఇది సముద్రజీవులకు అత్యంత ప్రమాదకరమైన సామగ్రిగా మారుతుంది. ఎందుకంటే వాటికి ఈ చెత్తలో చిక్కుకుపోయే ముప్పు దాగి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా, పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి లాంటి ప్రాంతాల్లోనూ ఈ చెత్త పెద్దయెత్తున పేరుకుపోతోంది. ఇది సముద్ర కాలుష్యం కిందకు వస్తుంది. బహుషా ఈ కాలుష్యాలే ఇప్పుడు కాస్పియన్ సముద్రతీరం వెంట సీల్స్ మరణాలకు కారణం కావచ్చని అంటున్నారు నిపుణులు.