Homeసినిమాసంక్రాంతి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు..

సంక్రాంతి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు..

మరో మూడు వారాల్లో సంక్రాంతి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డిలతోపాటు విజయ్ వారసుడు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఆ సినిమాలు విడుదలకు ముందు క్రిస్మస్ కానుకగా ఈ వారం మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇదో మినీ సంక్రాంతి సమరం అన్నట్లుగా కొనసాగబోతున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

క్రిస్మస్ కి పలు సినిమాలు థియేటర్లకి క్యూ కట్టాయి. రిలీజ్ వాయిదా పడ్డ వాటిలో రవితేజ ధమాకా సహా పలు టాప్ హీరోల సినిమాలు ఉన్నాయి.నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్ ఈ వీక్ లోనే వస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ గా రూపొంది…పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని అలరించడం ఖాయం అంటూ ధీమాతో ఉన్నారు.

ఇక 18 పేజెస్ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తికేయ 2 వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత నిఖిల్ నుండి వస్తున్న సినిమా ఇది. దీంతో సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి.

అందుకు తగ్గట్లుగా 18 పేజెస్ సినిమా ఉంటుందని ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన కనెక్ట్ సినిమా కూడా ఈ క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొత్తానికి ఈ మూడు సినిమాలు కూడా మినీ సంక్రాంతి సమరం ను తలపిస్తున్నాయి అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా మంచి క్రేజ్ దక్కించుకుని పాజిటివ్ బజ్ తో విడుదల కాబోతున్నాయి. కనుక ప్రతి ఒక్క సినిమా కూడా మినిమం ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ రన్ లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.

Must Read

spot_img