సంక్రాంతి సమరం రోజు రోజుకు హీట్ పుట్టిస్తోంది. మేకర్స్ సైతం రెండు సినిమాలకు పోటాపోటీగా ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అంటూ టైం చూసి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి నుంచి ఫస్ట్ సింగిల్ జై బాలయ్య పాట హ్యూజ్ సక్సెస్ అందుకుంది . అదే వాల్తేరు వీరయ్య నుంచి బాస్ పార్టీ యావరేజ్ గా నిలిచింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తమన్ వర్సెస్ దేవిశ్రీ ఫైట్ కూడా టఫ్ గా నడుస్తుంది . కాహా సెకండ్ సింగిల్ గా రీసెంట్ గా బాలయ్య, శృతిహాసన్ కి సంబంధించిన మాస్ రొమాంటిక్ సాంగ్ సుగుణసుందరి రిలీజ్ అయింది .
ఎవరు ఊహించిన విధంగా బాలయ్య ఈ సాంగ్లో లవర్ బాయ్ లుక్ లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. దీంతో అభిమానులకి ఈ పాట తెగ నచ్చేసింది. వాల్తేరు వీరయ్య నుంచి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు . ఈ సాంగ్ కొందరు జనాలకు నచ్చుతున్న మరికొందరు జనాలకు అంతగా ఆకట్టుకోలేకపోతుంది. విడి విడి గా చూస్తే పాట బానే ఉన్న వీరసింహారెడ్డి లోని సుగుణసుందరి పాటతో కంపేర్ చేస్తే మాత్రం ఈ పాట యావరేజ్ టాక్ కూడా దక్కించుకోవడం లేదు .
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ శ్రీదేవి పాటను ట్రోల్ చేస్తున్నారు . బాలయ్య సుగుణసుందరినే ది బెస్ట్ గా ఉందని శ్రీదేవి.. అంతగా ఆకట్టుకోలేదని చెప్తున్నారు . అంతేకాదు శ్రీదేవి సాంగ్లో చిరంజీవి శృతిహాసన్ స్టెప్స్ రొమాంటిక్ లుక్స్ కొరియోగ్రఫీ బాగున్నా.. బీట్ మెగా ఫాన్స్ కి పూనకాల తెప్పించలేకపోతుందని.. సుగుణసుందరి పాటలోని బీట్ తో కంపేర్ చేస్తే ఈ పాట సోషల్ మీడియాలో తేలిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే ఈ సినిమా రిలీజ్ అయ్యి అసలు టాక్ బయటకు వచ్చేవరకు సోషల్ మీడియాలో ఈ మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ గోల కొనసాగుతూనే ఉంటుంది . మరి మీకు ఏ పాట నచ్చింది..? వాల్తేరు వీరయ్య లోని శ్రీదేవి సాంగ్ నా..? వీరసింహారెడ్డి లోని సుగుణసుందరి సాంగా నా..? మీ అభిప్రాయాని కామెంట్స్ లో తెలియజేయండి