సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటు ఎమోషనల్ నోట్‌లు, కోట్స్ పెడతూ ఉండే సమంత ఇప్పుడు గుడి బాట పట్టింది. నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్న తర్వాత సమంతకు సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అవుతోంది. ఇటీవలే ఆమెకు మాయోసైటిస్ అనే వ్యాధి సోకడంతో సామ్ అభిమానులు ఒక్క సారిగా షాక్ కు గురియ్యారు. చాలా రోజులు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్న సమంత రీసెంట్ గా తిరిగి బయటకొచ్చింది. మాములుగానే సమంత ఎక్కువగా భక్తి మార్గంలో పయనించే నటి. నాగ చైతన్యతో బ్రేకప్ సమయంలో సామ్ ఇండియాలో ప్రముఖ దేవాలయాలను సందర్శించి ఆలయాల్లో ప్రత్యుక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజాగా తన ఆరోగ్యం నార్మల్ స్థితికి చేరుకున్న వెంటనే సమంత తన తదుపరి చిత్రాల షూటింగ్స్, ఇతర కార్యక్రమాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్ట్స్ లతో బిజీగా ఉంది. అయినప్పటికీ తన ఆధ్యాత్మిక బాటని వదిలి మాత్రం వదిలిపెట్ట లేదు. తమిళనాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయాన్ని సమంత సందర్శించింది. అరుళ్ ముగు శ్రీ దండాయుధపాణి స్వామి క్షేత్రం అని కూడా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించాలి అంటే 600 మెట్లు ఎక్కాలి.
కొండ కింది నుంచి పై వరకు మెట్టు మెట్టుకు హారతి వెలిగించుకుంటూ వెళ్లింది. మెట్టు మెట్టుకు హారతి వెలిగిస్తూ…దండాలు పెడుతూ ఆధ్యాత్మిక చింతనలో ఉండిపోయింది సమంత. మరోసారి ఇలా భక్తి మార్గంలో సమంతను చూసి ఆమె ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు. సమంత పూర్తిగా అనారోగ్యం నుంచి బయటపడింది కాబట్టే మళ్ళీ ఇలా టెంపుల్స్ దర్శించుకుంటోంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సామ్ ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ రూపకర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్‌లో జాయిన్ అయింది. ఇక త్వరలోనే విజయ్ దేవరకొండ ఖుషీ షూటింగ్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తుంది.