భారత్ పై అమెరికా, యూరప్ దేశాలు చేస్తున్న ఆరోపణలపై ఒక్క మాట తో జవాబు చెప్పింది రష్యా. అసలు ఇంతకు ఏం జరిగిందంటే..ఒకవైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. మరోవైపు రష్యాపై పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షలు. ఈ టైంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ సమావేశం కావాల్సి ఉంది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సమావేశం రద్దు అయినట్లు ఇరు దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు జీ 20 సదస్సులో రష్యాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మన ప్రధాని మోడీ. అప్పుడు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పీక్స్ లో ఉన్న సమయం. ఆ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇది యుద్ధాల సమయం కాదు.. శాంతి సమయం అని ప్రధాని మోడీ సందేశం ఇచ్చారు. ఆ స్టేట్ మెంట్ ని రష్యా అంగీకరించింది కూడా. తాము కూడా శాంతినే కోరుకుంటున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు.
అయితే భారత్, రష్యా మధ్య రెండుసార్లు చర్చలు జరిగాక.. మళ్లీ కూర్చుని మాట్లాడుకునేంత పెద్ద విషయాలు ఏమీ లేవు. అందువల్ల రష్యాతో భారత్ మళ్లీ ఎలాంటి చర్చలు జరపలేదు. ఇంకా లోతుగా చర్చించుకుంటే.. భారత్, రష్యా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు బయటకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే చమురు దగ్గరనుంచి యుద్ధ విమానాల వరకు అన్ని రకాల ఎగుమతులు, దిగుమతులు ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నాయి. రష్యా దగ్గర్నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటుంది. రష్యా కూడా భారత్ నుంచి పలు ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటుంది. ఈ సమయంలో పుతిన్ తో జరగాల్సిన భేటీ రద్దు అవడంతో.. దీన్ని అమెరికా, యూరప్ వంటి పాశ్చాత్య దేశాలు వక్రీకరించి రాశాయి.

ఉక్రెయిన్ పై రష్యా అణ్వాయుధాలు వాడుతామని గతంలో పుతిన్ ప్రకటన చేసినందుకే భారత్ చర్చలు జరపట్లేదని ఆరోపణలు సంధించింది. అమెరికా, యూరప్ దేశాలు చేస్తున్న ప్రచారాన్ని మాత్రం అటు జెలెన్ స్కీ కూడా నమ్మడంలేదు. ఉక్రెయిన్ ఎప్పుడూ భారత్ ని మిత్ర దేశంగా భావిస్తుందని ఆయన స్పష్టం చేశాడు. అందుకే అమెరికా, యూరప్ దేశాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఉక్రెయిన్ తేలిగ్గా కొట్టి పారేసింది. కాగా, భారత్ పై ప్రపంచ దేశాలు చేస్తున్న ఆరోపణలపై ఒక్క ప్రకటనతోనే స్వస్తి చెప్పింది రష్యా. భారత్ తో రష్యా సంబంధాలు కొనసాగుతున్నాయని, చమురు, యుద్ధ విమానాల అమ్మకాల విషయంలో, చర్చల రద్దుపై వస్తున్న వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని మీడియా ప్రకటన విడుదల చేసింది.