Homeఅంతర్జాతీయంసౌదీ అరేబియా పౌరసత్వ చట్టం..

సౌదీ అరేబియా పౌరసత్వ చట్టం..

  • సౌదీ అరేబియా పౌరసత్వం జారీ చేసే విషయంలో కీలక మార్పులు చేసింది..
  • కింగ్ సాల్మన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఓ రాయల్ డిక్రీ జారీ చేశారు.
  • ఈ మేరకు సౌదీ అరేబియాలో పౌరసత్వ నిబంధనలు మారిపోనున్నాయి.
  • సౌదీ అరేబియా కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి..?
  • సౌదీలో ఉంటోన్న ఇండియన్స్ కు ఇక నుంచి సులువుగా పౌరసత్వం రానుందా… ?
  • కింగ్ సాల్మన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఓ రాయల్ డిక్రీలో వెలువరించిన నిబంధనలు ఏంటి..?

సౌదీ అరేబియాలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే పర్యవసనాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. అయితే కొన్ని నిబంధనలకు సడలింపునిస్తూ పౌరసత్వం జారీ చేసే విషయంలో సౌదీ అరేబియా కీలక మార్పులు చేసింది. సిటిజన్‌ షిప్ నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. కింగ్ సాల్మన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఓ రాయల్ డిక్రీ జారీ చేశారు. ఈ మేరకు సౌదీ అరేబియాలో పౌరసత్వ నిబంధనలు మారిపోనున్నాయి.

ఓ వ్యక్తి సౌదీ అరేబియా పౌరసత్వం పొందాలంటే ఏయే అర్హతలుండాలో స్పష్టంగా తేల్చి చెప్పారు. అయితే…ఈ కొత్త నిబంధనలతో ఎవరి పౌరసత్వాన్నీ రద్దు చేయడం లేదని, కొత్తగా కొంత మందికి పౌరసత్వం ఇస్తామని వెల్లడించింది ప్రభుత్వం.

అందుకోసం Saudi Arabian Citizenship Act లోని ఆర్టికల్ 8లో మార్పులు చేర్పులు చేశారు. అవేంటంటే… సౌదీ మహిళలు వేరే దేశం వాళ్లను వివాహమాడితే..ఆ దంపతులకు పుట్టే చిన్నారులకు 18 ఏళ్లు దాటాక ఆ మహిళ సౌదీ అరేబియా పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చు. రాయల్ డిక్రీ జారీతో ఈ భారీ మార్పు చేశారు.

పురుషులకు సౌదీ అరేబియా పౌరసత్వం ఉంటే వాళ్లకు పుట్టే చిన్నారులకూ సిటిజన్‌ షిప్ వచ్చేస్తుంది. ఒకవేళ భార్యకు సౌదీ అరేబియా పౌరసత్వం ఉండి భర్త వేరే దేశానికి చెందిన వాడైతే పిల్లలు పుట్టాక వాళ్లకు 18 ఏళ్లు దాటాకే పౌరసత్వం ఇస్తారు. మరో కండీషన్ ఏంటంటే…ఓ చిన్నారికి సౌదీ అరేబియా పౌరసత్వం రావాలంటే కచ్చితంగా గల్ఫ్‌ దేశాల్లోనే పుట్టి ఉండాలి.

పిల్లలకు 18 ఏళ్లు దాటగానే సిటిజన్‌ షిప్ ఇచ్చే మాట నిజమే. అయితే.. అది జారీ చేసే సమయంలో క్యారెక్టర్‌ ని కూడా పరిశీలిస్తారట. వాళ్లపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. అరబిక్ భాష కూడా తప్పకుండా తెలిసుండాలి. ఈ కండీషన్స్ అన్నీ మ్యాచ్ అయితేనే అప్పుడు ఆ పిల్లలకు పౌరసత్వం ఇస్తారు.

  • సౌదీ అరేబియాలో లక్షలాది మంది భారతీయలు…!

సౌదీ అరేబియాలో లక్షలాది మంది భారతీయలు నివసిస్తున్నారు. వీరిలో కొందరు భారతీయులు సౌదీ మహిళల్ని పెళ్లి చేసుకున్నారు. గతంలో అక్కడి సిటిజన్‌ షిప్ పొందాలంటే ఎన్నో అడ్డంకులు ఉండేవి. ఎక్కువగా పురుషులకే పౌరసత్వం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు మార్పులు చేయడం వల్ల మహిళలకూ పౌరసత్వం దక్కనుంది. సౌదీలోనే సెటిల్ అయిన భారతీయులకు ఇది ఎంతో మేలు చేయనుంది.

చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. మరి కొందరు పెద్ద వ్యాపారాలు కూడా చేస్తున్నారు. తమ పిల్లలకు పౌరసత్వం రావాలంటే ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇకపై సులువుగా సిటిజన్‌షిప్ వచ్చే అవకాశాలున్నాయి.

యూఏఈలోని అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణం జరుగుతోంది. దీనిపై యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులు రివ్యూ చేస్తున్నారు కూడా. చాలా గ్రాండ్‌గా ఈ ఆలయాన్ని నిర్మించాలని ఆయన భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి భక్తులు వచ్చి ఈ ఆలయ దర్శనం చేసుకునేలా తీర్చి దిద్దుతున్నారు. సాదాసీదాగా కాకుండా కళ్లు చెదిరేలా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు.

BAPS Swaminarayan Sanstha ఈ ఆలయ నిర్మాణం చేపడుతోంది. ఈ సంస్థకు చెందిన బ్రహ్మవిహారి దాస్‌ దగ్గరుండి మరీ ఈ పనులను చూస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవలే ఈయన ఇండియాకు వచ్చినప్పుడు ఈ టెంపుల్ గురించి పలు విషయాలు వెల్లడించారు..

ఓ హిందూ ఆలయ నిర్మాణంపై మహమ్మద్ బిన్ జాయేద్ ఇంతలా ఆసక్తి చూపుతుండటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అంతే కాదు. దీనిపై ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తున్నారని వెల్లడించారు. అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణం జరుగుతుండటమే అద్భుతమైన విషయమని ఆనందం వ్యక్తం చేశారు.

సౌదీలో ప్రవాసీలు కుటుంబ సభ్యులను తమతో పాటు ఉంచుకోవడానికి వీసాలను జారీ చేస్తారు. దీనిని ప్రతి కుటుంబ సభ్యుడిపై ఏడాదికి 2వేల రియళ్ల ఫీజుతో పాటు వైద్య బీమా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రవాస భారతీయులు సులభంగా లభించే విజిట్‌ వీసాలపై తల్లిదండ్రులు, భార్యా పిల్లలను తీసుకురావడం అనేది సర్వసాధారణంగా మారింది. ఇలా వీసాలు క్రమేపి పెరుగుతుండటంతో దీనిని నిలిపివేశారు.

మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎవరైనా విజిట్‌ వీసాలను ఏడాది వరకు రెన్యువల్‌ చేసుకోవాలని అనుకుంటే ఫ్యామిలీ వీసా కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. తాజాగా సౌదీ అరేబియా సిటిజన్‌ షిప్ నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలతో ఎవరి పౌరసత్వాన్నీ రద్దు చేయడం లేదని, కొత్తగా కొంత మందికి పౌరసత్వం ఇస్తామని వెల్లడించడం ఊరట కలిగిస్తోంది..

మరోవైపు.. పర్యాటక రంగంను అభివృద్ధి చేసేందుకు సైతం సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది… పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సౌదీ సర్కార్ భావించిన నేపథ్యంలో చాలా వరకు కఠిన నిబంధనలను తొలగిస్తోంది. అంతేకాదు మహిళలు తప్పనిసరిగా బుర్ఖాలు ధరించాల్సిన పనిలేదని చెబుతూ… కురచ దుస్తులను వేసుకోరాదని పేర్కొంది. ఇక మద్యంను కూడా నిషేధించింది. కొన్ని దశాబ్దాలుగా సౌదీ అరేబియాలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అయితే గత కొద్ది కాలంగా ఈ నిబంధనలకు స్వస్తి పలుకుతోంది అక్కడి సర్కార్.

సౌదీ అరేబియాలో పౌరసత్వం విషయంలో కొత్తగా జారీ చేసిన నిబంధనలు భారతీయులకు ఎంతో మేలు చేయనున్నాయి.. గతంలో అక్కడి సిటిజన్‌ షిప్ పొందాలంటే ఎన్నో అడ్డంకులు ఉండేవి. ఎక్కువగా పురుషులకే పౌరసత్వం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు మార్పులు చేయడం వల్ల మహిళలకూ పౌరసత్వం దక్కనుంది.

Must Read

spot_img