Homeసినిమావెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టిన సాయిపల్లవి...

వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టిన సాయిపల్లవి…

తెలుగు హీరోయిన్లలో సాయి పల్లవికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సాయి పల్లవికి దక్షిణాదిలో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినిమాల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్త పడుతుంది. అందుకే దర్శకులు కూడా సాయి పల్లవి రోల్ ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. దీంతో ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ… వెబ్ సిరీస్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

సాయి పాల్లవి…. తక్కువ సమయంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. గ్లామర్ షోతో కాకుండా…తెలుగింటి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. స్కీన్ షో ఉంటే అది స్టార్ హీరో బడా డైరెక్టర్ చిత్రమైన నో చెబుతుంది. అందుకే సినిమా ఫలితాలతో సంబంధంగా లేకుండా వ్యక్తిగతంగా ఆమెను అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. తెలుగులో ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకుందనే చెప్పాలి. ఫిదా తర్వాత సాయి పల్లవికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ కానీ కంటెంట్ పాత్ర ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఎంసీఏ ,శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ చిత్రాలతో మెప్పించిన ఈ అమ్మడు.. చివరిసారిగా విరాటపర్వం సినిమాతో ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ నేచురల్ బ్యూటీ మరో ప్రాజెక్టు చేయబోతుందని సమాచారం. అది సినిమా కాదండోయ్.. ఒక వెబ్ సిరిస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే శేకర్ కమ్ముల అసిస్టెంట్ డైరెక్టర్ ఓ నెట్ ఫ్లిక్స్ లో ఓ వెబ్ సిరిస్ చేయబోతున్నారట.

అయితే దీనికి సాయి పల్లవి అయితే సెట్ అవుతుందని.. ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. ఈ దర్శకుడు కథను కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇక ఈ కథకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే పట్టాలెక్కనుంది. సాయి పల్లవి ఇంతకు ముందు కూడా పావ కధైగల్ అనే వెబ్ సిరిస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ శివ కార్తికేయన్ హీరోగా చేస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ధనుష్ 50వ సినిమాలో కూడా సాయి పల్లవిని ఎంపిక చేసినట్లుగా టాక్. ఈ చిత్రానికి ఆమె కూడా ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

Must Read

spot_img