Homeఅంతర్జాతీయంఆండ్రాయిడ్ ఫోన్లకు శాటిలైట్ కనెక్టివిటీ రానుంది.

ఆండ్రాయిడ్ ఫోన్లకు శాటిలైట్ కనెక్టివిటీ రానుంది.

కొత్త భాగస్వామ్యంతో ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లకు శాటిలైట్ కనెక్టివిటీ రానుంది.శాటిలైట్ కనెక్టివిటీ ఉంటే, మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా శాటిలైట్ సహాయంతో ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపడం, తిరిగి పొందడం సాధ్యమవుతుంది.శాటిలైట్స్‌ తో ఫోన్లు అనుసంధానం కావడం వల్ల ఇది సాధ్యపడుతుంది.

ఆండ్రాయిడ్ ఆధారిత అనేక స్మార్ట్‌ఫోన్లలో క్వాల్‌కామ్ చిప్‌లు ఉంటాయా…? శాటిలైట్ కనెక్టివిటీ కేవలం అత్యవసర సమయాల్లో సందేశాలు పంపడానికి, తిరిగి పొందడానికి మాత్రమే అందుబాటులోకి రానుందా..?.

దికన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2023 క్వాల్కమ్ ఆవిష్కరించింది..క్వాల్‌కామ్, ఇరిడియం, గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ మధ్య ఉపగ్రహ ఆధారిత కనెక్టివిటీ ఒప్పందం సంతకం చేయబడింది. సంవత్సరం చివర్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించడం, మా స్నాప్‌డ్రాగన్ ప్లాట్‌ఫారమ్‌ కు ఈ కొత్త జోడింపు బహుళ పరికరాల వర్గాలలో శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు.. సేవా ఆఫర్‌ లను ఎనేబుల్ చేయడంలో మాకు బలమైన స్థానం కల్పిస్తుంది” అని సెల్యులార్ మోడెమ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్.. జనరల్ మేనేజర్ దుర్గా మల్లాది క్వాల్కమ్ టెక్నాలజీస్, ఒక ప్రకటనలో తెలిపారు.

స్నాప్ డ్రాగన్ శాటిలైట్ మొత్తం ప్రపంచాన్ని పోల్ నుండి పోల్‌కు కవర్ చేస్తుంది. అత్యవసర ఉపయోగం, ఎస్ఎంఎస్ టెక్స్టింగ్, ఇతర మెసేజింగ్ అప్లికేషన్‌ ల కోసం సందేశాలను అందజేస్తుందని కంపెనీ పేర్కొంది.. రిమోట్, గ్రామీణ ,ఆఫ్‌షోర్ స్థానాలకు, అలాగే అత్యవసర పరిస్థితులు, వినోదాలకు అనువైనది.”ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్నాప్‌డ్రాగన్ శాటిలైట్‌కు మద్దతు ఇచ్చే శాటిలైట్ నెట్‌వర్క్‌గా ఇరిడియం గర్వపడుతోంది” అని ఇరిడియం యొక్క సీఈవో , మాట్ దేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

“మా నెట్‌వర్క్ ఈ సేవ కోసం రూపొందించబడింది – మా అధునాతన, LEO ఉపగ్రహాలు ప్రపంచంలోనిప్రతి భాగాన్ని కవర్ చేస్తాయి..

పరిశ్రమ-ప్రముఖ స్నాప్‌డ్రాగన్ శాటిలైట్ ద్వారా ప్రారంభించబడిన శాటిలైట్-పవర్డ్ సర్వీస్‌లకు అనువైన తక్కువ-శక్తి, తక్కువ-లేటెన్సీ కనెక్షన్‌లకు మద్దతు ఇస్తాయి,” అని ఆయన వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు.. క్వాల్కమ్ ఉపగ్రహం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, వాహనాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి కూడా మద్దతు ఇవ్వగలదు.

శాటిలైట్ ఫోన్ సంస్థ ‘ఇరిడియం’, చిప్ తయారీ దిగ్గజం ‘క్వాల్‌కామ్’ల మధ్య కుదిరిన కొత్త భాగస్వామ్యంతో ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లకు శాటిలైట్ కనెక్టివిటీ రానుంది. శాటిలైట్ కనెక్టివిటీ ఉంటే, మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా శాటిలైట్ సహాయంతో ఫోన్ల నుంచి మెసేజ్‌లు పంపడం, తిరిగి పొందడం సాధ్యమవుతుంది. శాటిలైట్స్‌ తో ఫోన్లు అనుసంధానం కావడం వల్ల ఇది సాధ్యపడుతుంది.ఆండ్రాయిడ్ ఆధారిత అనేక స్మార్ట్‌ఫోన్లలో క్వాల్‌కామ్ చిప్‌లు ఉంటాయి. ఐఫోన్ 14 ఫోన్‌లో కూడా శాటిలైట్ ఫీచర్ ఉంటుందని 2022 సెప్టెంబర్ 14న ఆపిల్ కంపెనీ ప్రకటించింది.

ప్రస్తుతానికైతే శాటిలైట్ కనెక్టివిటీ కేవలం అత్యవసర సమయాల్లో సందేశాలు పంపడానికి, తిరిగి పొందడానికి మాత్రమే అందుబాటులోకి రానుంది.

ఆపిల్ కంపెనీని వెనక్కి నెడుతూ సొంతంగా శాటిలైట్ సర్వీస్‌ ను ఆవిష్కరించిన తొలి సంస్థ ‘బుల్లిట్’. ఇది బ్రిటిష్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు.

ఇది కూడా అత్యవసర వినియోగం కోసమే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది.క్వాల్‌కామ్ – ఇరిడియం మధ్య కొత్త భాగస్వామ్యం కారణంగా లక్షలాది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ శాటిలైట్ సర్వీస్అం దుబాటులోకి రానుంది.అయితే, ఫోన్ తయారీదారులు ఈ ఫీచర్‌ ను ఫోన్‌ లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఇరిడియం అనేది అసలైన ఉపగ్రహ ఫోన్ వ్యవస్థ. 1997లో ఇది తొలి శాటిలైట్‌ను కక్షలోకి పంపింది. 2019లో తన 75 స్పేస్‌క్రాఫ్ట్‌ల నెట్‌వర్క్‌ను రీఫ్రెష్ చేసింది. ఈ శాటిలైట్లు తక్కువ కక్షలో మొత్తం భూగోళాన్ని కవర్ చేస్తాయి. భూమికి 780 కి.మీ ఎత్తులో ఇవి ఉంటాయి. ఈ ఉపగ్రహ సమూహాలు
ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతూ, డేటాను బదిలీ చేసుకోగలవు.

స్నాప్‌ డ్రాగన్ శాటిలైట్ అని పిలిచే ఈ కొత్త ఫీచర్‌ ను తొలుత ప్రీమియం చిప్‌లలో మాత్రమే పొందుపరుస్తామని, అందుకే బడ్జెట్ ఫోన్లలో ఈ ఫీచర్ ఉండే అవకాశం లేదని క్వాల్‌కామ్ చెప్పింది.. కానీ, భవిష్యత్‌ లో ఇది టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ లు, చివరకు వాహనాల్లో కూడా విస్తరిస్తుందని తెలిపింది. కేవలం అత్యవసర కమ్యూనికేషన్‌ కే పరిమితం కాకుండా అన్ని సమయాల్లో ఉపయోగపడేలా ఉంటుందని వెల్లడించింది.

ఈ సేవ పొందాలంటే ఫీజు చెల్లించాల్సి ఉండొచ్చు.శాటిలైట్ కనెక్టివిటీ అనే ఫీచర్ ‘నాన్ స్పాట్స్’ ప్రాంతాల్లో అంటే మొబైల్ కవరేజ్ లేని ప్రాంతాల సమస్యలను పరిష్కరిస్తుంది. గ్రామీణ,మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య చాలా సాధారణం.

ఇప్పటికే ఈ ఫీచర్ విజయవంతమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ వంటి సర్వీసులు మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కవరేజీని
అందిస్తున్నాయి.

శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ అనేది చాలా వేగంగా ఉంటుంది. నమ్మదగినది కూడా. కానీ కేబుల్, ఫైబర్ కనెక్షన్లతో పోలిస్తే ఇది చాలా ఖరీదైనది., భారత్, చైనా వంటి దేశాలు శాటిలైట్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించాయి. కాబట్టి స్థానిక ప్రభుత్వాల నిబంధనలకు లోబడి ఈ ఫీచర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

యాంకర్ ఎండ్: క్వాల్‌కామ్ – ఇరిడియం మధ్య కొత్త భాగస్వామ్యం కారణంగా లక్షలాది స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ శాటిలైట్ సర్వీస్ అందుబాటులోకి రానుంది.అయితే, ఫోన్ తయారీదారులు ఈ ఫీచర్‌ ను ఫోన్‌ లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

Must Read

spot_img