ఒక్క సినిమా… డైరెక్టర్ ను స్టార్ డైరెక్టర్ గా చేస్తోంది. ఇందుకు ఎవరు మినహాయింపు కాదు. ఇలానే పుట్టుకొచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి. తెరకెక్కించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. RX 100 అతడికి ఊహించని బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ కనిపించడం లేదు ఈ స్టార్ డైరెక్టర్. ఇంతకీ RX 100 దర్శకుడు ఏం చేస్తున్నాడు..?
RX100’ సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోహీరోయిన్లుగా నటించగా, బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టడంతో కార్తికేయతో పాటు పాయల్ రాజ్ పుత్ కూడా టాలీవుడ్ కి పరిచయమై క్రేజీగా అవకాశాలు అందుకుంది కానీ అజయ్ భూపతి ఇంకా అక్కడే ఉన్నాడు. అతడి ద్వితీయ ప్రయత్నం విఫలమైంది.
శర్వానంద్ – సిద్ధార్థ్ లతో అజయ్ తదుపరి మహాసముద్రం ఫ్లాపవ్వడం తనను తీవ్రంగా నిరాశపరచగా తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అప్పటి నుంచి అజయ్ గ్రేట్ కంబ్యాక్ కోసం చాలా తపిస్తున్నాడు. కానీ కొన్ని ప్రయత్నాలు సరిగ్గా సెట్ కాలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే సొంత బ్యానర్ ఎ క్రియేటివ్ వర్క్స్ ను ప్రారంభించానని అజయ్ భూపతి ప్రకటించారు.
అయితే అజయ్ భూపతి తదుపరి ఏం చేయబోతున్నాడు? అన్నదానికి ఇంకా సమాధానం రాలేదు. కార్తికేయతో అజయ్ భూపతి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. మరోవైపు బెల్లంకొండ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస్ కి శాటిలైట్ డిజిటల్ బిజినెస్ ఘనంగా ఉండడం అతడికి ప్లస్ కానుంది. అజయ్ భూపతి హిందీ సినిమా చేస్తున్నాడన్న టాక్ ఉంది. కానీ దాని గురించి సరైన సమాచారం తెలియాల్సి ఉంది.